త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sam Altman | యువ‌త పెద్ద‌ల మాట‌ల‌ను ఎక్కువ‌గా వినొద్దు: ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మ‌న్

Sam Altman | యువ‌త పెద్దల మాట‌ల‌ను ఎక్కువ‌గా వినొద్ద‌ని, అలా వింటే పొర‌పాటు చేసిన‌ట్లేన‌ని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మ‌న్ అన్నారు. ఐఐటీ ఢిల్లీలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న యువ‌త‌ను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఏఐ కోసం సిద్ధ‌మ‌వుతున్న యువ‌త‌కు ప‌లు కీల‌క‌ సూచ‌న‌లు చేశారు.

S

Technology | Published On Feb 24, 2026, 12.22 pm IST

Sam Altman | యువ‌త పెద్ద‌ల మాట‌ల‌ను ఎక్కువ‌గా వినొద్దు: ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మ‌న్
Advertisement

Sam Altman | యువ‌త పెద్దల మాట‌ల‌ను ఎక్కువ‌గా వినొద్ద‌ని, అలా వింటే పొర‌పాటు చేసిన‌ట్లేన‌ని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మ‌న్ అన్నారు. ఐఐటీ ఢిల్లీలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న యువ‌త‌ను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఏఐ కోసం సిద్ధ‌మ‌వుతున్న యువ‌త‌కు ప‌లు కీల‌క‌ సూచ‌న‌లు చేశారు. భవిష్యత్తు ప్రపంచం ఎలా మారబోతుందన్న విషయంపై, మార్పుల వేగాన్ని అంచనా వేయడంలో త‌న‌పై పూర్తిగా నమ్మకం పెట్టుకోవ‌ద్ద‌ని అన్నారు. ఈ విషయాన్ని యువతే అత్యుత్తమంగా అర్థం చేసుకుంటార‌ని, వారు భ‌విష్య‌త్తులో నిర్మించ‌బోయే ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉండబోతోంద‌ని అన్నారు. అందువల్ల యువ‌త త‌మ సొంత అంచనాలను వేగంగా అభివృద్ధి చేసుకుని వాటిపై నమ్మకం ఉంచాల‌ని స‌ల‌హా ఇచ్చారు. సంప్రదాయ కెరీర్ సలహాలు భవిష్యత్తులో అంతగా పని చేయకపోవచ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

భార‌త్‌లో ఒక ప్ర‌త్యేక శ‌క్తి ఉంది..

ఏఐ ఆధారిత యుగంలో పాత కెరీర్ మార్గాలు, దీర్ఘకాలంగా నమ్మిన అభిప్రాయాలు ఇక‌పై ప‌నిచేయ‌క‌పోవచ్చని ఆయన అన్నారు. మార్పులను స్వీకరించే ధోరణి, సొంత నిర్ణ‌యంపై విశ్వాసం పెంపొందించుకోవాలని యువ‌త‌కు ఆయన సూచించారు. భారతీయ డెవలపర్లు, పారిశ్రామికవేత్తల ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ ఓపెన్‌ఏఐకి భారత్ కీలక మార్కెట్‌గా మారిందన్నారు. భారత్‌లో ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌పై పనిచేస్తున్న డెవ‌ల‌ప‌ర్ల‌ ఉత్సాహం చూడడం అద్భుతంగా ఉంద‌ని, ఐఐటీ ఢిల్లీలో మాట్లాడే అవకాశం లభించడం ప్రత్యేకమ‌ని అన్నారు. భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఇక్కడ జరుగుతున్న మార్పులను గమనిస్తున్నార‌ని, భార‌త్‌ ఇప్పటికే త‌మ‌ రెండవ అతిపెద్ద మార్కెట్ గా ఉంద‌ని, అలాగే వేగంగా విస్త‌రిస్తున్నామ‌ని తెలిపారు. భారత్‌లో ఒక ప్రత్యేక శక్తి ఉంద‌ని, మ‌రింత అధునాత‌న సాంకేతిక‌త‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు తాము ఇంకా ఎంతో కృషి చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

కాగా శామ్ ఆల్ట్‌మ‌న్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే నేటి త‌రం యువ‌త ఇత‌రులు, పెద్ద‌ల స‌ల‌హాల‌పై ఆధార ప‌డ‌కుండా సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుని వాటిపై న‌మ్మ‌కం ఉంచాల‌ని చెప్పిన‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. భ‌విష్య‌త్తు అంతా యువ‌త చేతుల్లోనే ఉంది క‌నుక వారు ధైర్య‌వంతంగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆయ‌న గుర్తు చేశారు. అధునాత‌న సాంకేతిక‌త‌కు సిద్ధం అయ్యేందుకు యువ‌త నైపుణ్యాల‌ను మెరుగు ప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం ఉందని కూడా ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బట్టి అర్థ‌మ‌వుతోంది.

Advertisement
Advertisement