Perplexity Pro | పర్‌ప్లెక్సిటీ ప్రొ సబ్‌స్క్రిప్షన్ ఉచితం పేరిట బురిడీ.. ప్రీమియం ప్లాన్లు ఫ్రీగా వస్తే నమ్మొచ్చా..?
Perplexity Pro | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. జూలై 2025లో ఏఐ ప్లాట్‌ఫాం Perplexity తో భాగస్వామ్యం అయ్యామని, తమ కస్టమర్లకు రూ.17వేలు విలువైన ఏడాది కాల వ్యవధి గల Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
Technology | Published On Feb 18, 2026, 2.10 pm IST
Perplexity Pro | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. జూలై 2025లో ఏఐ ప్లాట్‌ఫాం Perplexity తో భాగస్వామ్యం అయ్యామని, తమ కస్టమర్లకు రూ.17వేలు విలువైన ఏడాది కాల వ్యవధి గల Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇచ్చింది కూడా. ఈ క్రమంలో చాలా మంది కస్టమర్లు ఈ సబ్‌స్క్రిప్షన్ ను యాక్టివేట్ కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా యాక్టివేట్ చేసుకున్న వారికి ఆ ఏఐ ప్లాట్‌ఫాం షాకిచ్చింది. ఉచిత సబ్‌స్క్రిప్షన్ కొనసాగాలంటే పేమెంట్ వివరాలను నమోదు చేయాలని సూచిస్తోంది. దీని వల్ల సబ్‌స్క్రిప్షన్ కాల వ్యవధి పూర్తవగానే ఆటోమేటిగ్గా బిల్ వేసి ఆ మొత్తాన్ని (రూ.17వేలు) కస్టమర్ నుంచి వసూలు చేయాలనేది Perplexity ప్లాన్. దీంతో యూజర్ ఈ ఉచిత బెనిఫిట్ కోసం ఇంకో ఏడాదికి పెయిడ్ ప్లాన్‌కు కచ్చితంగా కమిట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది.
పెయిడ్ ప్లాన్ తీసుకోకపోతే ఫ్రీ ప్లాన్ కూడా ఉండదు..
ఒక వేళ యూజర్ Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ వద్దని ఎంపిక చేసుకుని ప్రస్తుతం ఉన్న ఉచిత ఆఫర్‌లో కాలవ్యవధి ముగిసే వరకు కొనసాగుదామంటే కుదరడం లేదు. యూజర్ సబ్‌స్క్రిప్షన్ వద్దని ఎంపిక చేసుకుని పేమెంట్ వివరాలను నమోదు చేయనని చెబితే ఆ తరువాత మళ్లీ అకౌంట్‌లోకి లాగిన్ అయినప్పుడు Pro సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్‌గా లేదని చూపిస్తోంది. అంటే ఉచిత పీరియడ్ ముగిసిన తరువాత పెయిడ్ ప్లాన్‌ను తీసుకునేవారికి మాత్రమే Perplexity ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో ఇప్పటికే Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా యాక్టివేట్ చేసుకున్న వారు కూడా తమ ఆఫర్ పీరియడ్ ముగిసేలోపు పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోకపోతే వారి అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని అర్థమవుతోంది. ఈ క్రమంలో ఉచిత పీరియడ్ ఉన్నా కూడా అప్పటి వరకు Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ ను వాడుకోవడం వీలు కాదు. వాస్తవంగా గతంలో ఎయిర్ టెల్ ప్రకటించిన ప్రకారం అయితే ఏడాది పాటు ఉచితంగా ఈ ప్లాన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పట్లో ఎయిర్‌టెల్ స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. ఏడాదిపాటు Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నామని, దీని విలువ రూ.17వేలు అని, దేశంలోని 36 కోట్ల మంది ఎయిర్‌టెల్ యూజర్లకు లాభం కలుగుతుందని చెప్పింది. ఇక ఇప్పుడు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.

ఎయిర్ టెల్ థాంక్స్ యాప్‌లో క్లెయిమ్డ్ రివార్డులలో పర్‌ప్లెక్సిటీ ప్రొ సబ్‌స్క్రిప్షన్ ఈ ఏడాది ఆగస్టు 23 వరకు ఉంది. అదే ఖాతాలో లాగిన్ అయ్యాక పక్కన స్క్రీన్‌లో గెట్ ప్రొ అని చూపిస్తున్న దృశ్యం.
స్పందించిన ఎయిర్‌టెల్..
ఇదే విషయమై ఎయిర్‌టెల్ స్పందిస్తూ జనవరి 16వ తేదీ లోపు ఈ సబ్‌స్క్రిప్షన్ ను యాక్టివేట్ చేసుకున్న వారు యథావిధిగా ఉచితంగా సేవలను పొందుతారని, కొత్త కస్టమర్లకు ఈ ఆఫర్‌ను అందించడం లేదని తెలిపింది. అయితే ఇది కాగితాలకే పరిమితం అయిందని పలువురు కస్టమర్లు పేర్కొంటున్నారు. తమ Perplexity ఖాతాల్లో పేమెంట్ వివరాలను నమోదు చేయాలని వస్తుందని, అలా అయితేనే అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుందని చూపిస్తుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పేమెంట్ వివరాలను నమోదు చేస్తే ఉచిత పీరియడ్ ముగియగానే ఆటోమేటిక్‌గా బిల్లు వసూలు చేస్తారని, ఎయిర్‌టెల్, పర్‌ప్లెక్సిటీ పాల్పడుతున్న చర్యలు సరికావని కస్టమర్లు అంటున్నారు. అయితే Perplexity Pro ను యాక్టివేట్ చేసుకున్న కస్టమర్లు ఒకసారి తమ అకౌంట్‌లోకి లాగిన్ అయి పేమెంట్ వివరాలను చెక్ చేసుకోవాలని, లేదంటే ఉచిత పీరియడ్ ముగియగానే రూ.17వేలు బిల్లు చెల్లించాల్సి వస్తుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రీమియం ప్లాను ఫ్రీగా వస్తే..?
అయితే ఎయిర్‌టెల్, పర్‌ప్లెక్సిటీ సంస్థలు కావాలనే వినియోగదారులను చేర్చేందుకే ఈ ప్లాన్‌ను ఆ విధంగా అందించాయని కొందరు ఫిర్యాదు చేస్తుండగా, రోజు రోజుకీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లను అంత పెద్ద ఎత్తున కస్టమర్లకు అందించడం సాధ్యం కాదని, కనుకనే ఆయా సంస్థలు ఇలా చేశాయని అంటున్నారు. ఇక ఎయిర్‌టెల్ ఇటీవలే అడోబ్ సంస్థతో కలిసి భాగస్వామ్యం అయ్యామని చెప్పి రూ.4వేల విలువైన ఏడాది కాల వ్యవధి గల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సేవలను తమ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. కానీ Perplexity Pro ఉదంతం నేపథ్యంలో ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ఫ్రీబీలపై అధిక శాతం మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- రచయిత స్వీయ అనుభవం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






