POCO X8 Pro | అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన పోకో ఎక్స్8 ప్రొ ఫోన్లు.. ధర ఎంతంటే..?
POCO X8 Pro | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో తన నూతన స్మార్ట్ ఫోన్లు పోకో ఎక్స్8 ప్రొ, పోకో ఎక్స్8 ప్రొ మ్యాక్స్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో రిలీజ్ అయిన ఈ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీని కూడా ఎక్కువగానే ఇచ్చారు.
Technology | Published On Mar 18, 2026, 3.34 pm IST
POCO X8 Pro | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో తన నూతన స్మార్ట్ ఫోన్లు పోకో ఎక్స్8 ప్రొ, పోకో ఎక్స్8 ప్రొ మ్యాక్స్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో రిలీజ్ అయిన ఈ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీని కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఈ రెండు ఫోన్లను ఫ్లిప్ కార్ట్‌లో విక్రయిస్తుండగా, లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు.
పోకో ఎక్స్8 ప్రొ ఫీచర్లు..
ఇందులో 6.59 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 1.5కె రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ లభిస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50, 8 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లను అందించారు. ఐపీ69కె డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. 5జి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 6.0, వైఫై 7, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు. 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంది. దీనికి 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
పోకో ఎక్స్8 ప్రొ మ్యాక్స్ ఫీచర్లు..
6.83 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1.5కె రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50, 8 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే 3డి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లను అందించారు. ఐపీ69కె డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. 5జి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు. 9000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

ధర వివరాలు..
పోకో ఎక్స్8 ప్రొ స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.32,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.35,999గా ఉంది. ఇందులోనే ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఫోన్‌ను కూడా లాంచ్ చేశారు. దీని ధర రూ.37,999 ఉండగా, ఇందులో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ లభిస్తున్నాయి.
పోకో ఎక్స్8 ప్రొ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.42,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.46,999గా నిర్ణయించారు.
ఈ రెండు ఫోన్లను మార్చి 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. ఈ సందర్భంగా పలు లాంచ్ ఆఫర్లను సైతం కామన్‌గా రెండు ఫోన్లకు అందిస్తున్నారు. ఈ ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.3వేల అదనపు డిస్కౌంట్ ఇస్తారు. 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మార్చి 23న ఈ ఫోన్లను కొంటే 1 ఏడాది కాకుండా ఇంకో ఏడాదికి కూడా అదనపు వారంటీని పొందవచ్చు. అలాగే 1 ఏడాది కాలవ్యవధి గల ఉచిత స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్
- ●Imperial College London | ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ సర్కార్ మెగా డీల్? లండన్ టూర్లో సీఎం సలహాదారు కీలక చర్చలు
- ●Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే
- ●Harish Rao | జీవో 97ని తక్షణం రద్దు చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
- ●Jagtial Medical College Jobs | మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడాలని ఉందా? జగిత్యాల మెడికల్ కాలేజీలో 69 ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూ
- ●Immigration | విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భౌతిక బోర్డింగ్ పాస్ అవసరం లేదు..

Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్

Imperial College London | ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ సర్కార్ మెగా డీల్? లండన్ టూర్లో సీఎం సలహాదారు కీలక చర్చలు

Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే

Harish Rao | జీవో 97ని తక్షణం రద్దు చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్






