త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjiv Goenka | ఎల్ఎస్‌జీ ఓన‌ర్ సంజ‌య్ గోయెంకాపై మ‌రోసారి ట్రోలింగ్‌

Sanjiv Goenka | ఆర్పీఎస్‌జీ గ్రూప్ చైర్మ‌న్ సంజీవ్ గోయెంకా మ‌రోసారి సోష‌ల్ మీడియా దారుణంగా ట్రోలింగ్ జ‌రుగుతున్న‌ది. ఆస్ట్రేలియా వుమెన్స్ జ‌ట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ పేరును త‌ప్పుగా ప‌ల‌క‌డమే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. సంజీవ్ గోయంకా మాంచెస్టర్ ఒరిజినల్స్ జ‌ట్టును కొనుగోలు చేయ‌డంతో జ‌ట్టు పేరు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మారింది.

P

Sports | Published On Jan 16, 2026, 3.35 pm IST

Sanjiv Goenka | ఎల్ఎస్‌జీ ఓన‌ర్ సంజ‌య్ గోయెంకాపై మ‌రోసారి ట్రోలింగ్‌
Advertisement

Sanjiv Goenka | ఆర్పీఎస్‌జీ గ్రూప్ చైర్మ‌న్ సంజీవ్ గోయెంకా మ‌రోసారి సోష‌ల్ మీడియా దారుణంగా ట్రోలింగ్ జ‌రుగుతున్న‌ది. ఆస్ట్రేలియా వుమెన్స్ జ‌ట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ పేరును త‌ప్పుగా ప‌ల‌క‌డమే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. సంజీవ్ గోయంకా మాంచెస్టర్ ఒరిజినల్స్ జ‌ట్టును కొనుగోలు చేయ‌డంతో జ‌ట్టు పేరు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మారింది. ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లాన్నింగ్‌, స్మృతి మంధాన‌ను సైతం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ మహిళల జట్టులోకి తీసుకున్నారు. ఆయ‌న మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్ (MSG) కొత్త మెన్స్‌, వుమెన్స్ జ‌ట్ల కొత్త ప్లేయ‌ర్స్ గురించి ఆయ‌న ప‌రిచ‌యం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మెగ్ లాన్నింగ్ పేరును మెగ్ కాన్నింగ్‌గా ప‌లికారు. సోష‌ల్ మీడియాల్ అవుతున్న వీడియోలో త‌ప్పుగా ప‌లుక‌డం క‌నిపించింది. మహిళల జట్టు అనుభ‌వ‌జ్ఞులు, యువ‌త క‌ల‌బోత‌తో జ‌ట్టు స‌మతూకంగా ఉంద‌న్నారు.


ఆస్ట్రేలియాకు ఏడు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన ప్లేయ‌ర్ మెగ్ లాన్నింగ్ జ‌ట్టులో భాగ‌మ‌య్యార‌ని తెలిపారు. ఇంగ్లండ్ ప్లేయ‌ర్ సోఫీ ఎక్లెస్టోన్ బెస్ట్ స్పిన్న‌ర్‌గా అభివ‌ర్ణించారు. స్మృతి మంధాన మ్యాచ్ విన్న‌ర్ అంటూ ప్ర‌శంసించారు. ఈ సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ కావ‌డంతో వ్యాపార‌వేత్త‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రిగింది. ఓ అభిమాని నోరు మూసుకో అంటూ ఘాటుగా స్పందించాడు. మ‌రొక‌రు "గోయెంకా మెగ్ కాన్నింగ్ అని పిలిచాడు.. వాట్ ఏ మ్యాన్" అంటూ ఎద్దేవా చేశాడు. మ‌రో యూజ‌ర్ స్పందిస్తూ ఆట‌గాళ్ల గురించి తెలియ‌క‌పోవ‌డం వేరే విష‌య‌మ‌ని.. కానీ, వారి పేర్ల‌ను త‌ప్పుగా ఉచ్చ‌రించ‌డం అస‌మ‌ర్థ‌తంటూ విమ‌ర్శించారు.


మరో నెటిజ‌న్ స్పందిస్తూ.. "ఈ మెగ్ కాన్నింగ్ ఎవరు? ఈ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఏ క్ష‌ణ‌మైనా త‌న‌ను తాను ఇబ్బంది పెట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? అంటూ స్పందించాడు. ఇదిలా ఉండ‌గా.. ఆర్‌పీఎస్‌జీ మాంచెస్ట‌ర్ ఒరిజిన‌ల్స్ పేరును మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్‌గా మార‌గా.. లోగోలో ఏనుగు బొమ్మ‌ను చేర్చింది. భార‌త చిహ్న‌మైన ఏనుగు ఇంగ్లండ్‌, మాంచెస్ట‌ర్‌కు ఎలాంటి సంబంధం ఉందంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. గోయెంకా గ‌తంలో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు విష‌యంలో అప్ప‌టి కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై స్టేడియంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌పై అభిమానులు ప‌డ్డ విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement