త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sukumar Wife | నేను ప‌క్కా తెలంగాణ అమ్మాయినే – డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య కామెంట్స్‌

తాను ప‌క్కా తెలంగాణ అమ్మాయినేని డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య త‌బిత అన్నారు. ఇడుపుకాయితం క‌థ విన్న‌ప్పుడు నా బాల్య జీవితం మొత్తం క‌ళ్ల‌ముందు క‌ద‌లాడింద‌ని చెప్పారు. బ‌న్నీవాస్‌తో క‌లిసి సుకుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ గురువారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది.

N

Entertainment | Published On Jun 25, 2026, 3.19 pm IST

Sukumar Wife | నేను ప‌క్కా తెలంగాణ అమ్మాయినే – డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య కామెంట్స్‌
Advertisement

Sukumar Wife |ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఇడుపు కాయితం మూవీ గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. వంశీరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను బ‌న్నీవాస్‌తో క‌లిసి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన లోకేష్ క‌న‌గ‌రాజ్ టైటిల్‌ను రివీల్ చేశారు. లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో పాటు సుకుమార్‌, అల్లు అర‌వింద్‌, దిల్ రాజుతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఇడుపుకాయితం ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

నాది తెలంగాణ‌నే...

ఈ వేడుక‌కు డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య త‌బిత కూడా అటెండ్ అయ్యారు. తాను తెలంగాణ అమ్మాయినే కావ‌డంతో ఈ క‌థ‌కు క‌నెక్ట్ అయ్యాన‌ని త‌బిత అన్నారు . "నేను ప‌క్కా తెలంగాణ అమ్మాయినే. హైద‌రాబాద్‌లోనే పుట్టి పెరిగా. ఇడుపు కాయితం క‌థ‌ వంశీ చెబుతున్న‌ప్పుడు నా చిన్న‌ప్పుడు చూసిన‌, విన్న ఎన్నో సంఘ‌ట‌న‌లు గుర్తొచ్చాయి.నా బాల్య జీవితంలోకి వెళ్లిపోయిన అనుభూతి క‌లిగింది. ఈ క‌థ‌కు సుకుమార్ క‌నెక్ట్ అయ్యాడో లేదో తెలియ‌దు. కానీ నాకైతే బాగా న‌చ్చింది. మ‌న‌ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా చేద్దామ‌ని సుకుమార్‌తో చెప్పా. మ‌నం చేస్తున్నాం అంతే ఖ‌రాఖండీగా చెప్పేశా" అని త‌బిత సుకుమార్ పేర్కొన్నారు.

ఇర‌వై ఐదో పుట్టిన‌రోజు...

"ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాలి సినిమా చేయాల‌నే క‌ల ఈ సినిమాతో తీర‌బోతుంది. నా యూట్యూబ్ సాంగ్స్‌ను చూస్తాన‌ని సుకుమార్‌, బ‌న్నీవాస్ అన్నారు. వారు చెప్పిన మాట విన‌గానే హ్యాపీగా ఫీల‌య్యా. ఇటీవ‌లే నా 25వ బ‌ర్త్‌డేను.. ఈ టీమ్ మ‌ధ్య జ‌రుపుకోవ‌డం ఆనందంగా అనిపించింది".. అని నాగ‌దుర్గ అన్న‌ది. తెలుగు అమ్మాయి అని నాగ‌దుర్గ‌కు హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తే ప‌దిహేను రూల్స్ పెట్టింద‌ని బ‌న్నీవాస్ అన్నారు.

తీన్మార్ ఫేమ్‌

ఇడుపు కాయితం మూవీతో తీన్మార్ ఫేమ్ శివ‌జ్యోతి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఈ సినిమాలో జోర్దార్ సుజాత‌, బిత్తిరి స‌త్తి, ర‌చ్చ ర‌వి, చంద్ర‌వ్వ‌, మౌనిక రెడ్డి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement