Samsung | శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను వాడేవారికి ముఖ్య గమనిక.. ఇకపై ఆ యాప్ పనిచేయదు..
Samsung | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌లో డిఫాల్ట్‌గా వచ్చే శాంసంగ్ మెసేజెస్ యాప్‌ను ఈ ఏడాది జూలై నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది.
Technology | Published On Apr 6, 2026, 12.22 pm IST
Samsung | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌లో డిఫాల్ట్‌గా వచ్చే శాంసంగ్ మెసేజెస్ యాప్‌ను ఈ ఏడాది జూలై నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ 12 లేదా ఆపైన ఓఎస్ వెర్షన్ కలిగిన గెలాక్సీ స్మార్ట్ ఫోన్లకు ఈ మార్పు వర్తిస్తుందని తెలియజేసింది. శాంసంగ్ తన మెసేజెస్ యాప్‌ను నిలిపివేస్తే సాధారణ మెసేజింగ్‌కు సపోర్ట్ ఇవ్వదు. ఈ యాప్ కేవలం అత్యవసర నంబర్లు లేదా ముందుగా సేవ్ చేసి పెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు మాత్రమే పనిచేస్తుంది. అందువల్ల ఫోన్‌కు మెసేజ్‌లు రావాలన్నా, సెండ్ చేయాలన్నా యూజర్లు ఎస్ఎంఎస్, ఆర్‌సీఎస్ మెసేజింగ్ సేవల కోసం గూగుల్ అందిస్తున్న మెసేజెస్ యాప్‌ను వాడాల్సి ఉంటుంది.
గూగుల్ మెసేజెస్ యాప్‌ను వాడాలి..
శాంసంగ్ మెసేజెస్ యాప్‌లోనే యూజర్లకు ఈ మార్పు ప్రక్రియకు సంబంధించిన సూచనలను ఇన్-యాప్ నోటిఫికేషన్ల రూపంలో అందిస్తామని శాంసంగ్ తెలిపింది. ఆండ్రాయిడ్ 14 లేదా ఆపైన ఓఎస్ వెర్షన్‌లలో మార్పు తరువాత గూగుల్ మెసేజెస్ యాప్ ఐకాన్ స్వయంగా హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో యూజర్లు శాంసంగ్ మెసేజెస్ యాప్ నుంచి గూగుల్ మెసేజెస్ యాప్‌కు సులభంగా మారవచ్చు. దీని వల్ల యూజర్లు గూగుల్ మెసేజెస్ యాప్‌లో అందుబాటులో ఉన్న పలు కొత్త ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఇందులో మోసాలను నివారించేందుకు స్పామ్ మెసేజ్‌లను గుర్తించే ఏఐ ఫీచర్, ఆర్‌సీఎస్ మెసేజింగ్ ద్వారా మీడియా షేరింగ్, టైపింగ్ టిప్స్, గ్రూప్ చాట్ సపోర్ట్, జెమిని ఆధారిత ఏఐ ఫీచర్లు, స్మార్ట్ రిప్లైలు, కంటెంట్ టూల్స్, ఫోన్, ట్యాబ్, స్మార్ట్ వాచ్‌ల నడుమ మల్టీ-డివైస్ మెసేజింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
యాప్‌కు ఇలా మారవచ్చు..
శాంసంగ్ మెసేజెస్ యాప్‌లో యూజర్లకు ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. దాంతో స్క్రీన్ పై వచ్చే సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల శాంసంగ్ మెసేజెస్ యాప్ నుంచి గూగుల్ మెసేజెస్ యాప్‌కు షిఫ్ట్ అవుతారు. ఇక మాన్యువల్‌గా అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ మెసేజెస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి దాన్ని ఎస్ఎంఎస్‌ల కోసం డిఫాల్ట్‌గా సెట్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12, 13 ఓఎస్ వెర్షన్‌లు ఉన్న యూజర్లు శాంసంగ్ మెసేజెస్ యాప్‌ను హోమ్ స్క్రీన్ డాక్ నుంచి తొలగించాలి. గూగుల్ మెసేజెస్ యాప్‌ను హోమ్ స్క్రీన్ యాప్‌లో యాడ్ చేయాలి. డాక్‌లో మాన్యువల్‌గా డ్రాగ్ చేసి ఉంచాలి. టైజెన్ ఓఎస్‌పై నడిచే పాత శాంసంగ్ స్మార్ట్ వాచ్‌లు పూర్తి మెసేజ్ సింక్‌కు సపోర్ట్ ఇవ్వవు. అయితే బేసిక్ మెసేజింగ్ సేవలు మాత్రం లభిస్తాయి. 2022కి ముందు విడుదలైన డివైస్‌లలో ఈ యాప్ మార్పు సమయంలో ఆర్‌సీఎస్ చాట్‌లు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. కానీ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ సేవలు అందుబాటులోనే ఉంటాయి.
పాత డివైస్‌లపై ప్రభావం ఉండదు..
శాంసంగ్ మెసేజెస్ యాప్‌ను జూలై 2026 నుంచి పూర్తిగా నిలిపివేస్తారు. తరువాత గెలాక్సీ స్టోర్‌లో ఈ యాప్ కనిపించదు. కొత్తగా విడుదలైన గెలాక్సీ ఎస్26, తరువాతి డివైస్‌లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే అవకాశాన్ని ఇప్పటికే తొలగించారు. ఆండ్రాయిడ్ 12 ఆపైన ఓఎస్ వెర్షన్ కలిగిన డివైస్‌లకు మాత్రమే ఈ యాప్ మార్పు వర్తిస్తుంది. ఆండ్రాయిడ్ 11 లేదా అంతకన్నా పాత ఓఎస్ వెర్షన్‌లతో పనిచేసే డివైస్‌లపై ఈ యాప్ మార్పు ప్రభావం ఉండదు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






