త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Claude Opus 4.7 | క్లాడ్ ఓప‌స్ 4.7ను విడుద‌ల చేసిన ఆంథ్రోపిక్‌.. గ‌త ఏఐ మోడ‌ల్స్ క‌న్నా మ‌రింత వేగం, క‌చ్చితత్వం..

Claude Opus 4.7 | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా తన కొత్త ఏఐ మోడల్ క్లాడ్‌ ఓపస్ 4.7ను అధికారికంగా విడుదల చేసింది. ఇది క్లాడ్ ఓపస్ 4.6కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా రూపుదిద్దుకుంది.

S

Technology | Published On Apr 19, 2026, 11.40 am IST

Claude Opus 4.7 | క్లాడ్ ఓప‌స్ 4.7ను విడుద‌ల చేసిన ఆంథ్రోపిక్‌.. గ‌త ఏఐ మోడ‌ల్స్ క‌న్నా మ‌రింత వేగం, క‌చ్చితత్వం..
Advertisement

Claude Opus 4.7 | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా తన కొత్త ఏఐ మోడల్ క్లాడ్‌ ఓపస్ 4.7ను అధికారికంగా విడుదల చేసింది. ఇది క్లాడ్ ఓపస్ 4.6కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా రూపుదిద్దుకుంది. అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, లాంగ్-రన్నింగ్ ఏఐ ఏజెంట్ టాస్క్‌లు, ఇన్‌స్ట్రక్షన్ క‌చ్చితత్వం, మల్టీమోడల్ విజన్, రియల్-వరల్డ్ నాలెడ్జ్ వర్క్‌లలో మెరుగైన పనితీరును అందించేలా ఈ మోడల్‌ను అభివృద్ధి చేశారు. క్లాడ్ ఓపస్ 4.7 ప్రత్యేకంగా క్లిష్టమైన, దీర్ఘకాలిక వర్క్‌ఫ్లోలను నిర్వహించేందుకు రూపుదిద్దుకుంది. స్థిరత్వం, క‌చ్చితత్వం, నిర్మాణాత్మక తర్కం అవసరమయ్యే పనుల్లో ఇది మెరుగైన ఫలితాలను అందిస్తుంది. అడ్వాన్స్‌డ్ కోడింగ్, మల్టీ-స్టెప్ టాస్క్‌లు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వర్క్ వంటి విభాగాల్లో దీని సామర్థ్యం మరింత పెరిగింది.

క్లిష్ట‌మైన కోడింగ్‌, విశ్లేష‌ణ ప‌నుల‌ను సైతం..

ఈ మోడల్‌లో ఇన్‌స్ట్రక్షన్ ఫాలోయింగ్ మరింత స్పష్టంగా ఉండగా, సెల్ఫ్ వెరిఫికేషన్ సామర్థ్యం పెరిగింది. మెమొరీ వినియోగం మెరుగుపడడంతోపాటు మల్టీమోడల్ ఫీచర్లు కూడా విస్తరించాయి. తక్కువ పర్యవేక్షణతోనే క్లిష్టమైన కోడింగ్, విశ్లేషణ పనులను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది. అయితే క్లాడ్ మైథోస్ ప్రివ్యూ‌తో పోలిస్తే ఇది కొంత పరిమిత సామర్థ్యంతోనే కొనసాగుతుంది. ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, అడ్వాన్స్‌డ్ కోడింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పనుల్లో గణనీయమైన పురోగతి క‌నిపించింది. దీర్ఘకాలిక, మల్టీ-స్టెప్ ఏఐ వర్క్‌ఫ్లోలను మెరుగ్గా నిర్వహిస్తుంది. ఇన్‌స్ట్రక్షన్లను మరింత క‌చ్చితంగా అనుసరించడం, తుది ఫలితాల ముందు స్వీయ పరిశీలన చేయడం వంటి లక్షణాలు మెరుగయ్యాయి. అలాగే 2,576 పిక్స‌ల్స్ వరకు ఉన్న హై-రెజల్యూషన్ చిత్రాలను విశ్లేషించగల మల్టీమోడల్ విజన్ సామర్థ్యం కూడా దీనికి ఉంది.

అత్య‌ధిక సేఫ్టీ ప్ర‌మాణాలు..

