త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iQOO 15R | భారీ బ్యాట‌రీ, అదిరిపోయే డిస్‌ప్లేతో లాంచ్ అయిన ఐక్యూ 15ఆర్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

iQOO 15R | మొబైల్స్ త‌యారీదారు ఐక్యూ త‌న లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ 15ఆర్ (iQOO 15R)ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో ప‌లు అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 6.59 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇందులో ఇచ్చారు. దీనికి 1.5కె రిజ‌ల్యూష‌న్‌, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తున్నాయి.

S

Technology | Published On Feb 24, 2026, 1.39 pm IST

iQOO 15R | భారీ బ్యాట‌రీ, అదిరిపోయే డిస్‌ప్లేతో లాంచ్ అయిన ఐక్యూ 15ఆర్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

iQOO 15R | మొబైల్స్ త‌యారీదారు ఐక్యూ త‌న లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ 15ఆర్ (iQOO 15R)ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో ప‌లు అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 6.59 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇందులో ఇచ్చారు. దీనికి 1.5కె రిజ‌ల్యూష‌న్‌, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తున్నాయి. క‌నుక ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుత‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. అలాగే సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా డిస్‌ప్లే కనిపించేలా దీనికి 5000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్‌నెస్ ఫీచ‌ర్‌ను అందించారు. ఈ ఫోన్‌ను రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. డార్క్ నైట్‌, ట్ర‌యంఫ్ సిల్వ‌ర్ ఆప్ష‌న్‌లలో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

ప్ర‌త్యేక కూలింగ్ ఫీచ‌ర్‌..

ఐక్యూ 15ఆర్ స్మార్ట్ ఫోన్‌లో అధునాత‌న స్నాప్ డ్రాగ‌న్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ఇందులో ల‌భిస్తుంది. దీనికి 4 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో 16జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 1 టీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ను ఇచ్చారు. ప్ర‌త్యేకంగా ఐస్ కోర్ వీసీ కూలింగ్ అనే ఫీచ‌ర్ కూడా ఉంది. దీని వ‌ల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉప‌యోగించిన‌ప్ప‌టికీ అంత త్వ‌ర‌గా హీట్‌కు గురి కాదు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల‌కు ప‌లు ఏఐ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌లో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గింది దీని బ్యాట‌రీ. ఇందులో ఏకంగా 7600 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇచ్చారు. అలాగే 100 వాట్ల ఫ్లాష్ చార్జ్‌కు స‌పోర్ట్‌ను ఇచ్చారు. క‌నుక ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. కేవ‌లం 33 నిమిషాల్లోనే 50 శాతం మేర చార్జింగ్ పూర్త‌వుతుంది. 12జీబీ, 16జీబీ ర్యామ్‌, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఇన్ డిస్‌ప్లే 3డి అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ల‌ను కూడా ఇచ్చారు. ఐపీ 68, 69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ఉంది. 5జి సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి స‌దుపాయాల‌ను సైతం ఇందులో అందిస్తున్నారు.

ధ‌ర వివ‌రాలు..

ఐక్యూ 15ఆర్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.44,999 ఉండ‌గా, 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.47,999గా ఉంది. 12జీబీ, 512జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.52,999గా నిర్ణ‌యించారు. టాప్ మోడ‌ల్స్‌ను రానున్న రోజుల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌ల‌ను అమెజాన్‌తోపాటు ఐక్యూ ఆన్‌లైన్ స్టోర్‌లో, ఆఫ్‌లైన్ స్టోర్‌ల‌లో మార్చి 3 నుంచి విక్ర‌యించ‌నున్నారు. వీటికి ఇప్ప‌టికే ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌పై రూ.4వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇవ్వ‌నున్నారు. ఐక్యూ టీడ‌బ్ల్యూఎస్ 1ఇ ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్‌ల‌పై 6 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

Advertisement
Advertisement