త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | కోలీవుడ్ స్టార్ హీరోతో మృణాల్ ఠాకూర్ పెళ్లి – ముహూర్తం ఫిక్స్‌ – సోష‌ల్ మీడియా పుకార్ల‌లో నిజ‌మెంత‌?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్, సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త కొద్ది రోజులుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట వాలెంటైన్స్ డే రోజున వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Jan 16, 2026, 3.51 pm IST

Mrunal Thakur | కోలీవుడ్ స్టార్ హీరోతో మృణాల్ ఠాకూర్ పెళ్లి – ముహూర్తం ఫిక్స్‌ – సోష‌ల్ మీడియా పుకార్ల‌లో నిజ‌మెంత‌?
Advertisement

Mrunal Thakur | సీతారామం హీరోయిన్ మృణాల్ పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌తో త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన ఈ మూవీతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. సీతారామం మూవీలో సీతామ‌హ‌ల‌క్ష్మి పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ యాక్టింగ్‌కు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ స‌క్సెస్‌తో టాలీవుడ్‌లో మృణాల్ బిజీగా మారిపోయింది. హాయ్ నాన్న‌, క‌ల్కి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం డెకాయిట్‌తో పాటు అల్లు అర్జున్‌, అట్లీ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ధనుష్ తో ప్రేమాయణం...

గ‌త కొద్ది రోజులుగా సినిమాల కంటే డేటింగ్ పుకార్ల‌తోనే ఎక్కువ‌గా మృణాల్ ఠాకూర్ వార్త‌ల్లో నిలుస్తోంది. కోలీవుడ్ అగ్ర హీరో ధ‌నుష్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మృణాల్ బాలీవుడ్ మూవీ స‌న్నాఫ్ స‌ర్ధార్ ప్ర‌మోష‌న్స్‌లో ధ‌నుష్ క‌నిపించారు. ప్రీమియ‌ర్ షోకు స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. అప్ప‌టి నుంచే వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టుగా పుకార్లు మొద‌ల‌య్యాయి. త‌ర‌చుగా త‌న సోష‌ల్ మీడియా పోస్ట్‌ల‌కు ధ‌నుష్ పాట‌ల‌ను మృణాల్ ఎక్కువ‌గా జోడించ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ధ‌నుష్ సిస్ట‌ర్స్‌ను మృణాల్ స‌డెన్‌గా సోష‌ల్ మీడియాలో ఫాలో కావ‌డం మొద‌లుపెట్ట‌డంతో వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్న‌ది నిజ‌మేనంటూ కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం మొద‌లైంది.

వాలెంటైన్స్ డే...

తాజాగా ధ‌నుష్‌, మృణాల్ ఠాకూర్ పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 14 వాలెంటైన్స్ డేను త‌మ వివాహానికి ముహూర్తంగా ఈ జంట ఫిక్స్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. చెన్నైలో కుటుంబ‌స‌భ్యులు, అతికొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ఈ పెళ్లి వార్త‌ల‌పై ధ‌నుష్, మృణాల్ ఠాకూర్‌తో పాటు వారి కుటుంబ‌స‌భ్యులు మాత్రం రియ‌క్ట్ కాలేదు. కాద‌ని కూడా ఖండించ‌క‌పోవ‌డంతో పెళ్లి జ‌రుగ‌నుంద‌ని నిజ‌మే కావ‌చ్చున‌ని నెటిజ‌న్లు ట్వీట్స్‌, కామెంట్స్ పెడుతోన్నారు.ప్ర‌స్తుతం కుబేర‌తో పాటు తేరే ఇష్క్ మే సినిమాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందుకున్నాడు ధ‌నుష్. ప్ర‌స్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు మృణాల్ ఠాకూర్ కూడా హిందీలో మూడు, తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.

కాగా ధ‌నుష్‌కు ఇదివ‌ర‌కు పెళ్ల‌య్యింది. కోలీవుడ్ స్టార్ హీరో ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ను 2004లో పెళ్లి చేసుకున్నారు ధ‌నుష్‌. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఇర‌వై ఏళ్ల త‌ర్వాత 2024లో ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌ విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement