త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

True Caller | దేశ ప్ర‌జ‌లకు భారీగా స్పామ్ కాల్స్‌.. ట్రూకాల‌ర్ నివేదిక‌లో ఆందోళ‌న క‌లిగిస్తున్న గ‌ణాంకాలు..

True Caller | దేశంలో స్పామ్, మోసపూరిత కాల్స్ భారీగా పెరుగుతున్నాయని ప్ర‌ముఖ కాలింగ్ యాప్ ట్రూ కాల‌ర్‌కు చెందిన‌ తాజా నివేదిక వెల్లడించింది. ఈ మేర‌కు ఆ సంస్థ 2025 ఇండియా ఇన్‌సైట్స్ రిపోర్ట్ - ఇండియాస్ స్పామ్ షీల్డ్ అనే నివేదిక‌ను విడుద‌ల చేసింది.

S

Technology | Published On Feb 13, 2026, 6.21 am IST

True Caller | దేశ ప్ర‌జ‌లకు భారీగా స్పామ్ కాల్స్‌.. ట్రూకాల‌ర్ నివేదిక‌లో ఆందోళ‌న క‌లిగిస్తున్న గ‌ణాంకాలు..
Advertisement

True Caller | దేశంలో స్పామ్, మోసపూరిత కాల్స్ భారీగా పెరుగుతున్నాయని ప్ర‌ముఖ కాలింగ్ యాప్ ట్రూ కాల‌ర్‌కు చెందిన‌ తాజా నివేదిక వెల్లడించింది. ఈ మేర‌కు ఆ సంస్థ 2025 ఇండియా ఇన్‌సైట్స్ రిపోర్ట్ - ఇండియాస్ స్పామ్ షీల్డ్ అనే నివేదిక‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం 2025లో భార‌తీయులు దాదాపుగా 40 బిలియన్ల‌కు పైగా స్పామ్ కాల్స్‌ను స్వీక‌రించార‌ని తేలింది. దేశం ఓవైపు అన్ని రంగాల్లోనూ డిజిట‌ల్ బాట‌లో ప‌య‌నిస్తుంటే క‌మ్యూనికేష‌న్ సేఫ్టీ స‌వాల్‌గా మారింద‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ నివేదిక ద్వారా ప‌లు ఆందోళ‌న‌క‌ర గ‌ణాంకాలు వెల్ల‌డ‌య్యాయి.

భారీ ఎత్తున స్పామ్ కాల్స్‌..

2025లో మొత్తం 41.68 బిలియ‌న్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించిన‌ట్లు ట్రూకాల‌ర్ త‌న నివేదిక‌లో పేర్కొంది. వాటిల్లో వినియోగ‌దారులు 11.89 బిలియ‌న్ల స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేశార‌ని, మ‌రో 7.7 బిలియ‌న్ల మోస‌పూరిత కాల్స్ ను గుర్తించార‌ని తెలిపింది. అలాగే ఒక్కో స్పామ్ కాల్ స‌గ‌టు వ్య‌వ‌ధి 1.8 నిమిషాలుగా ఉంద‌ని, మొత్తం ఆ కాల వ్య‌వ‌ధిలో 12.9 బిలియ‌న్ల స్పామ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ఈ నివేదిక‌ను బ‌ట్టి చూస్తే దేశంలో స‌గటు స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుడు ఎంత‌టి భారీ ఎత్తున స్పామ్ కాల్స్ బారిన ప‌డుతున్నాడో అర్థ‌మ‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని అరిక‌ట్టాల్సిన అవ‌సరం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

బ్రాండ్ల పేరిట మోసం..

ట్రూ కాల‌ర్ తెలిపిన ప్ర‌కారం చాలా మంది మోస‌గాళ్లు బ్యాంకులు, ప్రభుత్వ అధికారులు, డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు, ప్రముఖ బ్రాండ్ల పేరిట ప్ర‌జ‌ల‌కు స్పామ్ కాల్స్ చేస్తున్నార‌ని తేలింది. వారు కాల్స్ చేసిన త‌రువాత ప్ర‌జ‌ల‌లో ఒక ఆందోళ‌న క‌లిగించి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని సృష్టిస్తున్నార‌ని, దీంతో భ‌యానికి గురై చాలా మంది బాధితులు ఓటీపీలు లేదా బ్యాంకు వివ‌రాల‌ను చెబుతున్నార‌ని, దీని వ‌ల్ల పెద్ద ఎత్తున సైబ‌ర్ మోసాలు జ‌రుగుతూ ప్ర‌జ‌లు భారీ ఎత్తున డ‌బ్బు న‌ష్ట‌పోతున్నార‌ని వెల్ల‌డైంది. ట్రూ కాల‌ర్ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం 2025 రెండో అర్ధ‌భాగంలో స్పామ్ మెసేజ్ ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని తేలింది. స్పామ్ మెసేజ్‌లు కూడా ప్ర‌జ‌ల‌ను పెద్ద ఎత్తున ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌ని, చాలా వ‌ర‌కు సంద‌ర్భాల్లో ప్ర‌జ‌లు డ‌బ్బుల‌ను న‌ష్ట‌పోయేలా చేస్తున్నాయ‌ని నివేదిక పేర్కొంది.

బ్లాకింగ్ టూల్స్‌తో ర‌క్ష‌ణ‌..

ట్రూ కాల‌ర్ లో అందుబాటులో ఉన్న కమ్యూనిటీ రిపోర్టింగ్ వ్య‌వ‌స్థ‌, బ్లాకింగ్ టూల్స్ ద్వారా గ‌తేడాది కాలంలో 11.89 బిలియ‌న్ల కాల్స్‌ను వినియోగదారులు సొంతంగా బ్లాక్ చేశార‌ని తెలిపింది. అలాగే టెక్నాలజీ ఆధారిత ఫిల్టరింగ్ వ్యవస్థల వల్ల కోట్లాది మంది వినియోగదారులు మోసాల నుంచి రక్షణ పొందార‌ని నివేదిక వెల్లడించింది. అయితే స్పామ్ కాల్స్ లేదా మెసేజ్‌ల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండాల‌న్నా, డ‌బ్బులు న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్త ప‌డాల‌న్నా వినియోగ‌దారులు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్త‌ల‌ను పాటించాల్సిందే..

బ్యాంక్ లేదా ఆధార్‌, పాన్‌, ఇత‌ర కార్డులు, ముఖ్య‌మైన వివ‌రాల‌కు సంబంధించి ఎవరైనా కేవైసీ అప్‌డేట్ చేయాల‌ని కాల్స్ చేసినా, మెసేజ్‌లు పంపినా స్పందించ‌కూడ‌దు. స్పామ్ గా గుర్తించిన కాల్స్ ను లిఫ్ట్ చేయ‌కూడ‌దు. మెసేజ్ ల‌ను సైతం బ్లాక్ చేయాలి. అపరిచిత వ్య‌క్తుల‌కు ఓటీపీ, పిన్‌, పాస్‌వ‌ర్డ్ వంటి వివ‌రాల‌తోపాటు ఆధార్‌, పాన్ కార్డు, బ్యాంకు వివ‌రాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ చెప్ప‌కూడ‌దు. మెసేజ్‌లలో వ‌చ్చే లింకుల‌ను ఓపెన్ చేయ‌కూడ‌దు. ప్లే స్టోర్ కాకుండా ఇత‌ర ఎక్కడైనా ల‌భించే యాప్‌ల‌ను డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయ‌కూడ‌దు. ఇలా కొన్ని సూచ‌న‌లు పాటిస్తే ఈ ర‌క‌మైన మోసాల బారిన ప‌డకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. దీంతో డ‌బ్బు సైతం సేఫ్‌గా ఉంటుంది.

Advertisement
Advertisement