Poco C85x 5G | 6300ఎంఏహెచ్ బ్యాటరీ, 32ఎంపీ కెమెరాతో.. పోకో సి85ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్..
Poco C85x 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో భారత మార్కెట్‌లో తన సి-సిరీస్‌లో భాగంగా కొత్త పోకో సి85ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ త్వరలోనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రకాల కలర్ ఆప్షన్‌లలో, రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది.
Technology | Published On Mar 10, 2026, 3.13 pm IST
Poco C85x 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో భారత మార్కెట్‌లో తన సి-సిరీస్‌లో భాగంగా కొత్త పోకో సి85ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ త్వరలోనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రకాల కలర్ ఆప్షన్‌లలో, రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. పోకో సి85ఎక్స్ 5జి లో 6,300ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కు 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు. అలాగే 7.5వాట్ల రివర్స్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇచ్చారు. అందువల్ల ఈ ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవడమే కాకుండా ఇతర ఫోన్లను కూడా దీంతో చార్జింగ్ చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌కు వెనుక వైపు 32 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. 6.9 ఇంచుల డిస్‌ప్లే ఇందులో లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయం..
పోకో సి85ఎక్స్ 5జి ప్రారంభ ధర రూ.10,999గా ఉంది. ఈ ధర 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇక 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. షియోమీ సబ్‌బ్రాండ్ అయిన పోకో విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్చి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ రంగుల్లో లాంచ్ అయింది. ఇందులో 5జి డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఇందులో లభిస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లేకు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ లభిస్తుంది. ఐపీ57 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ టి8300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
2 రోజుల వరకు బ్యాటరీ..
ఫోన్‌కు వెనుక వైపు 32 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు. ఈ కెమెరాలతో 10ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌ను ఒకసారి చార్జింగ్ చేస్తే 2 రోజుల వరకు సాధారణ యూసేజ్‌తో బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో 5జి, 4జీ ఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.4, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్ సి తదితర కనెక్టివిటీ ఫీచర్లను ఇస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
ఆగస్టు 22, 2026

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్
- ●Imperial College London | ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ సర్కార్ మెగా డీల్? లండన్ టూర్లో సీఎం సలహాదారు కీలక చర్చలు
- ●Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే
- ●Harish Rao | జీవో 97ని తక్షణం రద్దు చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
- ●Jagtial Medical College Jobs | మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడాలని ఉందా? జగిత్యాల మెడికల్ కాలేజీలో 69 ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూ
- ●Immigration | విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భౌతిక బోర్డింగ్ పాస్ అవసరం లేదు..

Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్

Imperial College London | ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ సర్కార్ మెగా డీల్? లండన్ టూర్లో సీఎం సలహాదారు కీలక చర్చలు

Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్నడు.. ఆ 15 ఎకరాలను తిరిగి ఇవ్వాల్సిందే

Harish Rao | జీవో 97ని తక్షణం రద్దు చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్