డెన్స్ స్క్రీన్‌షాట్లు, డయాగ్రామ్‌లు, విజువల్ డేటాను అర్థం చేసుకోవడంలో ఇది మరింత సమర్థంగా పనిచేస్తుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, ప్రెజెంటేషన్ స్లైడ్లు, ప్రొఫెషనల్ డాక్యుమెంట్ల క్రియేష‌న్‌లో కూడా మెరుగైన అవుట్‌పుట్ ఇస్తుంది. ఫైనాన్స్, లీగల్, ఎంటర్‌ప్రైజ్ నాలెడ్జ్ వర్క్‌లలో కూడా దీని పనితీరు బలంగా ఉంది. ఫైనాన్స్ ఏజెంట్ ఎవాల్యుయేషన్, జీడీపీవాల్-ఏఏ బెంచ్‌మార్క్‌లలో కూడా మంచి ఫలితాలు సాధించింది. మల్టీ-సెషన్ వర్క్‌ఫ్లోల‌లో ఫైల్ సిస్టమ్ ఆధారిత మెమొరీని మెరుగుపరచడం ద్వారా దీర్ఘకాలిక టాస్క్‌లలో కాంటెక్స్ట్‌ను పదేపదే ఇవ్వాల్సిన అవసరం తగ్గింది. సేఫ్టీ, అలైన్‌మెంట్ పరంగా, క్లాడ్ ఓపస్ 4.7, ఓపస్ 4.6తో సమానమైన భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తూ, ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్‌లపై మరింత రక్షణ కల్పించింది. సమాధానాల విశ్వసనీయత, నిజాయితీ కూడా మెరుగుపడింది. అయితే హార్మ్-రెడక్షన్ వంటి సెన్సిటివ్ సందర్భాల్లో కొంత ఎక్కువ వివరాలు ఇవ్వడంలో కొద్దిపాటి వెనుకడుగు వేసిన‌ట్లు ఆంథ్రోపిక్ తెలిపింది.

లోతైన కోడ్ విశ్లేష‌ణ‌..

సైబర్ సెక్యూరిటీ సామర్థ్యం విషయంలో క్లాడ్ మైథోస్ ప్రివ్యూ‌తో పోలిస్తే ఈ మోడల్‌లో నియంత్రణల‌ను ఎక్కువగా అమలు చేశారు. అధిక ప్రమాదం కలిగించే సైబర్ కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. సెక్యూరిటీ నిపుణులు అవసరమైతే సైబర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా యాక్సెస్ పొందవచ్చు. డెవలపర్ల కోసం కొత్త ఫీచర్లను కూడా ఇచ్చారు. ఎక్స్‌హై ఎఫర్ట్ మోడ్ అనే కొత్త రీజనింగ్ స్థాయి ద్వారా పనితీరు, లేటెన్సీ మధ్య సమతుల్యతను నియంత్రించవచ్చు. క్లాడ్ కోడ్ అప్ డేట్‌ల‌లో డిఫాల్ట్ ఎఫర్ట్ స్థాయిని పెంచారు. అల్ట్రా రివ్యూ కమాండ్ ద్వారా లోతైన కోడ్ విశ్లేషణ చేసి బగ్స్, డిజైన్ లోపాలను గుర్తిస్తుంది. ఆటో మోడ్‌లో అనుమతుల నిర్ణయాలు స్వయంగా తీసుకునే సామర్థ్యం కూడా మెరుగుపడింది.

పెర‌గ‌నున్న టోకెన్ వినియోగం, చార్జిల్లో మార్పు లేదు..

ఎపీఐ టాస్క్ బడ్జెట్ (బీటా) ద్వారా టోకెన్ వినియోగాన్ని నియంత్రించవచ్చు. అలాగే హై-రెజల్యూషన్ చిత్రాల ఇన్‌పుట్‌కు మెరుగైన సపోర్ట్ అందించారు. ఓపస్ 4.6 నుంచి ఓపస్ 4.7కి మారే డెవలపర్లు కొన్ని మార్పులను గమనించాల్సి ఉంటుంది. కొత్త టోకెనైజర్ వల్ల టోకెన్ వినియోగం 1.0 నుంచి 1.35 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. లోతైన రీజనింగ్ కారణంగా అవుట్‌పుట్ కూడా విస్తృతంగా ఉంటుంది. అయితే ఎఫర్ట్ పారామీటర్, టాస్క్ బడ్జెట్, కన్‌సైజ్ ప్రాంప్టింగ్ ద్వారా దీనిని నియంత్రించవచ్చు. పూర్తి మార్పు ముందు వాస్తవ వర్క్‌లోడ్స్‌పై పరీక్షలు చేయాలని సంస్థ సూచించింది. క్లాడ్ ఓపస్ 4.7 ప్రస్తుతం క్లాడ్ యాప్స్, క్లాడ్ ఏపీఐ (మోడల్: క‌్లాడ్-ఓపస్-4-7), అమెజాన్ బెడ్‌రాక్, గూగుల్ క్లౌడ్ వెర్టెక్స్ ఏఐ, మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఇక ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇన్‌పుట్ టోకెన్లకు ప్రతి మిలియన్‌కు 5 డాలర్లు, అవుట్‌పుట్ టోకెన్లకు ప్రతి మిలియన్‌కు 25 డాలర్లుగా చార్జిల‌ను వ‌సూలు చేస్తున్నారు.

Advertisement
Advertisement