Samsung Galaxy A07 5G | భారీ బ్యాటరీ, ప్రత్యేకమైన సెక్యూరిటీతో లాంచ్ అయిన శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్..!
Samsung Galaxy A07 5G | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ07 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో అద్భుతమైన డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
Technology | Published On Feb 6, 2026, 6.46 am IST
Samsung Galaxy A07 5G | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ07 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో అద్భుతమైన డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ ఈ ఫోన్ డిస్‌ప్లే స్పష్టంగా కనిపించేలా ఇందులో హై బ్రైట్‌నెస్ మోడ్ (హెచ్‌బీఎం)ను అందిస్తున్నారు. దీనికి తోడుగా 800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్ కు వెనుక వైపు గ్లాస్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్డ్ పాలిమర్ (జీఎఫ్ఆర్‌పీ) బ్యాక్ ప్యానెల్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ కు ఐపీ 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌ను ఇస్తున్నారు. లైట్ వయోలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. ఇక ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. అంతకు ముందు విడుదల అయిన మోడల్ కన్నా ఈ ఫోన్ 20 శాతం అదనంగా బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉండడం విశేషం. ఇక దీనికి గాను 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను ఇస్తున్నారు. కనుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అయితే చార్జర్‌ను మాత్రం ఫోన్ బాక్స్‌లో ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ప్రత్యేక సెక్యూరిటీ..
గెలాక్సీ ఎ07 5జి స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.0ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గాను 6 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని వల్ల శాంసంగ్ వాలెట్‌ను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్‌ను మరింత సురక్షితంగా చేయవచ్చు. ఇందుకు గాను ఫోన్‌కు చెందిన ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ ఫీచర్లు సహాయం చేస్తాయి. అలాగే ఆటో బ్లాకర్ అనే మరో ఫీచర్ కూడా ఉంది. దీని వల్ల ఆథరైజ్ చేయని యాప్ ఇన్‌స్టాలేషన్‌లను ఆటోమేటిక్‌గా అడ్డుకోవచ్చు. ఈ ఫోన్‌ను 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ 5.3 సదుపాయం కూడా ఉంది.
ధర వివరాలు..
గెలాక్సీ ఎ07 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్‌పై రూ.1000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు కార్డులతో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం అన్ని రిటెయిల్ స్టోర్స్‌తోపాటు శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఇతర ఆన్‌లైన్ స్టోర్స్ లోనూ విక్రయిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



