త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు

Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ప్ర‌భావం ఉంటే ఎర్ర‌వ‌ల్లిలో ఉన్న కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మాత్రం లేద‌ని.. కాళేశ్వ‌రం సక్సెస్సంటే ఇదేన‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి విమ‌ర్శించారు.

S

Telangana | Published On Oct 17, 2026, 1.17 pm IST

Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు
Advertisement
  • ఎందుకంటే అది చంద్ర మండ‌లంలో ఉన్న‌ట్టే క‌ట్టిండు కేసీఆర్‌
  • ఫామ్‌హౌస్ నీళ్ల కోస‌మే కాళేశ్వ‌రం క‌ట్టిన‌ట్టుండు
  • మేం దోచుకోడానికి ఏం లేదు
  • చినిగిన ఇస్తారాకు లెక్క చేసిన రాష్ట్రాన్ని కుట్టే ప‌రిస్థితుల్లోనే ఉన్నం
  • కేసీఆర్ కుటుంబంపై ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ విమ‌ర్శ‌లు

Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: భూమంతా ఎల్‌నినో ప్ర‌భావం ఉంటే ఎర్ర‌వ‌ల్లిలో ఉన్న కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మాత్రం లేద‌ని.. కాళేశ్వ‌రం సక్సెస్సంటే ఇదేన‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి విమ‌ర్శించారు. చంద్ర మండ‌లంలో ఉన్న‌ట్టే ఫామ్‌హౌస్‌ను క‌ట్టుకున్నాడ‌ని ఎద్దేవా చేశారు. అప్పుల రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి సీఎం అయ్యార‌ని.. చినిగిన ఇస్తారాకు లెక్క ఉన్న రాష్ట్రాన్ని కుట్టే ప‌రిస్థితుల్లోనే ఉన్నామ‌న్నారు. శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావుపై విమ‌ర్శ‌లు చేశారు.

ఈరోజుకు ఆయ‌న కాళేశ్వ‌రం క‌ట్టినా అనే అనుకుంటుండు. ఫామ్‌హౌస్‌ల నుంచి చూస్తే అట్ల‌నే క‌న‌వ‌డ్త‌ది. ఆయ‌న ఫామ్‌హౌస్ కోటీ ర‌త‌నాల వీణ‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నీళ్లు ఇయ్యాళ‌నుకుండా.. లేదంటే ఫామ్ హౌస్‌కు ఇయ్యాళ‌నుకుండో తెల్వ‌దు మ‌రి. భూమ్మీద మొత్తం ఎల్‌నినో ఉంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మాత్రం ఆ ప్ర‌భావం రాదు. ఎందుకంటే ఆయ‌న చంద్ర‌మండ‌లంలో ఉన్న‌ట్టే క‌ట్టుకుండు.

ప్ర‌భుత్వాన్ని నింద‌ల పాలు చేయ‌డమే కేటీఆర్, హ‌రీశ్‌రావు ప‌ని. వాళ్ల ముచ్చ‌ట‌కు వ‌చ్చే స‌రికి ఏదో ఓటి చెప్పుకొస్త‌రు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ప‌క్క‌న్నే 58 ఎక‌రాల చెరువు తొవ్విండు. కొండ‌పోచ‌మ్మ నుంచి పైపులు వెట్టి ఈ చెరువును నింపే ప్ర‌య‌త్నం చేస్త‌రు. 2016లో ఆ చెరువు లేదు.. ఆ త‌ర్వాత ఆ చెరువు పుట్టుకొచ్చింది. ఈ చెరువుల ఎప్ప‌టికీ నీళ్లు ఉంట‌య్‌. కాళేశ్వ‌రం ప్రాజెక్టు స‌క్సెస్సే ఇది. గోదావ‌రి నీళ్లు ఎక్క‌డొచ్చిన‌య‌నేది తెల్వ‌దు.. కానీ జ‌గ‌దేవ్‌పూర్ కెనాల్ నుంచి నీళ్లు ఈ చెరువుల‌కు వ‌స్త‌య్‌. కొండపోచ‌మ్మ క‌ట్టింది ఆలేరు వ‌ర‌కు నీళ్లు ఇవ్వ‌డానికి.

అది ఎర్ర‌వ‌ల్లి లిఫ్ట్‌

ఇది కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ కాదు.. ఎర్ర‌వ‌ల్లి లిఫ్ట్. మోట‌ర్లు పెట్టి ఎర్ర‌వ‌ల్లిలో ఉన్న మూడెక‌రాల్లో ఉన్న బాయిల‌కు నీళ్లు త‌ర‌లిస్త‌రు. 2016లో జీవో 49 ద్వారా డ్రిప్ ఇరిగేష‌న్ పెట్టుకోవ‌డానికి 42.54 కోట్లు 100 శాతం స‌బ్సిడీ పెట్టుకుండు. నెటాఫిమ్‌ కంపెనీ అనేది ఉచితంగా చేస్త‌ద‌ని ఫ‌స్ట్ చెప్పిర్రు. తర్వాత బిల్లులు తీసుకుర్రు. ఇది ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్ క‌హాని.

నీళ్లువాయే.. నిధులు వాయే.. నియామ‌కాలు ఎవ‌ల‌కొచ్చిన‌య్‌? కేటీఆర్‌, క‌విత‌, హ‌రీశ్‌, సంతోష్‌రావుకు ప‌ద‌వులు వ‌చ్చిన‌య్‌. చినిగిన ఇస్తారాకు లెక్క చేసిన రాష్ట్రాన్ని కుట్టే ప‌రిస్థితుల్లోనే ఉన్నం. మేం దొచుకోవ‌డానికి ఏం లేదు. అప్పుల రాష్ట్రం చేశారు. ఎల్‌నినోతోని ఇబ్బంది ప‌డ‌కుండా ఉండాల‌ని ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. సింగ‌రేణిలో గ‌నుల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌న్న పిచ్చి ఆలోచ‌న ఎవ‌రికొచ్చింది? 3 ఏండ్ల‌ల్ల క‌ట్టాల్సిన థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ ప్రాజెక్టును 10 ఏండ్ల‌ళ్ల ఎందుకు క‌ట్టలేక‌పోయారు. డిస్కంలవి 35 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు క‌ట్టి ఉంటే బాగుండేది.

మేమొచ్చిందే జీతాలు ఇయ్య‌లేని ప‌రిస్థితుల్ల‌. మేం మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలే రేవంత్‌రెడ్డి గారు. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌కు 8 వేల కోట్లు వ‌డ్డీలు క‌ట్టుకుంటూ వ‌స్తున్నం. ఇచ్చిన హామీలు నెర‌వేర్చే ప‌రిస్థితుల్లో ఉన్నం. తెలంగాణ తెచ్చుకున్న‌ది ఈ కుటుంబం కోసం. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలే. జ‌రిగిన అన్యాయాల‌న్నీ కూడా వాళ్ల హ‌యాంల జ‌రిగిన‌వే. ఇప్పుడు ఒక‌డు నార్త్ పోతే.. ఇంకోడు సౌత్ పోత‌డు. ప్ర‌జ‌ల‌కు ఏదేదో చెప్తా ఉంట‌రు. ఈరోజు నుంచి వాళ్లు ఎక్క‌డ‌పోయినా తెల్లారే చెప్తం.. వాళ్లు ఏం చేసిర్రో ఆ జాగ‌ల అని చామ‌ల పేర్కొన్నారు.

Advertisement
Advertisement