2026 Bajaj Pulsar 125 | పల్సర్ 125 సరికొత్త మోడల్ ఆవిష్కరణ.. ధర ఎంతంటే..?
2026 Bajaj Pulsar 125 | బజాజ్ ఆటో భారత మార్కెట్లో 2026 మోడల్ టూవీలర్లను వరుసగా విడుదల చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా పల్సర్ 125 కొత్త వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ బైక్ ఎక్స్-షోరూం ప్రారంభ ధరను రూ. 89,910గా నిర్ణయించారు.
Automobiles | Published On Jan 21, 2026, 1.21 pm IST
2026 Bajaj Pulsar 125 | బజాజ్ ఆటో భారత మార్కెట్లో 2026 మోడల్ టూవీలర్లను వరుసగా విడుదల చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా పల్సర్ 125 కొత్త వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ బైక్ ఎక్స్-షోరూం ప్రారంభ ధరను రూ. 89,910గా నిర్ణయించారు. కొత్త అవతార్‌లో పల్సర్ 125కి ఆకర్షణీయమైన రంగులు, కొత్త గ్రాఫిక్స్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఇవ్వడం ద్వారా వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ అప్డేటెడ్ పల్సర్ 125 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కార్బన్ సింగిల్ సీట్ వేరియంట్ ధర రూ. 89,910 కాగా, కార్బన్ స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ. 92,046గా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు వేరియంట్లు గత మోడళ్లతో పోలిస్తే రూ. 2,400 తక్కువ ధరకు లభిస్తున్నాయి.
ఈ కొత్త మోడల్లో ప్రధాన మార్పుగా ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లను చేర్చారు. ఇవి మెరుగైన వెలుతురు అందించడమే కాకుండా, బైక్‌కు మరింత ప్రీమియం లుక్‌ను ఇచ్చాయి. ఇదే డిజైన్‌ను గత నెలలో విడుదలైన కొత్త పల్సర్ 150లో కూడా ఉపయోగించారు. అంతేకాకుండా, కొత్త కలర్ ఆప్షన్లు, తాజా గ్రాఫిక్స్ ద్వారా పల్సర్ 125 రూపాన్ని మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. అయితే ఈ మార్పులు పల్సర్ 125 నియాన్ బేస్ వేరియంట్‌కు వర్తించవు. మెకానికల్ పరంగా చూస్తే, బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లు కొనసాగుతున్నాయి.
17 అంగుళాల అలాయ్ వీల్స్‌తో పాటు, ముందు భాగంలో 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అమర్చారు. అదేవిధంగా, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్న పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కొనసాగించారు. ఇంజిన్ విషయానికి వస్తే, 2026 పల్సర్ 125లో 124.4 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 8,500 ఆర్పీఎమ్ వద్ద 11.8 హెచ్‌పీ పవర్‌ను, 6,500 ఆర్పీఎమ్ వద్ద 10.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం
సెప్టెంబర్ 29, 2026

Cruise Control Feature | కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. ఇప్పుడు టూవీలర్లలోనూ.. టాప్ 5 మోడల్స్ ఇవే..
మే 4, 2026

Old Chetaks | పాతకాలం నాటి చేతక్ స్కూటర్.. ఎలక్ట్రిక్ వెర్షన్లో.. 80 కిలోమీటర్ల మైలేజ్..
మే 3, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



