త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Old Chetaks | పాత‌కాలం నాటి చేత‌క్ స్కూట‌ర్‌.. ఎల‌క్ట్రిక్ వెర్ష‌న్‌లో.. 80 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

Old Chetaks | భార‌త్‌లో ద్విచ‌క్ర వాహనాల చ‌రిత్ర‌లో స్కూటర్లు ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికీ వీటి సౌకర్యవంతమైన వినియోగం, విస్తారమైన లెగ్‌రూమ్, సులభమైన డ్రైవింగ్ కారణంగా చాలా మందికి ఇవే మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి.

S

Automobiles | Published On May 3, 2026, 2.32 pm IST

Old Chetaks | పాత‌కాలం నాటి చేత‌క్ స్కూట‌ర్‌.. ఎల‌క్ట్రిక్ వెర్ష‌న్‌లో.. 80 కిలోమీట‌ర్ల మైలేజ్‌..
Advertisement

Old Chetaks | భార‌త్‌లో ద్విచ‌క్ర వాహనాల చ‌రిత్ర‌లో స్కూటర్లు ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికీ వీటి సౌకర్యవంతమైన వినియోగం, విస్తారమైన లెగ్‌రూమ్, సులభమైన డ్రైవింగ్ కారణంగా చాలా మందికి ఇవే మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు బజాజ్ చేతక్, ఎల్ఎంఎల్ వెస్పా వంటి స్కూటర్లు కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా ప్రజల రోజువారీ జీవితంలో భాగమై త‌ర‌తరాల జ్ఞాపకాలను ముద్రించాయి. ఆధునిక స్కూటర్లు కొత్త డిజైన్, టెక్నాలజీతో ముందుకు సాగుతున్నప్పటికీ, ఆ పాతకాలపు ప్రత్యేక ఆకర్షణ మాత్రం నెమ్మ‌దిగా కనిపించకుండా పోయింది. అయితే ఆ పాతకాలపు స్టైల్‌ను మళ్లీ అనుభవించాలనుకునే వారికి ఇప్పుడు ఒక కొత్త అవకాశం వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లో సూరజ్ కశ్యప్ అనే యూజ‌ర్‌ షేర్ చేసిన వీడియోలో ఆర్‌సీజే సంస్థ రూపొందించిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపించింది. ఇది పూర్తిగా పాతకాలపు స్కూటర్‌లా కనిపించినప్పటికీ, లోపల మాత్రం ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

80 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

ఇది రీస్టోర్ చేసిన వింటేజ్ మోడల్‌లా అనిపిస్తుంది. కానీ సంప్రదాయ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉండడం దీని ప్రత్యేకత. పాతకాలపు లుక్‌తోపాటు ఆధునిక ప్రయోజనాలు కలిపిన ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సుమారు రూ.70వేల‌ ధరలో అందుబాటులో ఉండడం దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. ఈ స్కూటర్‌లో ఆధునిక డిజిటల్ ఫీచర్లు ఎక్కువగా ఉండవు. బదులుగా స్పీడ్ వంటి ప్రాథమిక సమాచారం చూపించే అనలాగ్ క్లస్టర్ మాత్రమే ఉంటుంది. ఇది పూర్తిగా పాతకాలపు డిజైన్‌ను కొనసాగిస్తూ సింపుల్ అనుభవాన్ని ఇస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, ఈ ఆర్‌సీజే ఎలక్ట్రిక్ స్కూటర్ ను నగర ప్రయాణాల కోసం రూపొందించారు. గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయ‌వ‌చ్చు.

3 గంట‌ల్లో చార్జింగ్‌..

250 వాట్ల సామర్థ్యం గల హబ్ మౌంటెడ్ బీఎల్డీసీ మోటార్ ఈ స్కూట‌ర్‌లో ఉంది. బ్యాటరీ సామర్థ్యం 1.54 కిలోవాట్ అవర్ నుంచి 2.3 కిలోవాట్ అవర్ వరకు ఉంటుంది. పోర్టబుల్ చార్జర్‌తో దాదాపు 3 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. సస్పెన్షన్ పరంగా ముందు, వెనుక హైడ్రాలిక్ డ్యాంపర్లు ఉండగా, బ్రేకింగ్ కోసం డ్రమ్ బ్రేక్‌లు ఉపయోగించారు. 12 డిగ్రీల గ్రేడ‌బిలిటీతో స్వల్ప ఎత్తైన మార్గాల్లో కూడా సులభంగా వెళ్తుంది. పాతకాలపు ఆకర్షణను కోల్పోకుండా ఆధునిక అవసరాలకు సరిపోయే ఈ స్కూటర్ నగర వినియోగానికి అనువైన ఎంపికగా నిలుస్తోంది. అయితే ఈ స్కూట‌ర్ కావాల‌నుకునే వారు ఆర్‌సీజే డీల‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement