త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | ఫిఫా వరల్డ్ కప్‌కు మెటా భారీ సేఫ్టీ ప్లాన్.. మోసాల‌కు చెక్ పెట్టేలా చ‌ర్య‌లు..

Meta | ఫిఫా వరల్డ్ కప్ 2026 సందర్భంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో మోసాల నివారణ, వినియోగదారుల అవగాహన, దుర్వినియోగ కంటెంట్ గుర్తింపుపై చేపట్టిన భద్రతా చర్యలను మెటా ప్లాట్‌ఫార్మ్స్ వెల్లడించింది.

S

Technology | Published On May 29, 2026, 4.08 pm IST

Meta | ఫిఫా వరల్డ్ కప్‌కు మెటా భారీ సేఫ్టీ ప్లాన్.. మోసాల‌కు చెక్ పెట్టేలా చ‌ర్య‌లు..
Advertisement

Meta | ఫిఫా వరల్డ్ కప్ 2026 సందర్భంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో మోసాల నివారణ, వినియోగదారుల అవగాహన, దుర్వినియోగ కంటెంట్ గుర్తింపుపై చేపట్టిన భద్రతా చర్యలను మెటా ప్లాట్‌ఫార్మ్స్ వెల్లడించింది. ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ల సమయంలో మోసాలు, హానికర కంటెంట్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్, పరిశ్రమల మధ్య సమన్వయం, ప్లాట్‌ఫామ్ స్థాయి భద్రతా ఫీచర్లతో తన వ్యవస్థలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపింది. టోర్నమెంట్ సమయంలో మోసపూరిత కార్యకలాపాలను గుర్తించి తొలగించేందుకు అధునాతన ఏఐ సిస్టమ్స్, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, చట్ట అమలు సంస్థలు, పరిశ్రమ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు మెటా తెలిపింది. పెద్ద క్రీడా ఈవెంట్ల సమయంలో టికెట్ స్కామ్‌లు, నకిలీ ఇమ్మిగ్రేషన్ సేవలు, తప్పుడు ట్రావెల్ లేదా అకామడేషన్ ఆఫర్లు, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని సేకరించేందుకు రూపొందించిన ఫేక్ గ్యాంబ్లింగ్ స్కీములు పెరుగుతాయని కంపెనీ పేర్కొంది.

అధునాత‌న వ్య‌వ‌స్థ‌ల‌తో భాగ‌స్వామ్యం..

ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు గ్లోబల్ సిగ్నల్ ఎక్స్చేంజ్ (జీఎస్‌ఈ), ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ రిసిప్రోకల్ ఎక్స్చేంజ్ (ఫైర్) వంటి వ్యవస్థల ద్వారా ఇతర సంస్థలతో కలిసి స్కామ్ సమాచారాన్ని పంచుకుంటూ, వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఫ్రాడ్ నెట్‌వర్క్‌లను అడ్డుకుంటున్నట్లు మెటా వెల్లడించింది. వీసాతో కలిసి జీఎస్‌ఈ ద్వారా చేపట్టిన సమన్వయ చర్యలో భాగంగా ఫేస్‌బుక్‌లో పనిచేస్తున్న ఓ స్కామ్ నెట్‌వర్క్‌ను గుర్తించి తొలగించినట్లు మెటా తెలిపింది. ఈ నెట్‌వర్క్ ఫిఫా వరల్డ్ కప్ 2026 బ్రాండింగ్‌ను నకిలీగా ఉపయోగించి వినియోగదారులను ఫేక్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు మళ్లిస్తోంది. అవి అసాధ్యమైన విజయ శాతాలను చూపిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించాయని పేర్కొంది. టోర్నమెంట్‌కు ముందు, టోర్నమెంట్ సమయంలో, అనంతరం కూడా మారుతున్న మోసపూరిత పద్ధతులను గుర్తించి అడ్డుకునేందుకు సిగ్నల్ షేరింగ్ వ్యవస్థలను కొనసాగిస్తామని మెటా తెలిపింది.

యూజ‌ర్ల‌కు ప్ర‌త్యేక అలర్ట్‌లు..

టోర్నమెంట్ సమయంలో ఫిఫా వరల్డ్ కప్ టికెట్లకు సంబంధించిన కంటెంట్‌ను వినియోగదారులు సెర్చ్ చేసినప్పుడు లేదా సంబంధిత గ్రూపులను సందర్శించినప్పుడు ఫేస్‌బుక్‌లో ప్రత్యేక అలర్ట్‌లను ప్రవేశపెట్టనున్నట్లు మెటా తెలిపింది. ఈ అలర్ట్‌లు ధ్రువీకరించిన టికెట్ వనరులను మాత్రమే ఉపయోగించాలని సూచించడంతోపాటు అనుమానాస్పద కార్యకలాపాలను రిపోర్ట్ చేసే టూల్స్‌కు యాక్సెస్‌ను అందిస్తాయి. ఇక అవాంఛిత సంప్రదింపులను తగ్గించడంతోపాటు వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేలా టూల్స్‌ను మెటా విస్తరిస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 సమయంలోనే కాకుండా అనంతరం కూడా అభిమానులు, ఆటగాళ్ల భద్రత కోసం తన సేఫ్టీ సిస్టమ్స్‌ను మరింత మెరుగుపరుస్తూ, ఏఐ ఆధారిత మోడరేషన్‌ను విస్తరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములు, నియంత్రణ సంస్థలు, క్రీడా సంస్థలతో కలిసి పనిచేస్తామని మెటా వెల్లడించింది.

Advertisement
Advertisement