Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Supreme Court | ఇంటర్నెట్ను యాక్సెస్ (Internet Access) చేయడం, ఉపయోగించడం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు (fundamental right) అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. భద్రత పేరుతో పిల్లల్ని ఇంటర్నెట్కు దూరం చేయలేమని తేల్చి చెప్పింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఇంటర్నెట్ను యాక్సెస్ (Internet Access) చేయడం, ఉపయోగించడం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు (fundamental right) అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ హక్కులు వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలకు కూడా సమానంగా వర్తిస్తాయని తెలిపింది. భద్రత పేరుతో (Child Safety) వారిని పూర్తిగా ఇంటర్నెట్కు దూరం చేయలేమని తేల్చిచెప్పింది. చిన్నారులకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలని అభిప్రాయపడింది. అయితే, వారికి ఎలాంటి హాని కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని పేర్కొంది. ఇందుకోసం పిల్లల ఖాతాల కోసం ప్రత్యేకంగా 'చైల్డ్ మోడ్'ను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది.
భద్రత ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం
సోషల్ మీడియా వేదికలు, ఇతర ఆన్లైన్ సేవల్లో పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసే క్రమంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంటర్నెట్ నిషేధించడం అంటే వారికి వాక్ స్వాంతంత్య్రం లేదని చెప్పడమేనని అభిప్రాయపడింది. "మన పిల్లల రక్షణ, స్వేచ్ఛ.. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడకూడదు. భద్రత ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. ఆ రెండింటినీ పొందేందుకు వారు అర్హులు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించేందుకు తిరస్కరించింది.
వారికి ఇంటర్నెటే ప్రధాన మార్గం
ఇంటర్నెట్లో భావప్రకటనా స్వేచ్ఛతో పాటు సమాచారాన్ని తెలుసుకునే, పొందే, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఇమిడి ఉందని వివరించింది. ఇంటర్నెట్ అనేది ఆలోచనలు, సృజనాత్మకత, సమాచార మార్పిడికి వేదిక అని పేర్కొంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు విద్య, సమాచారాన్ని పొందేందుకు ఇంటర్నెట్ ఒక్కటే ప్రధాన మార్గంగా ఉంటోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఇతరులతో పరిచయాలు పెంచుకోవడానికి, తమలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో అనుసంధానం కావడానికి కూడా ఆన్లైన్ వేదికలు ఉపయోగపడతాయని వివరించింది.
నిషేధం సరైన చర్య కాదు..
ప్రస్తుతం ఇంటర్నెట్ పిల్లలకు పూర్తిగా సురక్షితం కాదని అంగీకరించిన కోర్టు.. ఆ కారణంతో వారిని పూర్తిగా దూరం పెట్టడం పరిష్కారం కాదని స్పష్టం చేసింది. మధ్యవర్తి సంస్థలు (Intermediaries) హానికరమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించడంలో విఫలమైనంత మాత్రాన పిల్లలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచలేమని స్పష్టం చేసింది. బాధ్యతను సరిగ్గా నిర్వర్తించని వారి తప్పును, బాధితులపై రుద్దినట్లు అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలు ఇంటర్నెట్ వాడకూడదని నిబంధనలు విధించినంత మాత్రాన వారు దాని వినియోగాన్ని ఆపరని పేర్కొంది. బదులుగా వారు ప్రమాదకరమైన నియంత్రణ లేని వెబ్సైట్లు, వేదికలకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా, ఆన్లైన్లో బెదిరింపులకు, వేధింపులకు గురవుతున్న పిల్లలు.. ఇంటర్నెట్ వాడినందుకు పెద్దలు తమను మందలిస్తారన్న భయంతో తమ సమస్యలను తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు చెప్పుకోవడానికి ముందుకు రారని పేర్కొంది.
ఈ చర్యలు అవసరం..
అందుకే పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించడం తగిన చర్య కాదని అభిప్రాయపడింది. అందుకు బదులు వారి ఖాతాలకు తల్లిదండ్రుల అనుమతి, పర్యవేక్షణ, మార్గదర్శకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. పిల్లల ఖాతాల కోసం ప్రత్యేకంగా 'చైల్డ్ మోడ్'ను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. పిల్లల ఖాతాలు డీఫాల్డ్గా ప్రైవేట్‌గా ఉంచడం, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, పరిచయాలను పరిమితం చేయడం, పిల్లలకు కనిపించే ప్రకటనలు, కంటెంట్‌పై నియంత్రణ విధించడం వంటి భద్రతా చర్యలు అవసరమని వివరించింది. ఈ భద్రతా చర్యల అమలుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికే వదిలేసింది.
Also Read..
మేమే అక్కడ ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | మేమే అక్కడ ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు
అక్టోబర్ 17, 2026

Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే
అక్టోబర్ 16, 2026

Supreme Court | సోషల్ మీడియా ముప్పు నుంచి పిల్లలకు రక్షణ కోరుతూ పిల్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Zero Sugar Diversion Ethanol | ఇథనాల్ తయారీలో చక్కెరపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం!
- ●E2E Networks | ఏడాదిలో 250 శాతం లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల పంట ఇచ్చిన షేర్..
- ●Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..
- ●blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి
- ●Palapitta | దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ
- ●Must Visit Temples in India | జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 దేవాలయాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే!

Zero Sugar Diversion Ethanol | ఇథనాల్ తయారీలో చక్కెరపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం!

E2E Networks | ఏడాదిలో 250 శాతం లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల పంట ఇచ్చిన షేర్..

Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..

blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి



