Varanasi Movie | వారణాసికి గుమ్మడికాయ కొట్టేది అప్పుడే – కిరాక్ అప్‌డేట్ చెప్పిన జక్కన్న
మహేష్‌బాబు వారణాసి మూవీ షూటింగ్ పూర్తయ్యేది ఎప్పుడనే క్లారిటీ వచ్చేసింది. ఈ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ మూవీకి సెప్టెంబర్ నెలాఖరున లేదా అక్టోబర్‌లో గుమ్మడికాయ కొట్టబోతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి చెప్పారు. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించారు.
Entertainment | Published On Jun 26, 2026, 3.45 pm IST
Varanasi Movie | మహేష్‌బాబు వారణాసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడనే క్లారిటీ వచ్చేసింది. ఈ పాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను డైరెక్టర్ రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. బాహుబలి, బాహుబలి 2 సినిమాలపై వచ్చిన బాహుబలి ది టార్చ్‌బేరర్ డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజమౌళి వారణాసిపై రియాక్ట్ అయ్యారు.
ఐమాక్స్ ఫార్మెట్...
సెప్టెంబర్ నెలాఖరున లేదా అక్టోబర్‌లో ఈ యాక్షన్ అడ్వెంచర్ టైమ్ ట్రావెల్ మూవీ షూటింగ్ పూర్తవుతుందని రాజమౌళి వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయ్యిందని, కథను కనెక్ట్ చేసే చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉందని రాజమౌళి అన్నారు. మరో నాలుగు నెలల్లో వారణాసికి గుమ్మడికాయ కొట్టబోతున్నట్లు తెలిపారు. "కంప్లీట్ ఐమాక్స్ ఫార్మెట్‌లోనే వారణాసిని షూట్ చేశాం. ఈ ఫార్మెట్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు" అని రాజమౌళి పేర్కొన్నారు. తెలుగు తో పాటు ఇండియన్ ఆడియెన్స్‌కు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా ఈ మూవీ ఉంటుందని అన్నారు.
మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్
వారణాసి సిటీ బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కబోతుంది. ఇందులో మహేష్‌బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం యాక్షన్ సీక్వెన్స్, ట్రెక్కింగ్ పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఫిజికల్‌గా మేకోవర్ అయ్యారు.
గ్లోబల్ స్టార్...
వారణాసిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాతోనే దాదాపు ఏడెనిమిదేళ్ల తర్వాత ఇండియన్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వబోతుంది. మలయాళం అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, విలన్‌గా నటిస్తోన్నాడు. దాదాపు 1500 కోట్లతో ఇండియన్ సినీ హిస్టరీలోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మూవీస్‌లో ఒకటిగా వారణాసి రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరికొన్ని భారతీయ, ప్రపంచ భాషల్లో వారణాసిని రిలీజ్ చేయబోతున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nabha Natesh | అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఐటెంగర్ల్ – మాస్ మహారాజా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ
జూన్ 26, 2026

Khushbu Daughter Wedding | ఖుష్బూ కూతురి పెళ్లి – హాజరైన టాలీవుడ్ టాప్ హీరోలు – స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష
జూన్ 26, 2026

Samantha | నా పనైపోయిందన్నారు – హీరోయిన్‌గా రీఎంట్రీ కష్టమని విమర్శించారు – సమంత కామెంట్స్
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
- ●Monsoon | రుతుపవనాల జాడేది?
- ●NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..
- ●Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్
- ●Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు
- ●Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా

Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..

Monsoon | రుతుపవనాల జాడేది?

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..

Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్



