motorola razr fold | మోటోరోలా రేజర్ ఫోల్డ్ భారత్‌లో లాంచ్.. ఫిఫా వరల్డ్ కప్ 26 ఎడిషన్ స్పెషల్ హైలైట్..
motorola razr fold | మోటోరోలా భారత్‌లో తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోల్డ్ ను అధికారికంగా లాంచ్ చేసింది. గతంలో ప్రకటించినట్టుగానే కంపెనీ ఈ ప్రీమియం ఫోల్డబుల్ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనితోపాటు ప్రత్యేకమైన ఫిఫా వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్ ను కూడా విడుదల చేసింది.
Technology | Published On May 13, 2026, 3.52 pm IST
motorola razr fold | మోటోరోలా భారత్‌లో తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోల్డ్ ను అధికారికంగా లాంచ్ చేసింది. గతంలో ప్రకటించినట్టుగానే కంపెనీ ఈ ప్రీమియం ఫోల్డబుల్ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనితోపాటు ప్రత్యేకమైన ఫిఫా వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్ ను కూడా విడుదల చేసింది. అత్యంత సన్నని డిజైన్, భారీ డిస్‌ప్లేలు, అడ్వాన్స్‌డ్ కెమెరా సెటప్, ఫ్లాగ్‌షిప్ పనితీరు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది. రేజర్ ఫోల్డ్ డిజైన్ విషయంలో మోటరోలా ప్రత్యేక దృష్టి పెట్టింది. స్లిమ్ ప్రొఫైల్‌తోపాటు డ్యూరబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చింది. ఫోల్డింగ్ మెకానిజంలో ప్రెసిషన్ ఇంజినీర్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ టియర్‌డ్రాప్ హింజ్, టైటానియం ఇన్నర్ స్క్రీన్ ప్లేట్‌ను ఉపయోగించారు. దీని వల్ల స్క్రీన్ క్రీజ్ తగ్గడంతోపాటు ప్రెజర్ సమానంగా పంపిణీ అవుతుందని కంపెనీ తెలిపింది.
అద్భుతమైన డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 ప్రొటెక్షన్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని మోటరోలా ప్రకటించింది. గత జనరేషన్‌తో పోలిస్తే డ్రాప్ పెర్ఫార్మెన్స్ 75 శాతం మెరుగైందని పేర్కొంది. ఫోన్‌లో 8.1 ఇంచుల 2కే ఎల్టీపీవో పీ-ఓలెడ్ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. 2484 * 2232 పిక్సెల్స్ రిజల్యూషన్, 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్, గరిష్టంగా 6200 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. బయటి వైపు 6.56 ఇంచుల ఎల్టీపీవో పీ-ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మందం కేవలం 4.55ఎంఎం మాత్రమే ఉండగా, మూసినప్పుడు 9.89ఎంఎంగా ఉంటుంది. ల్యాప్‌టాప్ మోడ్, టెంట్ మోడ్ వంటి ఫ్లెక్సిబుల్ యూసేజ్ మోడ్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. మల్టీటాస్కింగ్, మీడియా వ్యూయింగ్, హ్యాండ్స్ ఫ్రీ వీడియో క్యాప్చర్ వంటి అవసరాలకు ఇవి ఉపయోగపడతాయి.
ప్రత్యేక ఆకర్షణగా ఫిఫా ఎడిషన్..
ఫిఫా వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్ ఈ లాంచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టోర్నమెంట్ ప్రేరణతో రూపొందించిన డిజైన్ ఇందులో కనిపిస్తుంది. బ్యాక్ కవర్‌పై టెక్స్చర్డ్ రైజ్డ్ డాట్ ప్యాటర్న్ ఇచ్చారు. దీన్ని ఫుట్‌బాల్ మెటీరియల్ ఫీల్‌ను అందించేలా రూపొందించారు. 26 టైపోగ్రఫీతోపాటు అధికారిక ఫిఫా వరల్డ్ కప్ 26 లోగోను 24కే గోల్డ్ ప్లేటింగ్‌తో అందించారు. ఫుట్‌బాల్ అభిమానుల కోసం కలెక్టిబుల్ డివైస్‌లా ఈ ఎడిషన్‌ను మోటరోలా డిజైన్ చేసింది. కెమెరా విభాగంలో కూడా రేజర్ ఫోల్డ్ ఫ్లాగ్‌షిప్ స్థాయి స్పెసిఫికేషన్లు అందిస్తోంది. ఈ ఫోన్‌కు ఉత్తర అమెరికాలో ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో హై డీఎక్స్‌ఓమార్క్ రేటింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధానంగా 50మెగాపిక్సెల్ సోనీ లైటియా 828 సెన్సార్‌ను ఉపయోగించారు. ఇది 8కే వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్, పాంటోన్ వాలిడేటెడ్ కలర్ అక్యురసీని సపోర్ట్ చేస్తుంది.

అదిరిపోయే కెమెరాలు..
50మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలో సోనీ లైటియా 600 సెన్సార్‌ను ఉపయోగించారు. ఇది 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్, ఏఐ ఆధారిత 100ఎక్స్ సూపర్ జూమ్ ప్రో ఫీచర్లను అందిస్తుంది. మరో 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలో 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంది. 3.5సెం.మీ దూరం వరకు మాక్రో విజన్ ఫోటోగ్రఫీ చేయవచ్చు. ఫ్రంట్‌లో 32మెగాపిక్సెల్ ఇంటర్నల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4కే వీడియో రికార్డింగ్, క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. బయటి వైపు 20మెగాపిక్సెల్ ఎక్స్‌టర్నల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 3ఎన్‌ఎం మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. అడ్రెనో 829 జీపీయూ, 12జీబీ లేదా 16జీబీ ర్యామ్, 256జీబీ లేదా 512జీబీ యూఎఫ్‌ఎస్ 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. హెవీ మల్టీటాస్కింగ్, గేమింగ్ సమయంలో పనితీరు నిలకడగా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.
భారీ బ్యాటరీ, 7 ఏళ్ల వరకు అప్ డేట్స్..
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. 7 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని మోటరోలా ప్రకటించింది. మోటో ఏఐ టూల్స్ ద్వారా నోటిఫికేషన్ సమ్మరీ, రియల్ టైమ్ కన్వర్సేషన్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అలాగే మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమిని, పర్‌ప్లెక్సిటీ ఏఐ వంటి థర్డ్ పార్టీ ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు కూడా యాక్సెస్ ఉంటుంది. 6000ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఫోన్‌లో అందించారు. 80 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అదనంగా 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5జీ, వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, నావిక్, జీపీఎస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఐపీ46, ఐపీ48, ఐపీ49 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
ధర వివరాలు..
ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.1,49,999గా నిర్ణయించారు. 16జీబీ + 512జీబీ మోడల్ ధర రూ.1,59,999 గా ఉంది. ఇక ఫిఫా వరల్డ్ కప్ 26 ఎడిషన్ 16జీబీ + 512జీబీ వేరియంట్ ధర రూ.1,69,999గా ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ తోపాటు రిలయన్స్ డిజిటల్ వంటి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మే 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ అందిస్తున్నారు. ప్రారంభ నెలలో అంటే జూన్ 20 వరకు కొనుగోలు చేసే వారికి రూ.57వేల విలువైన ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయం కూడా ఇవ్వనున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



