Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
Railway | రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ఆస్తుల చోరీలు, ట్రాక్‌లపై అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే డ్రోన్ నిఘాను మరింత పెంచనుంది. సున్నితమైన ప్రాంతాలు, మారుమూల రైల్వే మార్గాలపై నిఘా పెంచేందుకు డ్రోన్ల సంఖ్యను ప్రస్తుతమున్న 11 నుంచి 2027 మార్చి నాటికి 22కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Railway | రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ఆస్తుల చోరీలు, ట్రాక్‌లపై అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే డ్రోన్ నిఘాను మరింత పెంచనుంది. సున్నితమైన ప్రాంతాలు, మారుమూల రైల్వే మార్గాలపై నిఘా పెంచేందుకు డ్రోన్ల సంఖ్యను ప్రస్తుతమున్న 11 నుంచి 2027 మార్చి నాటికి 22కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెమెరాలతో కూడిన డ్రోన్ల ద్వారా అనుమానాస్పద కదలికలను గుర్తించడంతోపాటు స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.
2,708 కిలోమీటర్ల మార్గాలపై నిఘా
తూర్పు కోస్తా రైల్వే (ఈస్ట్ కోస్ట్ రైల్వే) పరిధిలోని మూడు డివిజన్లలో ప్రస్తుతం 11 డ్రోన్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 284 రైల్వే స్టేషన్లు, 2,708 రూట్ కిలోమీటర్లు, 6,072 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో నిఘా కొనసాగుతోంది. ఖుర్దా రోడ్ డివిజన్లో నాలుగు, సంబల్పూర్ డివిజన్లో ఆరు, రాయగడ డివిజన్లో ఒక డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను రెట్టింపు చేసి 22కు చేర్చాలని రైల్వే అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు మొత్తం 3,033 డ్రోన్ గస్తీ కార్యకలాపాలు నిర్వహించింది. వీటిలో సంబల్పూర్ డివిజన్లో అత్యధికంగా 1,329, రాయగడలో 1,024, ఖుర్దా రోడ్లో 680 గస్తీలు చేపట్టారు. వీటిలో 1,265 సార్లు సున్నితమైన ప్రాంతాల భద్రతకు ప్రాధాన్యమిచ్చారు. రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, కేబుళ్ల చోరీలను అరికట్టడంతోపాటు అగ్నిప్రమాద ముప్పులను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.
రాత్రివేళల్లోనూ పర్యవేక్షణ
నైట్ విజన్, థర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్లు రాత్రివేళల్లోనూ నిఘా నిర్వహించగలవు. అడవులు, కొండ ప్రాంతాలు, సొరంగాలు, వంతెనలు, జనసంచారం తక్కువగా ఉండే రైల్వే ట్రాక్‌లపై వీటిని ఉపయోగిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, కోచింగ్ యార్డులు, కీలక సముదాయాలపైనా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఒక డ్రోన్ బృందం సుమారు 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధిని పర్యవేక్షించగలదని రైల్వే వర్గాలు తెలిపాయి. 2026లో పూరీ రథయాత్ర సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించడంలో డ్రోన్లు కీలకంగా ఉపయోగపడ్డాయి. మహిళా ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన ‘మేరీ సహేలీ’ కార్యక్రమంలోనూ వీటిని వినియోగిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లను దాటే ప్రయత్నాలు, రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలను అడ్డుకునేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యక్ష చిత్రాలను పరిశీలించడంతోపాటు ఆడియో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఘటనాస్థలికి వెంటనే..
రైల్వే ట్రాక్‌లకు ఆనుకుని ఉన్న పొదలు, వంతెనలు, ఏకాంత ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది నేరుగా చేరుకోవడం కష్టమైన సందర్భాల్లో డ్రోన్లు ఉపయోగపడనున్నాయి. ఎక్కడైనా ఘటన జరిగినట్లు సమాచారం అందితే వెంటనే డ్రోన్‌ను పంపి పరిస్థితిని అంచనా వేయవచ్చు. అనుమానాస్పద కదలికలను ముందుగానే గుర్తించి సత్వర చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. ట్రాక్‌లపై ఆక్రమణలు, ఇతర అక్రమ కార్యకలాపాల గుర్తింపునకూ ఈ సాంకేతికత దోహదపడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే
అక్టోబర్ 16, 2026

Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
అక్టోబర్ 16, 2026

Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్‌దీప్‌కు గాయం!
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం
- ●Anirudh | పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనిరుధ్ - సీఎం విజయ్‌కి ప్రత్యేక ఆహ్వానం
- ●Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే
- ●Supreme Court | సోషల్ మీడియా ముప్పు నుంచి పిల్లలకు రక్షణ కోరుతూ పిల్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..

CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం

Anirudh | పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనిరుధ్ - సీఎం విజయ్‌కి ప్రత్యేక ఆహ్వానం

Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే

Supreme Court | సోషల్ మీడియా ముప్పు నుంచి పిల్లలకు రక్షణ కోరుతూ పిల్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



