త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio 2026 Happy New Year Plans | న్యూ ఇయ‌ర్ సంద‌ర్బంగా జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఉచితంగా గూగుల్ జెమిని ఏఐ ప్రొ స‌బ్ స్క్రిప్ష‌న్‌..

S

Technology | Published On Dec 14, 2025, 3.17 pm IST

Jio 2026 Happy New Year Plans | న్యూ ఇయ‌ర్ సంద‌ర్బంగా జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఉచితంగా గూగుల్ జెమిని ఏఐ ప్రొ స‌బ్ స్క్రిప్ష‌న్‌..
Advertisement

Jio 2026 Happy New Year Plans | నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం ప‌లు నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2026 పేరిట ఈ ప్లాన్ ల‌ను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా డేటా యాడాన్‌తోపాటు వార్షిక స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే ఈ ప్లాన్స్‌తో ప‌లు ఓటీటీ యాప్‌ల సేవ‌ల‌ను సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఇక ఏఐ సేవ‌లను కూడా ఈ ప్లాన్‌ల‌తో ఉచితంగా పొంద‌వ‌చ్చు. రిల‌య‌న్స్ జియో త‌న హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2026 ఆఫ‌ర్‌లో భాగంగా రూ.500, రూ.3599, రూ.103 ప్లాన్ల‌ను కొత్త‌గా లాంచ్ చేసింది. ఇవి ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రూ.3599 ప్లాన్ ను రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్లు 365 రోజుల వాలిడిటీని పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 2.5 జీబీ డేటా ల‌భిస్తుంది. 5జి ఇంట‌ర్నెట్‌ను అన్‌లిమిటెడ్‌గా పొంద‌వ‌చ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌తోపాటు అన్ లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్‌లో భాగంగా క‌స్ట‌మ‌ర్లు 18 నెల‌ల పాటు గూగుల్‌కు చెందిన జెమిని ప్రొ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. దీని విలువ రూ.35,100గా ఉంది. ఇక రూ.500 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 28 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అన్‌లిమిటెడ్ 5జి ఇంట‌ర్నెట్‌ను కూడా ఇస్తారు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్ లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్‌లో భాగంగా ప‌లు ఓటీటీ యాప్‌ల సేవ‌ల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఇందులో భాగంగా యూట్యూబ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. అలాగే జియో హాట్ స్టార్‌, అమెజాన్ ప్రైమ్‌, సోనీ లివ్, జీ5, ల‌య‌న్స్ గేట్ ప్లే, డిస్క‌వ‌రీ ప్ల‌స్‌, స‌న్ నెక్ట్స్‌, ఫ్యాన్ కోడ్ వంటి ఓటీటీ యాప్‌ల‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు. ఇక ఇందులోనూ 18 నెల‌ల పాటు గూగుల్ జెమిని ప్రొ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది.

ఇక రూ.103 ప్యాక్‌ను ఫ్లెక్సి ప్యాక్ రూపంలో లాంచ్ చేశారు. ఇది సాధార‌ణ రీచార్జి ప్లాన్ కాదు, డేటా యాడాన్ మాత్ర‌మే. దీన్ని రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్ల‌కు 5జీబీ డేటా ల‌భిస్తుంది. దీన్ని 28 రోజులలోగా వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ద్వారా ప‌లు ఎంపిక చేసిన ఓటీటీ యాప్‌ల‌ను ఒక ప్యాక్‌గా పొంద‌వ‌చ్చు. ఇందులో హిందీ ప్యాక్ కింద జియో హాట్ స్టార్‌, జీ5, సోనీ లివ్ లేదా ఇంట‌ర్నేష‌న‌ల్ ప్యాక్ కింద జియో హాట్ స్టార్‌, ఫ్యాన్ కోడ్‌, ల‌య‌న్స్ గేట్‌, డిస్క‌వ‌రీ ప్ల‌స్‌, రీజ‌న‌ల్ ప్యాక్ కింద జియో హాట్ స్టార్‌, స‌న్ నెక్ట్స్‌, కంచ లంక‌, హోయ్ చొయ్ వంటి ఓటీటీ యాప్‌ల‌ను ఇస్తున్నారు. అయితే ఈ మూడు ప్యాక్‌ల‌లో ఏదైనా ఒక ఓటీటీ ప్యాక్‌ను మాత్ర‌మే క‌స్ట‌మ‌ర్లు ఈ ప్లాన్‌తోపాటు ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా రిల‌య‌న్స్ జియో క‌స్ట‌మ‌ర్లు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్ ద్వారా రీచార్జి చేసుకోవ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement