Samsung Galaxy Z Fold 6 | శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6 పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.63వేలు డిస్కౌంట్..
Samsung Galaxy Z Fold 6 | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్ ఇప్పటికే పలు రకాల ఫోల్డబుల్ ఫోన్లను రిలీజ్ చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. వాటిల్లె గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6 కూడా ఒకటి. ఈ ఫోన్ లాంచ్ అయి 2 ఏళ్లు పూర్తవుతోంది. కానీ దీన్ని ఇప్పటికీ చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లలో ఈ ఫోన్ ఎంతో ప్రాముఖ్యతను పొందింది.
Technology | Published On Jan 16, 2026, 7.41 am IST
Samsung Galaxy Z Fold 6 | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్ ఇప్పటికే పలు రకాల ఫోల్డబుల్ ఫోన్లను రిలీజ్ చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. వాటిల్లె గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6 కూడా ఒకటి. ఈ ఫోన్ లాంచ్ అయి 2 ఏళ్లు పూర్తవుతోంది. కానీ దీన్ని ఇప్పటికీ చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లలో ఈ ఫోన్ ఎంతో ప్రాముఖ్యతను పొందింది. వినియోగదారులు అధిక సంఖ్యలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఉండగా, అత్యాధునిక గెలాక్సీ ఏఐ ఫీచర్లను కూడా పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫోన్ ధరను ప్రస్తుతం భారీగా తగ్గించారు.
ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త అనే చెప్పవచ్చు. ఎందుకంటే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌కు ముందే భారీ ధర తగ్గింపుతో ఈ డివైస్ ను అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో ఫోల్డబుల్ ఫోన్‌ను కొనాలని చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశంగా చెబుతున్నారు. ఇక శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6 ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1,64,999 ఉండగా, ఇప్పుడది భారీగా తగ్గి రూ.1,09,999కే లభిస్తోంది. దీనిపై దాదాపుగా రూ.63వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు.
ఈ ఫోన్‌పై అమెజాన్ ప్రత్యేకంగా రూ.5వేల కూపన్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే అదనంగా రూ.3,299 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కనుక ఈ ఫోన్‌ను చాలా తగ్గింపు ధరకు పొందవచ్చు. ఇక ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ ఫోన్‌లో మెయిన్ డిస్‌ప్లే 7.6 ఇంచులు ఉండగా, కవర్ డిస్‌ప్లే 6.3 ఇంచుల సైజ్‌తో ఉంది. రెండు డిస్‌ప్లేలు అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. కానీ దీనికి 7 ఓఎస్ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. 12జీబీ ర్యామ్ ఆప్షన్‌తోనే 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వేరియెంట్లను కూడా ఇందులో అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



