త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp Feature | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌ మెసేజ్‌ హిస్టరీ పేరుతో సరికొత్త ఫీచర్‌..!

WhatsApp Feature | మెటా కంపెనీ వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త తెలిపింది. గ్రూప్‌లలో కొత్తగా చేరే సభ్యుల కోసం ‘గ్రూప్ మెసేజ్ హిస్టరీ’ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటివరకు గ్రూప్‌లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే, వారు చేరకముందు జరిగిన చాట్ వివరాలు వారికి కనిపించేవి కావు. దీంతో పాత మెసేజ్‌ల కోసం ఇతర సభ్యులను అడగాల్సి వచ్చేది.

P

Technology | Published On Feb 21, 2026, 9.45 am IST

WhatsApp Feature | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌ మెసేజ్‌ హిస్టరీ పేరుతో సరికొత్త ఫీచర్‌..!
Advertisement

WhatsApp Feature | మెటా కంపెనీ వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త తెలిపింది. గ్రూప్‌లలో కొత్తగా చేరే సభ్యుల కోసం ‘గ్రూప్ మెసేజ్ హిస్టరీ’ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటివరకు గ్రూప్‌లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే, వారు చేరకముందు జరిగిన చాట్ వివరాలు వారికి కనిపించేవి కావు. దీంతో పాత మెసేజ్‌ల కోసం ఇతర సభ్యులను అడగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పడనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్‌లోకి తాజాగా వచ్చిన సభ్యులు కూడా గతంలో వచ్చిన సందేశాలను చూడగలుగుతారు. అయితే, ఆ మెసేజ్ హిస్టరీ ఆటోమేటిక్‌ కనిపించదు. అడ్మిన్, గ్రూప్‌లోని ఎవరైనా సభ్యుడు ఆ హిస్టరీని షేర్ చేయాలి. అలా షేర్ చేసిన తర్వాతే కొత్త సభ్యులకు పాత చాట్‌లు అందుబాటులోకి వస్తాయి.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయంతోనే పనిచేస్తుంది. అంటే వ్యక్తిగత చాట్‌ల మాదిరిగానే గ్రూప్ చాట్‌లూ పూర్తిగా సురక్షితంగానే ఉంటాయి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సంస్థ స్పష్టం చేసింది. కొత్తగా చేరిన సభ్యులు కనీసం 25 నుంచి గరిష్టంగా 100 వరకు తాజా మెసేజ్‌లను చూడగలరని తెలిపింది. దీంతో పాత సమాచారాన్ని తెలుసుకోవడానికి గ్రూప్‌లో పైకి స్క్రోల్ చేస్తూ వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. అవసరమైన విషయాలు నేరుగా అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకు గ్రూప్‌లో ముందుగా జరిగిన చర్చలను తెలుసుకోవాలంటే స్క్రీన్‌షాట్‌లు పంపడం, ఒక్కో మెసేజ్‌ను వేర్వేరుగా ఫార్వర్డ్ చేయడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ ఫీచర్‌తో అలాంటి అవసరం తగ్గుతుంది. గ్రూప్ మెస్సేజ్‌లు మరింత సులభంగా, సక్రమంగా కొనసాగుతాయని కంపెనీ భావిస్తోంది.

ప్రస్తుతం ఆఫీసుల్లో, హౌసింగ్‌ సొసైటీలు, ఫ్యామిలీ గ్రూప్స్‌లో వాట్సాప్‌ గ్రూప్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా చేసిన వారికి తక్షణ సమాచారం అందించడం గ్రూప్‌ సమన్వయంతో సులభమవుతుంది. అయితే, హిస్టరీగా షేర్ అయ్యే ఈ మెసేజ్‌లు సాధారణ చాట్‌ల కంటే కాస్త భిన్నంగా కనిపిస్తాయి. దీంతో అవి ప్రత్యేకంగా గుర్తించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ దశలవారీగా విడుదల చేస్తోంది. త్వరలోనే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నది. ఇక వాట్సాప్ వెబ్ వినియోగదారుల కోసం వాయిస్, వీడియో కాలింగ్ ఫెసిలిటీని తీసుకువస్తుంది. ఇప్పటికే కొందరు యూజర్లకు తమ చాట్ విండోలోనే వాయిస్, వీడియో కాల్ బటన్స్‌ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండగా, ప్రారంభంగా వ్యక్తిగత చాట్‌ల నుంచే కాల్ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తర్వాతలోనే ఈ ఫీచర్‌ని అందరికీ విస్తరించే అవకాశం ఉన్నది.

Advertisement
Advertisement