Kinetics 8K | విద్యుత్ లేకపోయినా నెట్ ఆగదు.. పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ విడుదల..
Kinetics 8K | ఇంట్లో లేదా ఆఫీస్‌లో విద్యుత్‌కు అంతరాయం వచ్చినప్పుడు కూడా వై-ఫై కనెక్టివిటీ కొనసాగించేందుకు పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ పవర్ బ్యాంక్‌ను లాంచ్ చేసింది. వై-ఫై రూటర్లు, మోడెమ్‌లు, అనుకూల సెక్యూరిటీ కెమెరాలకు బ్యాకప్ పవర్ అందించేలా ఈ డివైస్‌ను రూపొందించారు.
Technology | Published On Jun 1, 2026, 4.05 pm IST
Kinetics 8K | ఇంట్లో లేదా ఆఫీస్‌లో విద్యుత్‌కు అంతరాయం వచ్చినప్పుడు కూడా వై-ఫై కనెక్టివిటీ కొనసాగించేందుకు పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ పవర్ బ్యాంక్‌ను లాంచ్ చేసింది. వై-ఫై రూటర్లు, మోడెమ్‌లు, అనుకూల సెక్యూరిటీ కెమెరాలకు బ్యాకప్ పవర్ అందించేలా ఈ డివైస్‌ను రూపొందించారు. నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమయ్యే ఆధునిక గృహాలు, చిన్న కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. కినెటిక్స్ 8కె క్రీమ్-ఐవరీ కలర్ డిజైన్‌తో, మినిమలిస్టిక్ లుక్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆధునిక ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్న ఇంటీరియర్‌కు సులభంగా సరిపోయేలా దీని రూపకల్పన చేశారు. తేలికైన బరువు, కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ కారణంగా వర్క్‌స్టేషన్, రూటర్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్ పక్కన ఎక్కువ స్థలం ఆక్రమించకుండా ఉంచుకోవచ్చు. అలాగే ఎక్కువసేపు పనిచేసే సమయంలో వేడి బయటకు వెళ్లేందుకు బిల్ట్-ఇన్ వెంటిలేషన్ సదుపాయం కూడా కల్పించారు.
8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ మినీ యూపీఎస్‌లో 8000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీంతో గరిష్టంగా 5 గంటల వరకు నిరంతర పవర్ బ్యాకప్ అందిస్తుందదని కంపెనీ తెలిపింది. అయితే బ్యాకప్ సమయం కనెక్ట్ చేసిన పరికరాల విద్యుత్ వినియోగం, బ్యాటరీ స్థితి, వినియోగ విధానంపై ఆధారపడి మారుతుంది. ముఖ్యంగా 12వి డీసీ వై-ఫై రూటర్లకు స్థిరమైన పవర్ సప్లై అందించేలా దీన్ని రూపొందించారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ విద్య, మీడియా స్ట్రీమింగ్, స్మార్ట్ సెక్యూరిటీ వ్యవస్థలకు ఇది ఉపయోగపడుతుంది. వివిధ తక్కువ విద్యుత్ వినియోగించే పరికరాలకు అనుకూలంగా కినెటిక్స్ 8కెలో పలు అవుట్‌పుట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 5వి/2.1ఏ, 9వి/2ఏ, 12వి/1.5ఏ డీసీ అవుట్‌పుట్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూఎస్‌బీ-ఏ, టైప్-సీ పోర్ట్‌లను కూడా ఇచ్చారు. దీంతో బ్రాడ్‌బ్యాండ్ రూటర్లు, ఓఎన్‌టీ/ఫైబర్ డివైస్‌లు, అనుకూల సెక్యూరిటీ కెమెరాలు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లగ్-అండ్-ప్లే విధానంలో పనిచేయడం వల్ల ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ధర ఎంతంటే..
పోర్ట్రానిక్స్ కినెటిక్స్ 8కె ధరను రూ.2,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1,699కు అందుబాటులో ఉంది. ఈ ఉత్పత్తికి 12 నెలల వారంటీ కూడా లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వేదికలతోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలోనూ దీన్ని కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత వార్తలు

Portronics | రూ.5,999కే హోమ్ థియేటర్.. పోర్ట్రోనిక్స్ నుంచి ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2..
జులై 20, 2026

Premium Power Banks | బ్యాటరీ టెన్షన్‌కు చెక్.. బెస్ట్ ప్రీమియం పవర్ బ్యాంక్స్ ఇవే!
జూన్ 20, 2026

Portronics Sky Cast | వైఫై లేకుండానే స్క్రీన్ కాస్ట్ చేయొచ్చు.. కొత్త డివైస్ అందుబాటులోకి.. ధర ఎంతంటే..?
మే 4, 2026
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు
- ●Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
- ●DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ
- ●Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్
- ●Revanth Reddy | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, మంత్రులు
- ●CWG 2026 | భారత్ మ్యాప్‌లో కనిపించని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంతరం తెలిపిన లవ్లీనా

Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు

Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి

DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ

Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్



