Grok Build | కోడింగ్ ఏజెంట్‌గా సేవలు అందించనున్న గ్రోక్ ఏఐ.. గ్రోక్ బిల్డ్ వచ్చేసింది..
Grok Build | ప్రముఖ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ దిగ్గజ ప్లాట్‌ఫామ్ ఎక్స్ఏఐ (xAI) తాజాగా గ్రోక్ బిల్డ్ పేరిట ఓ కొత్త కోడింగ్ ఏజెంట్, కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్ (CLI) టూల్‌ని ఎర్లీ బీటా రూపంలో ప్రవేశపెట్టింది. దీన్ని ముఖ్యంగా ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, క్లిష్టమైన కోడింగ్ వర్క్‌ఫ్లోల కోసం రూపొందించారు.
Technology | Published On May 15, 2026, 2.44 pm IST
Grok Build | ప్రముఖ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ దిగ్గజ ప్లాట్‌ఫామ్ ఎక్స్ఏఐ (xAI) తాజాగా గ్రోక్ బిల్డ్ పేరిట ఓ కొత్త కోడింగ్ ఏజెంట్, కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్ (CLI) టూల్‌ని ఎర్లీ బీటా రూపంలో ప్రవేశపెట్టింది. దీన్ని ముఖ్యంగా ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, క్లిష్టమైన కోడింగ్ వర్క్‌ఫ్లోల కోసం రూపొందించారు. ఎక్స్‌ఏఐ తెలిపిన వివరాల ప్రకారం గ్రోక్ బిల్డ్ ఒక ఎక్స్‌టెన్సిబుల్ కోడింగ్ ఏజెంట్. దీన్ని ఇంటరాక్టివ్ టెర్మినల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఉపయోగించవచ్చు. అలాగే స్క్రిప్ట్స్, బాట్స్ కోసం హెడ్‌లెస్ మోడ్‌లో కూడా రన్ చేయవచ్చు. థర్డ్ పార్టీ అప్లికేషన్లలో ఏజెంట్ క్లయింట్ ప్రోటోకాల్ (ACP) ద్వారా కూడా ఇది పనిచేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మౌస్‌తో పనిచేసే ఫుల్‌స్క్రీన్ టెర్మినల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (TUI) ఉంటుంది. ఇది డెవలపర్లు తమ కోడ్ రిపోజిటరీలలోనే ఏఐ ఏజెంట్లతో నేరుగా పని చేసేలా అవకాశం కల్పిస్తుంది.
ప్రధాన ఫీచర్లు..
మౌస్ సపోర్ట్‌తో ఫుల్‌స్క్రీన్ ఇంటరాక్టివ్ టీయూఐ, క్లిష్టమైన టాస్క్‌ల కోసం ప్లాన్ మోడ్, మార్పులు అమలు చేసే ముందు స్టెప్స్‌ను రివ్యూ, అప్రూవ్, కామెంట్ లేదా రీరైట్ చేసే అవకాశం, ప్లాన్ అప్రూవల్ తర్వాత క్లీన్ డిఫ్ ట్రాకింగ్, AGENTS.md, ప్లగిన్స్, హుక్స్, స్కిల్స్, MCP సర్వర్లు, ఇప్పటికే ఉన్న రిపోజిటరీ కన్వెన్షన్లకు అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్, పెద్ద టాస్క్‌ల కోసం ప్యారలల్ సబ్‌ఏజెంట్స్, వేర్వేరు వర్క్‌ట్రీల్లో సబ్‌ఏజెంట్స్‌ను లాంచ్ చేసే సపోర్ట్, స్క్రిప్ట్స్, బాట్స్, ఆటోమేషన్ వర్క్‌ఫ్లోల కోసం హెడ్‌లెస్ -p మోడ్, కస్టమ్ బాట్స్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ అప్లికేషన్ల కోసం పూర్తి ACP సపోర్ట్, CLI నుంచే బగ్స్, ఫీడ్‌బ్యాక్, రిక్వెస్ట్స్ పంపేందుకు బిల్ట్-ఇన్ /feedback కమాండ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. గ్రోక్ బిల్డ్ ప్రస్తుతం ఎర్లీ బీటా దశలో ఉంది. ఇది ప్రస్తుతం సూపర్‌గ్రోక్ హెవీ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. బీటా సమయంలో యూజర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మోడల్, ప్రొడక్ట్‌ను మరింత మెరుగుపరుస్తామని కంపెనీ తెలిపింది. యూజర్లు తమ సూపర్‌గ్రోక్ హెవీ అకౌంట్‌తో సైన్ ఇన్ అయి కమాండ్ ద్వారా గ్రోక్ బిల్డ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
- ●22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి






