Microsoft AI chief Mustafa Suleyman | 2026 చివరికల్లా లాయర్లు, అకౌంటెంట్లు ఉండరు.. మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెడుతోంది. యూఎస్‌లో పెద్ద కంపెనీలు చాలా వరకు ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి ఏఐ టెక్నాలజీని మరో దశకు తీసుకెళ్తున్నాయి.
Technology | Published On Feb 12, 2026, 9.30 pm IST
Microsoft AI chief Mustafa Suleyman | చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, పర్‌ప్లెక్సిటీ, డీప్‌సీక్, గ్రోక్..లాంటి ఏఐ టూల్స్ మాత్రమే మనకు తెలుసు. కానీ.. ప్రస్తుతం ఇలాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలు ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐని వినియోగిస్తున్నారు. ఇటీవల లాంచ్ అయిన ఆంత్రోపిక్ ఏఐ టూల్ క్లాడ్ కోవర్క్ వల్ల ఏఐ మరో స్థాయికి చేరింది. జనరేటివ్ ఏఐ స్థాయి నుంచి ఎండ్ టు ఎండ్ సర్వీసులు ఇచ్చే స్థాయికి ఏఐ ఎదిగింది. దీని వల్ల ఏఐని ఒక అసిస్టెంట్‌గానే ఇప్పటి వరకు చూసిన మనం.. ఇక మనుషుల అవసరం లేకుండానే దానంతట అదే పని చేసే పరిస్థితిని చూడబోతున్నాం. అందుకే రానున్న కాలంలో దాదాపు అన్ని రంగాల్లో గడ్డుకాలమే అని పలువురు టెక్ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఏఐ రంగంపై ఉన్న భయాన్ని మరింత చేసేలా ఉన్నాయి.
వైట్ కాలర్ జాబ్స్ మాయం
సిస్టమ్ ముందు కూర్చొని ఏసీలో హాయిగా షర్ట్ నలగకుండా పని చేసే జాబ్స్‌నే వైట్ కాలర్ జాబ్స్ అంటారు. ఆ జాబితాలోకి వచ్చే అన్ని రంగాలు వచ్చే 12 నెలల్లో మాయం కానున్నాయని మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ స్పష్టం చేశారు. కేవలం కోడింగ్ రాసే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్సే కాదు.. లాయర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర ఉద్యోగాలు ఊస్ట్ కానున్నాయి. ఎస్ఏఏఎస్(SAAS) సాఫ్ట్‌వేర్ కంపెనీల మీద ఇప్పటికే ఆంత్రోపిక్ దెబ్బ పడిన విషయం తెలిసిందే. ఆంత్రోపిక్ ఏఐ దెబ్బకు యూఎస్ నుంచి భారత్ వరకు ఐటీ స్టాక్స్ అన్నీ కుప్పకూలాయి. ఈనేపథ్యంలో ఇతర రంగాల మీద కూడా ఏఐ ప్రభావం వచ్చే 12 నెలల్లోనే చూపించనుందని ఏకంగా మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ చెప్పడం ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ రంగం, ఈ రంగం అని కాకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసే ప్రతి ఒక్కరు ఏఐ దెబ్బకు కుదేల్ కావాల్సిందేనని ముస్తఫా స్పష్టం చేశారు.
ఏఐలో భారీ పెట్టుబడులు
మరోవైపు ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెడుతోంది. యూఎస్‌లో పెద్ద కంపెనీలు చాలా వరకు ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి ఏఐ టెక్నాలజీని మరో దశకు తీసుకెళ్తున్నాయి. 2026 లో మైక్రోసాఫ్ట్ నుంచి మరిన్ని ఏఐ టూల్స్ రానున్నాయని ముస్తఫా వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Daybreak | ఆంథ్రోపిక్ కు పోటీగా ఓపెన్ఏఐ డే బ్రేక్.. సైబర్ సెక్యూరిటీని ఇచ్చే కొత్త ఏఐ మోడల్..
మే 12, 2026

Apple | యాపిల్ యూజర్లకు బంపర్ ఫీచర్.. ఇకపై డివైస్‌లలో నచ్చిన ఏఐ మోడల్‌ను ఎంచుకోవచ్చు..
మే 6, 2026

Claude Opus 4.7 | క్లాడ్ ఓపస్ 4.7ను విడుదల చేసిన ఆంథ్రోపిక్.. గత ఏఐ మోడల్స్ కన్నా మరింత వేగం, కచ్చితత్వం..
ఏప్రిల్ 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



