త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OPPO K14x 5G | 6500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఒప్పో కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలు ఇవే..!

OPPO K14x 5G | స్మార్ట్ ఫోన్ త‌యారీదారు ఒప్పో భార‌త్‌లో OPPO K14x 5G పేరిట కె సిరీస్‌లో ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల డిస్‌ప్లే ఉండ‌గా, దీనికి హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 10, 2026, 1.09 pm IST

OPPO K14x 5G | 6500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఒప్పో కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలు ఇవే..!
Advertisement

OPPO K14x 5G | స్మార్ట్ ఫోన్ త‌యారీదారు ఒప్పో భార‌త్‌లో OPPO K14x 5G పేరిట కె సిరీస్‌లో ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల డిస్‌ప్లే ఉండ‌గా, దీనికి హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. క‌నుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. అలాగే సూర్య‌కాంతిలోనూ ఫోన్ డిస్‌ప్లేను స్ప‌ష్టంగా వీక్షించేలా 1125 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ఆధారిత క‌ల‌ర్ ఓఎస్ 16ను ఇచ్చారు.

స్లీక్ డిజైన్‌..

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఇది 6జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను గ‌రిష్టంగా అందిస్తుంది. ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా, మ‌రో 2 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరాను సైతం ఇచ్చారు. అలాగే ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు ఐపీ 64 డ‌స్ట్‌, వాట‌ర్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. 8.61 ఎంఎం మందంతో అత్యంత స్లీక్ డిజైన్ ను ఈ ఫోన్ క‌లిగి ఉంది. మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ కూడా ఉంది. వీటి వల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ రావ‌డ‌మే కాకుండా, ఫోన్‌ను ప‌ట్టుకునేందుకు గ్రిప్ కూడా సుల‌భంగా ల‌భిస్తుంది.

భారీ బ్యాట‌రీ..

ఒప్పో కె14ఎక్స్ 5జి ఫోన్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా బ్యాట‌రీని చెప్ప‌వ‌చ్చు. ఇందులో ఏకంగా 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అందిస్తున్నారు. క‌నుక బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ కూడా ఉంది. దీని వ‌ల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఫోన్‌తోపాటు చార్జ‌ర్‌ను కూడా బాక్సులో అందిస్తున్న‌ట్లు కంపెనీ తెలియ‌జేసింది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క వైపు ఇచ్చారు. 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్ ల‌భిస్తోంది. డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర స‌దుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఒప్పో కె14ఎక్స్ 5జి ఫోన్‌ను ప్రిజం వ‌యొలెట్‌, ఐసీ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌రను రూ.16,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ తో పాటు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో, ఆఫ్ లైన్ స్టోర్ల‌లో ఈ నెల 16వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్ పై రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. 3 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement