WhatsApp | తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్‌కు చెక్.. ఈ సింపుల్ సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు..
WhatsApp | తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్, స్కామ్ ప్రయత్నాలు, అనవసర అంతరాయాలను తగ్గించేందుకు వాట్సాప్‌లో ఉపయోగకరమైన ప్రైవసీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే, మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని లేదా ఇంతకుముందు మీతో వాట్సాప్‌లో ఎలాంటి ఇంటరాక్షన్ లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ మీ ఫోన్‌లో రింగ్ కావు.
Technology | Published On Jun 26, 2026, 4.03 pm IST
WhatsApp | తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్, స్కామ్ ప్రయత్నాలు, అనవసర అంతరాయాలను తగ్గించేందుకు వాట్సాప్‌లో ఉపయోగకరమైన ప్రైవసీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే, మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని లేదా ఇంతకుముందు మీతో వాట్సాప్‌లో ఎలాంటి ఇంటరాక్షన్ లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ మీ ఫోన్‌లో రింగ్ కావు. అయితే ఆ కాల్స్ పూర్తిగా బ్లాక్ కావు. అవి వాట్సాప్‌లోని కాల్స్ ట్యాబ్‌లో, అలాగే నోటిఫికేషన్లలో కనిపిస్తాయి. అవసరమైతే తర్వాత వాటిని చూసి తిరిగి కాల్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే పలు స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో..
ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన తర్వాత కుడి పైభాగంలో కనిపించే మూడు డాట్స్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ నుంచి సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కాల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ టోగుల్‌ను ఆన్ చేయాలి. ఈ సెట్టింగ్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ మీ ఫోన్‌లో రింగ్ కావు. అయినప్పటికీ ఆ కాల్స్ వాట్సాప్‌లోని కాల్స్ ట్యాబ్‌లో, నోటిఫికేషన్ ప్యానెల్‌లో కనిపిస్తాయి.
ఐఫోన్‌లో..
ఐఫోన్‌లో ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. స్క్రీన్ దిగువ భాగంలో ఉన్న సెట్టింగ్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి. అక్కడ ప్రైవసీ విభాగాన్ని ఓపెన్ చేయాలి. అనంతరం కాల్స్ ఆప్షన్‌ను ఎంచుకుని సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ టోగుల్‌ను ఆన్ చేయాలి. ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసిన తర్వాత కూడా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిక్‌గా సైలెంట్ అవుతాయి. అయితే మిస్డ్ కాల్స్, నోటిఫికేషన్లు వాట్సాప్‌లో యథావిధిగా కనిపిస్తాయి.
పూర్తిగా బ్లాక్ చేసినట్లు కాదు, కానీ..
సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్‌ను ఆన్ చేయడం వల్ల ఎవరినీ పూర్తిగా బ్లాక్ చేసినట్లు కాదు. మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని లేదా ఇంతకుముందు మీతో వాట్సాప్‌లో మాట్లాడని నంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఫోన్ రింగ్ అవకుండా ఉంటుంది. అయితే ఆ కాల్స్ పూర్తిగా మాయమవ్వవు. అవి వాట్సాప్‌లోని కాల్స్ ట్యాబ్‌లో, అలాగే నోటిఫికేషన్ హిస్టరీలో కనిపిస్తూనే ఉంటాయి. దీంతో తర్వాత మిస్డ్ కాల్స్‌ను చూసి అవసరమైతే నేరుగా వాట్సాప్ నుంచే తిరిగి కాల్ చేయవచ్చు లేదా చాట్ ద్వారా సంభాషణ కొనసాగించవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు సైలెంట్ చేసిన నంబర్‌కు తర్వాత మీరే కాల్ చేసినా లేదా మెసేజ్ పంపినా, ఆ నంబర్ నుంచి వచ్చే భవిష్యత్ కాల్స్ మళ్లీ సాధారణంగా రింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి సైలెన్స్ కావు. ఒక నిర్దిష్ట నంబర్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ కూడా వద్దనుకుంటే, ఆ కాంటాక్ట్‌ను నేరుగా వాట్సాప్‌లో బ్లాక్ చేసే అవకాశం కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..
జూన్ 24, 2026

TecSox Moon | కేవలం రూ.599కే వైర్లెస్ ఇయర్ బడ్స్.. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ..
జూన్ 23, 2026

WhatsApp | వాట్సాప్‌లో కొత్త మాల్వేర్ ముప్పు.. ఈ ఫైళ్లను ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్ హ్యాకర్ల చేతిలో..
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●CS Sanjay Jaju | కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
- ●IAS Officers Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
- ●Varanasi Movie | వారణాసికి గుమ్మడికాయ కొట్టేది అప్పుడే - కిరాక్ అప్డేట్ చెప్పిన జక్కన్న
- ●Jeevan Redy | ఇక రేవంత్ అర్ధాయుష్షే మిగిలింది
- ●Türkiye Vs USA | విజయంతో వీడ్కోలు..
- ●Devi Prasad | మూడేండ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎట్లయితరు?

CS Sanjay Jaju | కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

IAS Officers Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

Varanasi Movie | వారణాసికి గుమ్మడికాయ కొట్టేది అప్పుడే - కిరాక్ అప్డేట్ చెప్పిన జక్కన్న

Jeevan Redy | ఇక రేవంత్ అర్ధాయుష్షే మిగిలింది



