Tollywood Heroine | టాలీవుడ్ హీరోయిన్‌కు కన్యాదానం చేసిన విజయ్ మాల్యా – ఎవరా నాయిక?
టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి పెళ్లిలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కన్యాదానం చేశారు. అంతే కాకుండా ఈ హీరోయిన్ పెళ్లికి పెద్దగా వ్యవహరించి గ్రాండ్‌గా జరిపించారట. ఆ హీరోయిన్ ఎవరంటే?
Entertainment | Published On Jan 17, 2026, 2.14 pm IST
Tollywood Heroine | టాలీవుడ్‌లో హీరోయిన్ పెళ్లిలో విజయ్ మాల్యా కన్యాదానం చేశాడట. హీరోయిన్ పెళ్లికి పెద్దగా నిలిచి అన్ని పనులు చక్కబెట్టారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు. సమీరా రెడ్డి. తెలుగులో ఎన్టీఆర్‌తో అశోక్, నరసింహుడు, చిరంజీవి జై చిరంజీవతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌లో చాలానే సినిమాలు చేసింది. సమీరా రెడ్డికి విజయ్ మాల్యా దగ్గరి బంధువు అవుతారట. తన పెళ్లిని విజయ్ మాల్యానే దగ్గరుండి జరిపించినట్లు చెప్పింది.
2014లో పెళ్లి...
బిజినెస్‌మెన్ అక్షయ్ వర్దేతో 2014లో ఏడడుగులు వేసింది సమీరారెడ్డి. మహారాష్ట్ర సంప్రదాయ పద్దతిలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధవుల సమక్షంలో సింపుల్‌గా సమీరా రెడ్డి వివాహ వేడుక జరిగిందట.
సమీరా రెడ్డి కి తండ్రి లేకపోవడంతో విజయ్ మాల్యానే కన్యాదానం చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సమీరా రెడ్డినే తెలిపింది.
అమ్మ తరఫు బంధువుల నుండి విజయ్ మాల్యా ఒక్కరే మా పెళ్లి అటెండ్ అయ్యారు. దాంతో ఆయనే కన్యాదానం చేశారు. ఆ క్షణంలో చాలా ఎమోషనల్ అయ్యాను అంటూ సమీరా రెడ్డి పేర్కొన్నది. అక్షయ్‌తో నా పెళ్లి జరిగిన విషయం కుటుంబసభ్యులు, కొద్ది మంది బంధువులకు తప్ప ఎవరికి తెలియదు. ఆ తర్వాత చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోయారు అని సమీరా రెడ్డి అన్నది.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ...
2002లో రిలీజైన మైనే దిల్ తుఝ్‌కో దియా మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో నో ఎంట్రీ, నక్షా, దే దనా దన్‌తో పాటు ఇరవైకిపైగా సినిమాలు చేసింది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో మెరిసింది. కొన్ని విజయాలు దక్కినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు రాలేదు. కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. 2103లో వచ్చిన కన్నడ మూవీ వరదనాయక తర్వాత సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో మాత్రం సమీరా రెడ్డి యాక్టింగ్‌గా కనిపిస్తుంటుంది. బాలీవుడ్‌లో హీరోయిన్లు ఎదుర్కొనే వివక్ష, బాడీ షేమింగ్‌పై చాలా సార్లు సమీరా రెడ్డి చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
- ●Stock Markets | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్రత.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●ACB Raids | ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి
- ●Prof. CNR Rao | పేరులో ఎక్స్ట్రా 'F'.. భారతరత్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు
- ●Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి
- ●Bandi Sanjay | ఆ ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ..
- ●Veerapalli Shankar | కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Stock Markets | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్రత.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ACB Raids | ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి

Prof. CNR Rao | పేరులో ఎక్స్ట్రా 'F'.. భారతరత్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు

Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి






