త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Army Truck | ఆర్మీ ట్రక్ కింద‌ప‌డి.. ఒక‌టో త‌ర‌గ‌తి విద్యార్థి దుర్మ‌ర‌ణం

హైద‌రాబాద్‌ సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జరిగింది. ఆర్మీ ట్రక్కు (Army Truck) కింద ప‌డి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్ర‌మాదంలో విద్యార్థి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.

G

Hyderabad | Published On Jan 21, 2026, 12.58 pm IST

Army Truck | ఆర్మీ ట్రక్ కింద‌ప‌డి.. ఒక‌టో త‌ర‌గ‌తి విద్యార్థి దుర్మ‌ర‌ణం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌ సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జరిగింది. ఆర్మీ ట్రక్కు (Army Truck) కింద ప‌డి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్ర‌మాదంలో విద్యార్థి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.

బుధవారం ఉదయం ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతున్న నైజ‌న్ (7) అనే విద్యార్థిని స్కూటీపై అత‌ని త‌ల్లి పాఠ‌శాల‌కు తీసుకెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ గేట్ నంబ‌ర్ 2 వ‌ద్ద స్కూటీ స్కిడ్ అవ‌డంతో త‌ల్లీ కొడుకులు కింద ప‌డిపోయారు. దీంతో వెనుక‌నే వ‌స్తున్న ఆర్మీ ట్ర‌క్కు ముందు టైరు విద్యార్థి మీద ఎక్కేయ‌డంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. త‌ల్లి తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో ఆమెను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు న‌మోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement