త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

vivo V70 | వి70 సిరీస్‌లో వివో కొత్త ఫోన్లు.. నైట్ టెలిఫొటో కెమెరా, భారీ బ్యాట‌రీ..

vivo V70 | మొబైల్స్ త‌యారీదారు వివో మరో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వి70, వి70 ఎలైట్ పేరిట ఈ ఫోన్ల‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ఫోన్ల‌లో 6.59 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. వీటికి 1.5కె రిజ‌ల్యూషన్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 20, 2026, 6.44 am IST

vivo V70 | వి70 సిరీస్‌లో వివో కొత్త ఫోన్లు.. నైట్ టెలిఫొటో కెమెరా, భారీ బ్యాట‌రీ..
Advertisement

vivo V70 | మొబైల్స్ త‌యారీదారు వివో మరో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వి70, వి70 ఎలైట్ పేరిట ఈ ఫోన్ల‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ఫోన్ల‌లో 6.59 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. వీటికి 1.5కె రిజ‌ల్యూషన్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ డిస్‌ప్లేలు క్వాలిటీగా ఉంటాయి. అద్భుత‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా క‌నిపించేలా ఈ ఫోన్‌ల‌కు 5000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌ను గోల్డెన్ గ్రిప్ సైజ్ ప్ర‌కారం డిజైన్ చేసిన‌ట్లు కంపెనీ తెలిపింది. అంటే సింగిల్ హ్యాండ్‌తోనూ ఈ ఫోన్ల‌ను సుల‌భంగా ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది. నాణ్య‌మైన ఎరో స్పేస్ గ్రేడ్ లోహంతో ఈ ఫోన్ల‌ను రూపొందించిన‌ట్లు కంపెనీ తెలిపింది. క‌నుక ఇవి చాలా దృఢంగా ఉంటాయ‌ని, అంత సుల‌భంగా ప‌గ‌ల‌వ‌ని వివో వెల్ల‌డించింది.

రాత్రి పూట కూడా ఫొటోలు..

ఈ ఫోన్ల‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ నైట్ టెలిఫొటో కెమెరాను ఇచ్చారు. అందువ‌ల్ల రాత్రి పూట కూడా 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌తో ఫొటోల‌ను స్ప‌ష్టంగా తీసుకోవ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ కెమెరాకు 100ఎక్స్ వ‌ర‌కు డిజిట‌ల్ జూమ్ కూడా ల‌భిస్తుంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌ధాన సెన్సార్ 50 మెగాపిక్స‌ల్ ఇచ్చారు. ఈ ఫోన్ల‌కు ఏఐ ఫొటోగ్ర‌ఫీ సూట్ పేరిట ప్ర‌త్యేక సాఫ్ట్ వేర్ ఇస్తున్నారు. క‌నుక యూజ‌ర్లు తాము తీసిన ఫొటోల‌ను ఏఐ స‌హాయంతో అద్భుతంగా మ‌లుచుకోవ‌చ్చు. ఇక వి70 ఎలైట్ ఫోన్‌లో అధునాత‌న స్నాప్ డ్రాగ‌న్ 8ఎస్ జెన్‌3 ప్రాసెస‌ర్‌ను ఇవ్వ‌గా, వి70 మోడ‌ల్‌లో మాత్రం స్నాప్ డ్రాగ‌న్ 7ఎస్ జెన్‌4 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. క‌నుక ప‌నితీరులో వి70 ఎలైట్ మెరుగ్గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

భారీ బ్యాట‌రీ, 4 ఓఎస్ అప్‌డేట్స్‌..

ఈ ఫోన్ల‌కు ప్ర‌త్యేకంగా వీసీ కూలింగ్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. అందువ‌ల్ల గేమ్స్ లేదా వీడియోల కోసం ఫోన్ల‌ను ఎంత తీవ్రంగా ఉప‌యోగించిన‌ప్ప‌టికీ అంత త్వ‌ర‌గా హీట్‌కు గురి కావు. ఈ ఫోన్ల‌లో 3డి అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఎస్‌6 ల‌భిస్తుంది. ఈ ఫోన్ల‌కు 4 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్ డేట్స్‌ను, 6 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ చెబుతోంది. వీటికి ఐపీ68, 69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని వీటిల్లో ఇచ్చారు. ఈ ఫోన్ల‌కు 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. క‌నుక ఫోన్ల‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు.

ధ‌ర వివ‌రాలు..

వివో వి70 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.45,999 ఉండ‌గా, 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.49,999గా నిర్ణ‌యించారు. వివో వి70 ఎలైట్ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.51,999గా ఉంది. 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర‌ రూ.56,999 ఉండ‌గా, 12జీబీ, 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.61,999గా ఉంది. ఈ ఫోన్ల‌కు ప్రీ బుకింగ్స్‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు. వివో ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ ఈ నెల 26వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. అన్ని ప్ర‌ధాన బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ను ఇస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే 10 శాతం అద‌న‌పు బోన‌స్ ల‌భిస్తుంది. 18 నెల‌ల వ‌ర‌కు ఈఎంఐ స‌దుపాయం, జీరో డౌన్ పేమెంట్ వంటి ఆప్ష‌న్ల‌ను ఇస్తున్నారు. ఆఫ్ లైన్‌లో ఈ ఫోన్‌ల‌ను కొంటే ఒక సంవ‌త్స‌రం పాటు ఉచితంగా అద‌న‌పు వారంటీని కూడా పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement