AI Agent Smartphone | ఓపెన్ఏఐ నుంచి ఇక ఏఐ స్మార్ట్ ఫోన్.. పూర్తిగా ఏఐతోనే పనిచేస్తుంది..
AI Agent Smartphone | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ఏఐ తన తొలి ప్రొప్రైటరీ ఏఐ ఏజెంట్ ఫోన్ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు తాజా ఇండస్ట్రీ రిపోర్ట్ వెల్లడించింది. ప్రముఖ సప్లై చైన్ అనలిస్ట్ మింగ్-చి కువో తెలిపిన ప్రకారం ఈ డివైస్ కు గాను భారీ ఎత్తున ఉత్పత్తి 2027 మొదటి అర్ధ భాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Technology | Published On May 6, 2026, 1.04 pm IST
AI Agent Smartphone | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ఏఐ తన తొలి ప్రొప్రైటరీ ఏఐ ఏజెంట్ ఫోన్ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు తాజా ఇండస్ట్రీ రిపోర్ట్ వెల్లడించింది. ప్రముఖ సప్లై చైన్ అనలిస్ట్ మింగ్-చి కువో తెలిపిన ప్రకారం ఈ డివైస్ కు గాను భారీ ఎత్తున ఉత్పత్తి 2027 మొదటి అర్ధ భాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ హార్డ్‌వేర్ ప్రాజెక్ట్ వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు ఉండగా, ఒకటి, భవిష్యత్తులో ఉండే ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం బలమైన నేరేటివ్ సృష్టించడం, రెండవది, వేగంగా పెరుగుతున్న ఏఐ హార్డ్‌వేర్ మార్కెట్‌లో పోటీదారుల మధ్య స్థానం సంపాదించడమేనని తెలుస్తోంది.
2027లో లాంచ్..?
ఈ డివైస్‌కు ప్రాసెసర్ సరఫరాదారుగా మీడియాటెక్ ఎంపికైనట్లు సమాచారం. కువో సప్లై చైన్ విశ్లేషణ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌కు మీడియాటెక్ ఏకైక చిప్ సరఫరాదారుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో కస్టమైజ్డ్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్ వేరియంట్ ను ఇవ్వనున్నారు. ఈ చిప్‌ను టీఎస్ఎంసీ ఆధునిక ఎన్2పీ ప్రాసెస్ నోడ్‌పై అభివృద్ధి చేస్తున్నారు. చిప్ ఉత్పత్తి 2026 రెండో అర్ధభాగంలో ప్రారంభం కానుంగా, 2027లో ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఏఐ ఫోన్ ప్రత్యేకంగా ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏజెంటిక్ వర్క్‌ఫ్లోలకు అనుగుణంగా డిజైన్ అవుతోంది.
మెరుగైన సిగ్నల్ ప్రాసెసింగ్, హెచ్‌డీఆర్ పైప్‌లైన్, ఏఐ కంప్యూటింగ్..
అడ్వాన్స్‌డ్ విజువల్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఐఎస్పీ) ఈ డివైస్‌లో ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. మెరుగైన హెచ్‌డీఆర్ పైప్‌లైన్ ద్వారా ఏఐ ఏజెంట్ వాస్తవ ప్రపంచ డేటాను మరింత కచ్చితంగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కూడా మెరుగు పరిచారు. డ్యూయల్ ఎన్పీయూ (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్) ఆర్కిటెక్చర్ ద్వారా ఒకేసారి అనేక క్లిష్టమైన ఏఐ పనులను నిర్వహించవచ్చు. మెమరీ, స్టోరేజ్ కూడా భారీగా విస్తరించారు. పెద్ద సైజు ఏఐ మోడళ్లకు తగిన విధంగా నెక్స్ట్ జనరేషన్ ఎల్పీడీడీఆర్6 ర్యామ్, యూఎఫ్‌ఎస్ 5.0 స్టోరేజ్ ను అందించనున్నారు.
కట్టుదిట్టమైన భద్రత..
భద్రతా వ్యవస్థ విషయానికి వస్తే పీకేవీఎం (ప్రొటెక్టెడ్ కర్నల్ వర్చువల్ మెషిన్), ఇన్‌లైన్ హ్యాషింగ్ వంటి టెక్నాలజీలతో డేటా, ఏఐ ఆపరేషన్లకు అధిక భద్రత కల్పించనున్నారు. ప్రస్తుతం ఫోన్ డెవలపింగ్ దశలో ఉండగా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రాజెక్ట్ కొనసాగితే, 2027-2028 లో ఈ ఏఐ ఫోన్ ను లాంచ్ చేయనున్నారు. ఇక మొదటి ఉత్పత్తిలో షిప్‌మెంట్లు సుమారు 3 కోట్ల యూనిట్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ఏఐ ఏజెంట్ ఫోన్ ద్వారా ఓపెన్ఏఐ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వినూత్న పోటీని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఏఐ ఆధారిత వ్యక్తిగత డివైస్‌లలో ఒక కొత్త శకం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



