Smart Phones | రూ.30వేల లోపు ధరకు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
Smart Phones | భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం రూ.30వేలు, అంతకన్నా తక్కువ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ విభాగంలో పోటీ అధికమైంది. గతంలో హై ఎండ్ ఫోన్లలో మాత్రమే లభించే ఫీచర్లు ఇప్పుడు ఈ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు ఈ ఫోన్లను అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు గణాంకాలు సైతం చెబుతున్నాయి.
Technology | Published On Feb 28, 2026, 11.48 am IST
Smart Phones | భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం రూ.30వేలు, అంతకన్నా తక్కువ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ విభాగంలో పోటీ అధికమైంది. గతంలో హై ఎండ్ ఫోన్లలో మాత్రమే లభించే ఫీచర్లు ఇప్పుడు ఈ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు ఈ ఫోన్లను అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు గణాంకాలు సైతం చెబుతున్నాయి. ఈ సెజ్‌మెంట్‌లో శక్తివంతమైన ప్రాసెసర్, అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లే, ఆధునిక కెమెరాలు, ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీలు వంటి ఫీచర్లతో ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. గేమింగ్, ఫొటోగ్రఫీ, బ్యాటరీ బ్యాకప్, క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పలు ఫోన్లు లభిస్తున్నాయి. రూ.30వేల లోపు ధరకు అలాంటి ఫీచర్లతో లభిస్తున్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
నథింగ్ కంపెనీకి చెందిన నథింగ్ ఫోన్ 3ఎ ప్రొ స్మార్ట్ ఫోన్‌లో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, వెనుక వైపు 50, 50, 8 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.27,999గా ఉంది.
మోటోరోలాకు చెందిన ఎడ్జ్ 60 ప్రొ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 6.7 ఇంచుల పీఓలెడ్ డిస్‌ప్లే, 50, 50, 10 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండగా, ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది.
షియోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 15ప్రొ 5జి ఫోన్‌లో 6.83 ఇంచుల క్రిస్టల్ రెస్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, 200 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 6580 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ను రూ.29,999కు విక్రయిస్తున్నారు.
వివో టి4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 12జీబీ వరకు ర్యామ్, 6.77 ఇంచుల క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, వెనుక వైపు డ్యుయల్ 50 మెగాపిక్సల్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ధర రూ.29,874గా ఉంది.
వన్‌ప్లస్‌కు చెందిన నార్డ్ సీఈ 5 ఫోన్ కూడా ఈ విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫోన్‌లో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఏపెక్స్ ప్రాసెసర్, 7100 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 50, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.24,999గా ఉంది.
రూ.30వేల లోపు ధరకు లభిస్తున్న స్మార్ట్ ఫోన్ విభాగంలో ఆయా ఫోన్లు ప్రస్తుతం వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గేమింగ్ అవసరాలకు అయితే మోటోరోలా ఎడ్జ్ 60 ప్రొను తీసుకోవచ్చు. ఫొటోగ్రఫీకి రెడ్‌మీ నోట్ 15 ప్రొ 5జి పనిచేస్తుంది. క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే నథింగ్ ఫోన్ 3ఎ ప్రొను తీసుకోవచ్చు. భారీ బ్యాటరీ అయితే వన్ ప్లస్ నార్డ్ సీఈ5ని ఎంచుకోవాలి. ఇక బ్యాలెన్స్‌డ్ అవసరాలకు వివో టి4 ప్రొ 5జి పనిచేస్తాయి. ఆయా ఫోన్లు అన్ని ప్రధాన ఈ-కామర్స్ సైట్లతోపాటు ఆఫ్ లైన్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆన్‌లైన్ ద్వారా పలు ఆఫర్లను కూడా పొందవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

HMD Vibe 2 5G | రూ.10,999కే హెచ్ఎండీ వైబ్ 2 5జి ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎంట్రీ..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



