IAS Officers Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
IAS Officers Transfers | తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియామకమయ్యారు.
IAS Officers Transfers | తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియామకమయ్యారు. విపత్తు నిర్వహణ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమించడంతో పాటు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యార్‌ను బదిలీ చేసింది. ఆమెకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. చేనేత హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. గనులశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావుకు అదనపు బాధ్యతలు ఇచ్చింది.
జేఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్, మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది ప్రభుత్వం. చేనేత, హస్తకళల జాయింట్ సెక్రటరీగా కాత్యాయనీదేవిగా నియమించింది. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బీ అజిత్‌రెడ్డి, టీజీ రెడ్కో వీసీఎండీగా ముషారఫ్ అలీ ఫారుఖీ అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శిగా కే గంగాధర్, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్‌గా వెంకన్న, పర్యాటకశాఖ డైరెక్టర్‌గా కే విద్యాసాగర్, ప్రజావాణి నోడల్ అధికారిగా విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ చంద్రకళకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
- ●Monsoon | రుతుపవనాల జాడేది?
- ●NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..
- ●Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్
- ●Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు
- ●Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా

Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..

Monsoon | రుతుపవనాల జాడేది?

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..

Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్




