Janhvi Kapoor | ‘రాకా’లో జాన్వీ కపూర్..? సోషల్ మీడియా వార్తల్లో నిజమెంతా!
Janhvi Kapoor | అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ మరోసారి చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతుందనే ఊహాగానాలకు ఆమె తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ కారణమైంది. ‘లైట్స్ ఆన్.. డ్రీమ్స్ రోలింగ్.. డే 1 ఆఫ్ సంథింగ్ మాసివ్’ అనే క్యాప్షన్‌తో జాన్వీ పంచుకున్న ఫొటోను అభిమానులు ‘రాకా’ షూటింగ్‌తో ముడిపెడుతున్నారు.
Entertainment | Published On Aug 5, 2026, 8.10 pm IST
Janhvi Kapoor | అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ మరోసారి చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతుందనే ఊహాగానాలకు ఆమె తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ కారణమైంది. ‘లైట్స్ ఆన్.. డ్రీమ్స్ రోలింగ్.. డే 1 ఆఫ్ సంథింగ్ మాసివ్’ అనే క్యాప్షన్‌తో జాన్వీ పంచుకున్న ఫొటోను అభిమానులు ‘రాకా’ షూటింగ్‌తో ముడిపెడుతున్నారు. దీంతో ఆమె అల్లు అర్జున్ సరసన నటించనున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.
అయితే దీనిపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గానీ, జాన్వీ కపూర్ వర్గం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 2026 ఏప్రిల్ 8న ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను విడుదల చేశారు. ఫాంటసీ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక భాగం పురాణ, గిరిజన నేపథ్యాన్ని ఆవిష్కరించగా.. మరో భాగం ఆధునిక కాలం చుట్టూ తిరిగే కథతో ఉండనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అలాగే మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న పేర్లతో పాటు జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. రామ్ చరణ్‌తో నటించిన ‘పెద్ది’ సినిమా ప్రచార కార్యక్రమాలు ముగిసిన తర్వాత కొత్త ప్రాజెక్టులకు ఆమె డేట్స్‌ను అడ్జెస్ట్ గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడే ‘రాకా’లోనూ ఆమె కనిపించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.
ప్రస్తుతం ఈ మూవీ ముంబయిలో చిత్రీకరణ కొనసాగుతోంది. స్వల్ప విరామం తర్వాత అల్లు అర్జున్ ఆగస్టు తొలి వారంలో తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. జాన్వీ ఈ మూవీలో నటిస్తుందా లేదా అన్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మాత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక 2026 చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027 డిసెంబరులో సినిమాను విడుదల చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో తొలి గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే చివరగా పెద్ద మూవీలో రామ్ చరణ్‌తో జతకట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో లగ్ జా గలే మూవీలో నటిస్తోంది.
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ






