Amazon Store | టూ వీలర్ కొనుగోళ్లలో అమెజాన్ స్టోర్ దూకుడు.. చిన్న పట్టణాల నుంచే భారీ డిమాండ్..
Amazon Store | దేశంలో ఆన్‌లైన్ టూ వీలర్ కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టియర్-2, టియర్-3 నగరాల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ రావడంతో అమెజాన్ ఇండియా టూ వీలర్ స్టోర్ ఏడాది కాలంలో రెండు రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ టూ వీలర్లు, సంప్రదాయ కమ్యూటర్ బైక్‌ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.
Technology | Published On Jun 12, 2026, 5.27 pm IST
Amazon Store | దేశంలో ఆన్‌లైన్ టూ వీలర్ కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టియర్-2, టియర్-3 నగరాల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ రావడంతో అమెజాన్ ఇండియా టూ వీలర్ స్టోర్ ఏడాది కాలంలో రెండు రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ టూ వీలర్లు, సంప్రదాయ కమ్యూటర్ బైక్‌ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమెజాన్ లో 20కి పైగా బ్రాండ్లకు చెందిన టూ వీలర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ట్రయంఫ్, కేటీఎం, రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 3వేలకు పైగా ఓఈఎం-అధీకృత డీలర్లు ఈ మార్కెట్‌ప్లేస్‌కు మద్దతు ఇస్తున్నారు. వాహన కొనుగోలుదారులు ఇప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా ప్రీమియం ఫీచర్లు, కనెక్టెడ్ టెక్నాలజీలు, అధునాతన భద్రతా వ్యవస్థలు, దీర్ఘకాలిక విలువ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అమెజాన్‌లో కొనుగోలవుతున్న టూ వీలర్‌ల సగటు విలువ ప్రస్తుతం రూ.1 లక్షకు మించి ఉండటం వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పును సూచిస్తోంది.
భారీగా అమ్మకాల వృద్ధి..
సంస్థ ఈ సందర్బంగా పలు ముఖ్యమైన వృద్ధి గణాంకాలను వెల్లడించింది. ప్రీమియం మోటార్‌సైకిళ్లు అమ్మకాల్లో దాదాపు 5 రెట్లు వృద్ధి సాధించగా, కమ్యూటర్ బైక్‌లు 2 రెట్లు, ఐసీఈ స్కూటర్లు 1.5 రెట్లు, రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల మధ్య ధర ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్లు మొత్తం ఈవీ డిమాండ్‌లో 50 శాతానికి పైగా వాటాను సాధించాయి. ప్రవేశ స్థాయి ఈవీల నుంచి మధ్య-ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీ మోడళ్ల వైపు వినియోగదారులు మళ్లుతున్నారని అమెజాన్ పేర్కొంది. అమెజాన్ టూ వీలర్ విక్రయాల్లో ప్రధానంగా నాన్-మెట్రో మార్కెట్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్లాట్‌ఫామ్‌లో టూ వీలర్ కొనుగోలు చేస్తున్న వినియోగదారుల్లో దాదాపు మూడింట రెండొంతులు టియర్-2, టియర్-3 నగరాల నుంచే వస్తున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఈ సంఖ్య 70 శాతానికి చేరుకుంది.
అనేక విధాలుగా చెల్లింపులు..
కొన్ని నగరాల్లో బుకింగ్‌లు భారీగా పెరిగాయి. కాకినాడ, తిరుపతి, నెల్లూరులలో 12 రెట్లు వరకు వృద్ధి నమోదు కాగా, నాగౌర్, జింద్ లలో 6 రెట్లు, జామ్‌నగర్, బిలాస్‌పూర్, రాజ్‌కోట్ లలో 6 రెట్ల వరకు వృద్ధి నమోదైంది. పూర్నియా, సమస్తిపూర్ లో 7 రెట్లు వరకు వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో 2,300కు పైగా టియర్-3 పట్టణాల వినియోగదారులు మొదటిసారిగా అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో టూ వీలర్ కొనుగోలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఇది భారత వినియోగదారుల కొనుగోలు అలవాట్లలో వస్తున్న పెద్ద మార్పును సూచిస్తోంది. అమెజాన్ టూ వీలర్ స్టోర్‌లో ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కమ్యూటర్ మోడళ్లు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌లోని ప్రతి డీలర్ ఓఈఎం-అధీకృత డీలర్ కావడంతో అసలైన ఉత్పత్తులు, తయారీదారు వారంటీ వినియోగదారులకు లభిస్తాయి. వినియోగదారులు 24×7 ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. వివిధ బ్రాండ్లు, ఫ్యూయల్ రకాల మోడళ్లను పోల్చుకోవచ్చు. ధ్రువీకరించిన యజమానుల సమీక్షలు, రేటింగ్‌లు చూడవచ్చు. తమ పిన్ కోడ్ ఆధారంగా ఎక్స్-షోరూమ్ ధరలను తెలుసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై జీరో ఎంఢీఆర్ ఛార్జీలు, ప్రతి ఆర్డర్‌పై మోసాల నుంచి రక్షణ కూడా అందుబాటులో ఉన్నాయి.

సహాయం చేసే ఏఐ టూల్స్..
టూ వీలర్ కొనుగోలు ముందు పరిశోధన, పోలికలను సులభతరం చేసేందుకు అమెజాన్ ఏఐ ఆధారిత టూల్స్‌ను అందిస్తోంది. రూఫస్ - రేంజ్, మైలేజ్, ఫీచర్లు, అనుకూలతలపై ప్రశ్నలకు సమాధానాలు అందించే ఏఐ షాపింగ్ అసిస్టెంట్ గా అందుబాటులో ఉంది. లెన్స్ ఏఐ - రోడ్డుపై కనిపించిన వాహనాన్ని ఫొటో ద్వారా గుర్తించి శోధించే సౌకర్యం కల్పిస్తుంది. రివ్యూ సమ్మరీస్ - వినియోగదారుల అభిప్రాయాలను సంక్షిప్తంగా అందించే ఫీచర్ ఇది కాగా, ప్రైస్ హిస్టరీ - ధరల మార్పులను చూపించి కొనుగోలు సమయాన్ని నిర్ణయించేందుకు సహాయం చేస్తుంది. ఈ టూల్స్ వినియోగదారుల పరిశోధన సమయాన్ని తగ్గించి మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయని అమెజాన్ తెలిపింది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు అనేక రివార్డులు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
బ్యాంకు ఆఫర్లు సైతం..
ప్రైమ్ సభ్యులకు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అపరిమిత 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నాన్-ప్రైమ్ వినియోగదారులకు అపరిమిత 3 శాతం క్యాష్‌బ్యాక్ ను ఇస్తారు. రూ.2,500 వరకు వెల్కమ్ రివార్డులు, అర్హులైన వినియోగదారులకు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.60వేల వరకు తక్షణ క్రెడిట్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, అప్లయెన్సెస్‌పై రోజుకు రూ.99 ఈఎంఐ స్టోర్ సౌకర్యం, రివార్డ్స్ గోల్డ్ ద్వారా 15కు పైగా బ్రాండ్లు, కేటగిరీలపై హామీ 5 శాతం క్యాష్‌బ్యాక్ ను ఇస్తున్నారు. అలాగే ప్రైమ్ సభ్యులకు రూ.799కు పైబడిన ఆర్డర్లపై 5 శాతం తగ్గింపు, ఇతర వినియోగదారులకు రూ.499కు పైబడిన ఆర్డర్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ను ఇస్తున్నారు.
ఒకే వేదికపై అనేక సేవలు..
ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా హోమ్, కిచెన్ అండ్ అవుట్‌డోర్స్ డైరెక్టర్ అమన్ లోహన్ మాట్లాడుతూ భారథ్‌లో టూ వీలర్ కొనుగోలు ప్రక్రియ అనేక ఎంపికలు, ఫ్యూయల్ రకాలు, ధరల కారణంగా క్లిష్టంగా మారుతుందని చెప్పారు. ముఖ్యంగా మెట్రో నగరాలకు వెలుపల ఎంపికలు పరిమితంగా ఉండే పరిస్థితుల్లో, అమెజాన్ ఒకే వేదికపై విస్తృత శ్రేణి బ్రాండ్లు, ధరలు, ఫ్యూయల్ రకాలను అందిస్తూ వినియోగదారులకు సౌలభ్యం కల్పిస్తోందన్నారు. గత రెండేళ్లలో ఎంపికలు, టూల్స్, సేవల పరిధిని విస్తరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
సంబంధిత వార్తలు

Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..
జూన్ 2, 2026

PM E-Drive | ఈవీ టూవీలర్లకు మళ్లీ సబ్సిడీ.. కేంద్రం కొత్త ప్లాన్..
మే 25, 2026

Electric Vehicles | ఎలక్ట్రిక్ వాహనాలను కొంటే పన్ను మినహాయింపు పొందవచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?
మే 23, 2026
తాజావార్తలు
- ●Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!
- ●Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
- ●Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..
- ●Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు
- ●Harish Rao | గుర్తు పెట్టుకో రేవంత్.. నీకు డిపాజిట్లు కూడా రావ్
- ●TG ICET 2026 | టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల.. మెరిసిన అమ్మాయిలు

Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!

Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!

Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..

Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు



