Portronics Zeno B | పోర్ట్రోనిక్స్ నుంచి సరికొత్త మసాజర్.. ఇంట్లోనే ఈజీగా మసాజ్ చేసుకోవచ్చు..
Portronics Zeno B | టెక్నాలజీలో రోజు రోజుకీ అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగానే అనేక రంగాల్లో అద్భుతమైన ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక వైద్య రంగంలోనూ ఎన్నో నూతన ఉత్పత్తులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిపుణులు ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తున్నారు.
Popular news | Published On Dec 23, 2025, 12.40 pm IST
Portronics Zeno B | టెక్నాలజీలో రోజు రోజుకీ అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగానే అనేక రంగాల్లో అద్భుతమైన ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక వైద్య రంగంలోనూ ఎన్నో నూతన ఉత్పత్తులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిపుణులు ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తున్నారు. వాటితో సామాన్య ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే అనేక రకాల వస్తువులు ప్రస్తుతం సామాన్యులకు కూడా చేరువ అవుతున్నాయి. దీంతో వారు తమ ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవడం సులభంగా మారింది. ఇదే కోవలో అనేక కంపెనీలు ఇప్పటికే అద్భుతమైన ఉత్పత్తులను వైద్య రంగంలో లాంచ్ చేశాయి. ఇక ఇదే కోవలో పోర్ట్రోనిక్స్ కూడా ఓ నూతన డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో ఎవరైనా సరే ఇంట్లోనే చాలా సులభంగా మసాజ్ చేసుకోవచ్చు.
కండరాల నొప్పులకు చెక్..
ఎలక్ట్రానిక్స్ తయారీదారు పోర్ట్రోనిక్స్ (Portronics) తాజాగా జెనో బి (Zeno B) పేరిట ఓ పోర్టబుల్ పర్‌కషన్ గన్ మసాజర్‌ను లాంచ్ చేసింది. దీనికి ఎప్పటికప్పుడు తీసి అమర్చుకునేలా 6 ప్రత్యేకమైన డిటాచబుల్ హ్యాండిల్స్‌ను కూడా అందిస్తున్నారు. వీటి సహాయంతో శరీరంలోని ఏ భాగంలో అయినా చాలా సులభంగా ఎవరికి వారు సొంతంగా మసాజ్ చేసుకోవచ్చు. ఇతరుల సహాయం అవసరం లేదు. పైగా ఒకసారి ఈ డివైస్‌ను కొంటే వినియోగదారులు మసాజ్ కోసం ప్రతిసారి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా మసాజ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో మసాజ్ చేసేందుకు గాను ప్రత్యేకంగా బీఎల్‌డీసీ మోటార్‌ను ఇచ్చారు. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. కండరాలపై సున్నితంగా ఒత్తిడిని కలగజేస్తూ మసాజ్ చేస్తుంది. దీంతో కండరాలు పట్టేయడం, కండరాల నొప్పులు, అలసట వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

5 స్పీడ్ లెవల్స్, 6 హ్యాండిల్స్..
జెనో బి మసాజర్ లో 5 అడ్జస్టబుల్ స్పీడ్ లెవల్స్ ఉంటాయి. మసాజ్ చేసే ఫ్యాన్ ఏ స్పీడ్‌లో తిరగాలో 5 లెవల్స్‌లో సెట్ చేసుకోవచ్చు. ఈ స్పీడ్ లెవల్స్ ను 1600 నుంచి 3200 ఆర్‌పీఎం మధ్య ఇచ్చారు. కనుక కావల్సినంత వేగంతో మసాజ్ చేసుకోవచ్చు. ఈ మసాజర్‌కు ఎర్గోనోమిక్ హ్యాండిల్‌ను ఇచ్చారు. కనుక దీన్ని పట్టుకోవడం, ఆపరేట్ చేయడం సులభంగా ఉంటుంది. వెనుక వైపు కూడా సాధారణంగా చేతులకు అందని భాగాలను కూడా ఈ మసాజర్‌తో అందుకుని చాలా సులభంగా మసాజ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను హ్యాండిల్‌ను ప్రత్యేకంగా డిజైన్‌తో తీర్చిదిద్దారు. దీని వల్ల వెన్నెముక, భుజాలు, వెన్ను, కాళ్లను సులభంగా మసాజ్ చేయవచ్చు. ఈ మసాజర్‌తోపాటు ఆయా భాగాల్లో భిన్న రకాలుగా మసాజ్ చేసుకునేందుకు 6 ప్రత్యేక డిటాచబుల్ హ్యాండిల్స్‌ను ఇస్తున్నారు. ఫోర్క్, బుల్లెట్, ఫ్లాట్, బాల్, అబ్జార్బర్, ఫ్రీజ్ హెడ్ పేరిట ఈ హ్యాండిల్స్‌ను ఇస్తున్నారు.
ధర వివరాలు..
ఈ మసాజర్ బరువు సుమారుగా 350 గ్రాములు ఉంటుంది. ఇందులో 2000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న రెండు బ్యాటరీలు ఉంటాయి. దీంతో మొత్తం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ లభిస్తుంది. అందువల్ల ఈ మసాజర్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే సుమారుగా 3 నుంచి 4 గంటల వరకు పనిచేస్తుంది. కనుక దీన్ని ప్రయాణాల్లో కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు, చార్జింగ్ చేసుకోవచ్చు. చార్జింగ్ చేసుకునేందుకు యూఎస్‌బీ టైప్ సి పోర్టు లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఈ మసాజర్ లభిస్తుండగా దీనిపై 12 నెలల వారంటీ లభిస్తుంది. కాగా పోర్ట్రోనిక్స్ జెనో బి మసాజర్ ధర రూ.3,799 ఉండగా దీన్ని రూ.3,499 డిస్కౌంట్ ధరకు అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. పరిమిత కాలం పాటు మాత్రమే అది కూడా కేవలం అమెజాన్‌లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక దీన్ని పోర్ట్రోనిక్స్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రధాన ఆన్‌లైన్ స్టోర్స్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. ఇది ఫిట్ నెస్ ప్రియులకే కాక సామాన్యులకు కూడా ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని పోర్ట్రోనిక్స్ చెబుతోంది.
సంబంధిత వార్తలు

Portronics | రూ.5,999కే హోమ్ థియేటర్.. పోర్ట్రోనిక్స్ నుంచి ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2..
జులై 20, 2026

vivo T5 Lite 44W 5G | భారీ బ్యాటరీ, ఆకట్టుకునే ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
జులై 16, 2026

Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
జులై 4, 2026
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు
- ●Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
- ●DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ
- ●Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్
- ●Revanth Reddy | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, మంత్రులు
- ●CWG 2026 | భారత్ మ్యాప్‌లో కనిపించని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంతరం తెలిపిన లవ్లీనా

Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు

Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి

DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ

Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్



