vivo Ignite 4th edition | పాఠశాల విద్యార్థులకు వివో ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్.. రూ.40 లక్షలు గెలుచుకునే చాన్స్..
vivo Ignite 4th edition | మొబైల్స్ తయారీ సంస్థ వివో ఇండియా "వీవో ఇగ్నైట్: టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్" నాలుగో ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫ్లాగ్‌షిప్ విద్యా కార్యక్రమంగా వివో ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్న ఈ ప్రాజెక్టులో దేశవ్యాప్తంగా 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు.
Technology | Published On Apr 28, 2026, 3.43 pm IST
vivo Ignite 4th edition | మొబైల్స్ తయారీ సంస్థ వివో ఇండియా "వీవో ఇగ్నైట్: టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్" నాలుగో ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫ్లాగ్‌షిప్ విద్యా కార్యక్రమంగా వివో ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్న ఈ ప్రాజెక్టులో దేశవ్యాప్తంగా 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టుల ద్వారా వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని యువతను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యమని సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీస్) లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించామని వివో వెల్లడించింది.
విద్యార్థులకు మెంటార్‌షిప్..
విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా ముగ్గురు సభ్యులతో కలిసి గ్రూప్‌గా ఇందులో పాల్గొనవచ్చు. ప్రాజెక్టులను ప్రోటోటైప్ కేటగిరీలో మూల్యాంకనం చేస్తారు. ఇందులో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్స్, సాఫ్ట్-టెక్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్ వంటి అంశాలు ఉంటాయి. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ (https://vivoignite.com/) ద్వారా జూన్ 30 వరకు స్వీకరిస్తారు. ఇక 4వ ఎడిషన్‌లో పలు మార్పులు చేశారు. ఈ ఏడాది కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు మూడు కీలక మార్పులు తీసుకొచ్చారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించారు. అచీవర్ 30లో భాగంగా టాప్ 200 నుంచి టాప్ 10 మధ్య కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ విద్యార్థులకు నిపుణుల నుంచి మెంటార్‌షిప్ అందిస్తారు. అలాగే టీచర్ ఇన్నోవేషన్ గ్రాంట్ లో భాగంగా స్టెమ్ విద్యను ప్రోత్సహించే ఉపాధ్యాయులకు రూ.50వేల గ్రాంట్ ఇవ్వనున్నారు.
7 దశల్లో ప్రోగ్రామ్, రూ.40 లక్షల స్కాలర్‌షిప్స్..
ఈ పోటీ మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. అక్టోబర్ 11న న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఫైనల్‌తో ముగుస్తుంది. టాప్ 10 ఫైనలిస్టులు తమ ప్రోటోటైప్‌లను జ్యూరీ ముందు ప్రదర్శించి, మొత్తం రూ.40 లక్షల విద్యా స్కాలర్‌షిప్స్, రివార్డ్స్ కోసం పోటీ పడతారు. ఇక మొదటి దశలో భాగంగా ముందుగా విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రెండో దశలో ఐడియాలను సమర్పించాల్సి ఉంటుంది. మూడో దశలో టాప్ 200 విద్యార్థులను వారి ఐడియాలను బట్టి ఎంపిక చేస్తారు. తరువాత నాలుగో దశలో మెంటారింగ్, ప్రోటోటైప్ సమర్పణ ఉంటాయి. 5వ దశలో అచీవర్ 30ని ఎంపిక చేస్తారు. 6వ దశలో నిపుణుల మూల్యాంకనం ఉంటుంది. 7వ దశగా నేషనల్ ఫైనల్ ను నిర్వహిస్తారు.
గతేడాది విశేష స్పందన..
ఈ కార్యక్రమాన్ని వివో సంస్థ గత 3 ఏళ్లుగా ఎన్‌సీఈఆర్‌టీ, ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా వంటి సంస్థలతో కలిసి నిర్వహిస్తోంది. గతేడాది కార్యక్రమంలో 37వేలకి పైగా రిజిస్ట్రేషన్లు రాగా, 9వేలకు పైగా పాఠశాలలు, 660కు పైగా జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. గత ఎడిషన్‌లో విజేతలుగా ఏఐ పవర్డ్ క్రిమినల్ యాక్టివిటీ డిటెక్షన్ ప్రాజెక్ట్ (పబ్లిక్ సేఫ్టీ), ఆర్మ్ ఎక్స్ స్మార్ట్ రిహాబిలిటేషన్ సిస్టమ్ (హెల్త్‌కేర్) ఎంపికయ్యాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత, టెక్నాలజీ ఆలోచనలను ప్రోత్సహించే ఈ కార్యక్రమం భవిష్యత్ ఇన్నోవేటర్లను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించనుందని వివో సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






