Portronics Sky Cast | వైఫై లేకుండానే స్క్రీన్ కాస్ట్ చేయొచ్చు.. కొత్త డివైస్ అందుబాటులోకి.. ధర ఎంతంటే..?
Portronics Sky Cast | స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ యాక్ససరీల తయారీ సంస్థ పోర్ట్రోనిక్స్ (Portronics) తన నూతన డివైస్ స్కై కాస్ట్ (Sky Cast)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది టైప్-సి నుంచి హెచ్‌డీఎంఐ స్క్రీన్ కాస్టింగ్ డివైస్‌గా పనిచేస్తుంది. ప్రజెంటేషన్లు, స్ట్రీమింగ్, సాధారణ వీడియో వ్యూయింగ్‌కు పెద్ద స్క్రీన్ కనెక్టివిటీని ఇది సులభతరం చేస్తుంది.
Technology | Published On May 4, 2026, 2.26 pm IST
Portronics Sky Cast | స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ యాక్ససరీల తయారీ సంస్థ పోర్ట్రోనిక్స్ (Portronics) తన నూతన డివైస్ స్కై కాస్ట్ (Sky Cast)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది టైప్-సి నుంచి హెచ్‌డీఎంఐ స్క్రీన్ కాస్టింగ్ డివైస్‌గా పనిచేస్తుంది. ప్రజెంటేషన్లు, స్ట్రీమింగ్, సాధారణ వీడియో వ్యూయింగ్‌కు పెద్ద స్క్రీన్ కనెక్టివిటీని ఇది సులభతరం చేస్తుంది. ఈ స్కై కాస్ట్ డివైస్ చాలా కాంపాక్ట్ సైజ్, డిజైన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు. పూర్తిగా వైర్‌లెస్ పద్ధతిలో పనిచేస్తుంది కనుక అదనపు కేబుల్స్ అవసరం ఉండవు. అత్యంత లైట్ వెయిట్‌గా ఉంటుంది కనుక సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇక ఈ డివైస్ మ్యాట్ గ్రే అల్యూమినియం బాడీని కలిగి ఉంది. దీని వల్ల డివైస్‌లో ఉత్పత్తి అయ్యే ఉష్ణం త్వరగా బయటకు వెళ్లిపోతుంది. డివైస్ హీట్ అవకుండా ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలం పాటు మన్నికగా పనిచేస్తుంది.
పోర్టబుల్ డిజైన్..
ఈ స్కై కాస్ట్ డివైస్ పోర్టబుల్ డిజైన్‌ను కలిగి ఉన్న కారణంగా ఎలాంటి ప్రదేశంలో అయినా సరే సులభంగా ఫిక్స్ చేసుకుని ఉపయోగించవచ్చు. సెటప్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఎలాంటి క్లిష్టమైన కాన్ఫిగరేషన్ చేయాల్సిన పనిలేదు. అందువల్ల సాధారణ యూజర్లు కూడా దీన్ని సులభంగా వాడగలుగుతారు. ఈ డివైస్ లో రెండు పార్ట్‌లు ఉంటాయి. ఒకటి ట్రాన్స్‌మిటర్ కాగా రెండోది రిసీవర్‌లా పనిచేస్తుంది. ట్రాన్స్‌మిటర్ టైప్-సి కనెక్షన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని ల్యాప్ టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఫోన్లకు సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఇక రిసీవర్ హెచ్‌డీఎంఐ పోర్టును కలిగి ఉంటుంది. దీన్ని నేరుగా టీవీ లేదా మానిటర్‌కు ఆ పోర్టు ద్వారా కనెక్ట్ చేయవచ్చు. దీంతో రెండు డివైస్‌ల మధ్య సులభంగా కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ తరువాత టీవీ లేదా మానిటర్‌పై ఆయా డివైస్‌ల స్క్రీన్‌లను యాక్సెస్ చేయవచ్చు.
వైఫై, యాప్‌లు అవసరం లేవు..
ఈ డివైస్‌కు అదనంగా ఎలాంటి వైఫై నెట్‌వర్క్ లేదా యాప్‌ల అవసరం లేదు. సింపుల్‌గా ప్లగ్ అండ్ ప్లే టైప్‌లో పనిచేస్తుంది. స్కై కాస్ట్ డివైస్ ద్వారా 4కె రిజల్యూషన్‌ను పొందవచ్చు. అయితే టీవీ లేదా మానిటర్‌లో 4కె సపోర్ట్ ఉండాలి. ఇక 100 వాట్ల పవర్ డెలివరీ పాస్-థ్రూ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. అందువల్ల ఈ డివైస్‌తో ఇతర డివైస్‌లను చార్జింగ్ కూడా చేయవచ్చు. హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్ వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఈ డివైస్‌లో ఇచ్చారు. ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, బ్యాబ్‌లు, స్ట్రీమింగ్ డివైస్‌లు, గేమింగ్ కన్సోల్స్‌తో ఇది కనెక్ట్ అవుతుంది. టైప్-సి డివైస్‌లలో డిస్‌ప్లే పోర్ట్ ఆల్ట్ మోడ్ లేదా థండర్ బోల్ట్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఈ డివైస్ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ పరిధి సుమారు 10 మీటర్ల వరకు ఉంటుంది, ఇది చిన్న గదుల నుంచి మీటింగ్ రూమ్‌ల వరకు పనిచేస్తుంది.
ధర ఎంతంటే..
అల్యూమినియం బాడీ, ప్లగ్-అండ్-ప్లే సెటప్, టైప్-సి ఇన్‌పుట్, 4కె రిజల్యూషన్, వైర్‌లెస్ హెచ్‌డీఎంఐ సపోర్ట్, 10 మీటర్ల రేంజ్, 100 వాట్ల పవర్ డెలివరీ, 1 సంవత్సరం వారంటీ వంటి ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. పోర్ట్రానిక్స్ స్కై కాస్ట్ ధరను రూ. 4,999గా నిర్ణయించారు. ఇది Portronics అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. సులభమైన సెటప్, వైర్‌లెస్ కనెక్టివిటీ, 4కె సపోర్ట్ వంటి ఫీచర్లతో స్కై కాస్ట్ ప్రెజెంటేషన్స్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక ఉపయోగకరమైన గాడ్జెట్‌గా పనిచేస్తుంది. వైఫై లేకుండా కూడా స్క్రీన్ కాస్టింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు
- ●Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
- ●DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ
- ●Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్
- ●Revanth Reddy | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, మంత్రులు
- ●CWG 2026 | భారత్ మ్యాప్‌లో కనిపించని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంతరం తెలిపిన లవ్లీనా

Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు

Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి

DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ

Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్






