Zelio E-Mobility 2026 Gracy Scooter | రూ.60వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు.. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అక్కర్లేదు..
Zelio E-Mobility 2026 Gracy Scooter | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జిలియో ఇ-మొబిలిటీ (Zelio E-Mobility) మార్కెట్‌లో నూతన ఎలక్ట్రిక్ టూవీలర్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని రైడ్ ఏషియా ఈవీ ఎక్స్‌పో2026లో పాల్గొన్న ఈ కంపెనీ తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రేసీ 2026 ఎడిషన్‌ను విడుదల చేసింది.
Automobiles | Published On Apr 25, 2026, 11.59 am IST
Zelio E-Mobility 2026 Gracy Scooter | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జిలియో ఇ-మొబిలిటీ (Zelio E-Mobility) మార్కెట్‌లో నూతన ఎలక్ట్రిక్ టూవీలర్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని రైడ్ ఏషియా ఈవీ ఎక్స్‌పో2026లో పాల్గొన్న ఈ కంపెనీ తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రేసీ 2026 ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.59,999 ఉండగా, గరిష్ట ధర రూ.76,999గా ఉంది. రోజూ చాలా తక్కువ దూరం ప్రయాణించే కాలేజీ విద్యార్థులు, మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది.
రిజిస్ట్రేషన్, లైసెన్స్ అక్కర్లేదు..
ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని వల్ల స్కూటర్‌కు రిజిస్ట్రేషన్, వాహనం నడిపేవారికి లైసెన్స్ అవసరం లేదు. ఒకసారి చార్జ్ చేస్తే 60 నుంచి 120 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. 60/72 వోల్ట్ బీఎల్‌డీసీ మోటార్‌తో పనిచేసే ఈ వాహనం పూర్తి చార్జ్‌కు సుమారు 2 యూనిట్ల విద్యుత్ ను వినియోగిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ నాలుగు బ్యాటరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలు 60V/32AH, 72V/32AH ఆప్షన్‌లలో, అలాగే లిథియమ్ అయాన్ బ్యాటరీలు కూడా అదే కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. లిథియమ్ అయాన్ బ్యాటరీలు 4 నుంచి 5 గంటల్లో చార్జ్ అవుతాయి, లెడ్ యాసిడ్ బ్యాటరీలకు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది.
ఉచితంగా హెల్మెట్ పంపిణీ..
సేఫ్టీ, రైడింగ్ పరంగా ఈ స్కూటర్ కు ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అలాగే టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ స్ప్రింగ్ సస్పెన్షన్‌తో వస్తుంది. రెండు చక్రాలకూ 90/90-12 టైర్లను ఇచ్చారు. యూజర్ ఫీచర్లలో సెంట్రల్ లాకింగ్‌తో యాంటీ-థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్, కీ లెస్ డ్రైవ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ మీటర్ ఉన్నాయి. అలాగే 50 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఇంతటి స్టోరేజ్ కలిగిన వాహనం ఇదేనని కంపెనీ పేర్కొంది. మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌పై రెండు సంవత్సరాల వారంటీని కూడా అందిస్తున్నారు. స్నో పెర్ల్ వైట్, బ్రైట్ బ్లాక్, ఏషియన్ బ్లాక్, యెల్లో, నోబుల్ మెటల్ గ్రే, ఫ్లోరోసెంట్ గ్రీన్, హిబిస్కస్ పర్పుల్ వంటి 7 కలర్ ఆప్షన్‌లలో ఈ స్కూటర్ లాంచ్ అయింది. ప్రారంభ ఆఫర్‌గా మొదటి 500 మంది కొనుగోలుదారులకు ఉచిత సేఫ్టీ హెల్మెట్ ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
యువత కోసం ప్రత్యేకంగా డిజైన్..
జిలియో ఇ-మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ గ్రేసీ 2026 భారత యువత అభిరుచులను ప్రతిబింబించేలా ఉంటుందని తెలిపారు. తక్కువ బరువు, స్టైలిష్ డిజైన్, విశ్వసనీయ పనితీరుతో ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. కాగా 2021లో స్థాపించబడిన జిలియో ఇ-మొబిలిటీ హర్యానాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. సంవత్సరానికి 72వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ సంస్థ, 2 లక్షలకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 500కి పైగా అవుట్‌లెట్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలకు సమీపంలో ఉన్న జిలియో ఇ-మొబిలిటీ స్టోర్ లేదా అధికారిక ఫ్రాంచైజీని సంప్రదించవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Cruise Control Feature | కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. ఇప్పుడు టూవీలర్లలోనూ.. టాప్ 5 మోడల్స్ ఇవే..
మే 4, 2026

Old Chetaks | పాతకాలం నాటి చేతక్ స్కూటర్.. ఎలక్ట్రిక్ వెర్షన్లో.. 80 కిలోమీటర్ల మైలేజ్..
మే 3, 2026

BYD Electric | BYD ఎలక్ట్రిక్ అద్భుతం.. 9 నిమిషాల్లోనే కార్ ఫుల్ చార్జ్.. 630 కిలోమీటర్ల మైలేజ్..
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



