త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maruti Suzuki | కొత్త బ్రెజ్జా వచ్చేసింది.. టర్బో ఇంజిన్‌తో మారుతి భారీ అప్‌డేట్..

Maruti Suzuki | దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారత మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బ్రెజ్జాను అధికారికంగా విడుదల చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, తొలిసారిగా టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను జోడిస్తూ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తన పోటీని మరింత బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది.

S

Automobiles | Published On Jul 25, 2026, 10.57 am IST

Maruti Suzuki | కొత్త బ్రెజ్జా వచ్చేసింది.. టర్బో ఇంజిన్‌తో మారుతి భారీ అప్‌డేట్..
Advertisement

Maruti Suzuki | దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారత మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బ్రెజ్జాను అధికారికంగా విడుదల చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, తొలిసారిగా టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను జోడిస్తూ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తన పోటీని మరింత బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. కొత్త బ్రెజ్జా ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.7.40 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త బ్రెజ్జా మార్కెట్లో టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలవనుంది. వాహనం మొత్తం ఆకృతి గత మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, ముందు భాగంలో పూర్తిగా కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో కూడిన కొత్త బంపర్‌ను అందించారు.

అలాయ్ వీల్స్‌, భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌..

కొత్తగా డిజైన్ చేసిన 16 ఇంచుల అలాయ్ వీల్స్ ను అమర్చారు. వెనుక భాగం డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. క్యాబిన్‌లో బ్లాక్-బ్రౌన్ డ్యుయల్ టోన్ ఇంటీరియర్‌ను అందించారు. అలాగే పెద్ద 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందించారు. ఫీచర్ల పరంగా కూడా కొత్త బ్రెజ్జాలో గణనీయమైన అప్‌డేట్లు చేశారు. వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, 64 రంగుల అంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భద్రత విషయంలో కూడా కంపెనీ మరిన్ని ఆధునిక సాంకేతికతలను అందించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్ల‌ను అందించారు. ఈ అప్‌గ్రేడ్ చేసిన బ్రెజ్జాకు భారత్ ఎన్‌సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించినట్లు కంపెనీ వెల్లడించింది.

1.5 లీట‌ర్ పెట్రోల్ ఇంజిన్‌..

ఇంజిన్ పరంగా ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 102 హెచ్‌పీ శక్తి, 139 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్‌లో ఇప్పుడు అండర్‌బాడీ ట్యాంక్‌ను అమర్చడంతో బూట్ స్పేస్ మరింత పెరిగింది. అలాగే మారుతి తొలిసారిగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కూడా పరిచయం చేసింది. ఈ ఇంజిన్ 110 హెచ్‌పీ శక్తి, 170 ఎన్‌ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ను జత చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్ష‌న్‌ల‌ను కూడా ఇచ్చారు. కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వ‌చ్చింది.

Advertisement
Advertisement