Google Voluntary Exit | ఏఐ నేర్చుకోండి.. లేదంటే కంపెనీ నుంచి వెళ్లిపోండి.. ఉద్యోగులకు గూగుల్ షాక్..!
గూగుల్ మాత్రమే కాదు.. టాప్ కంపెనీలు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ బిజినెస్ మోడల్స్‌ను తమ ఆపరేషన్స్‌లో భాగంగా తీసుకురావడం, ఏఐకి అడ్జెస్ట్ కాని ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించడం పరిపాటి అయింది.
Technology | Published On Feb 11, 2026, 8.11 pm IST
Google Voluntary Exit | ఇది ఏఐ యుగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అన్ని రంగాల్లో విస్తరిస్తూ వంద మంది చేసే పని ఒకరిద్దరితో చేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న రోజుల్లో ఉన్నాం. జెన్‌జెడ్ కూడా ఏఐని తమ జీవితంలో అలవాటు చేసుకుంది. పలు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఏఐని ఉపయోగించి స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. గంటల్లో చేయాల్సిన పనిని నిమిషాల్లో ఖచ్చితత్వంతో నిర్వహించగలుగుతున్నారు. కొన్ని రంగాల్లో అయితే ఉద్యోగుల అవసరం లేకుండానే ఏఐ అత్యంత ఖచ్చితత్వంతో టాస్కులు చేస్తోంది. దీని వల్ల మ్యాన్ పవర్ అవసరం లేకుండానే ఏఐతో కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. ఐటీ రంగంలో ఏఐ వల్ల చాలామంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇంకా పలు ఎంఎన్‌సీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ కంపెనీ కూడా ఉద్యోగులను అలర్ట్ చేసింది.
వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్
నిన్న గాక మొన్ననే కదా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఫలితాలు వచ్చాయి. 2025 లో 400 బిలియన్ డాలర్ల రెవెన్యూను కంపెనీ సాధించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా చెప్పుకోవచ్చు. ఇంతలోనే గూగుల్ కంపెనీ ఈ బాంబు పేల్చింది. 2026 లో కంపెనీ ఏఐకి సంబంధించి పలు ప్రణాళికలు రూపొందించిందని, ఏఐ టెక్నాలజీలో పని చేసేలా ఉద్యోగులంతా సిద్ధం కావాలని కంపెనీ నుంచి ఉద్యోగులకు సమాచారం వెళ్లింది. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ స్కిండ్లర్ నుంచి గూగుల్ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్‌కి వెళ్లింది. ఇందులో అడ్వర్టైజింగ్ ప్రాడక్ట్స్, సర్వీసెస్ మీద పని చేస్తుంటారు. అంటే సేల్స్, పార్టనర్‌షిప్స్, క్లైంట్ సర్వీసెస్ ఆపరేషన్స్, ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థకు సంబంధించి ఉన్న కంపెనీల రెవెన్యూ గ్రోత్‌కి సంబంధించిన ఆపరేషన్స్‌లో పాల్గొనే యూనిట్ అది. వాళ్లు ఏఐ టెక్నాలజీతో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని, ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాలంటరీగా కంపెనీ నుంచి తప్పుకోవచ్చని స్పష్టం చేసింది.
ఏఐ మీద గూగుల్ భారీ పెట్టుబడులు
నిజానికి ఏఐ మీద అమెరికాలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్న కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. భారీగా ఏఐ మీద పెట్టుబడులు పెడుతుండటంతో తమ కంపెనీ ఉద్యోగులు కూడా ఏఐ టెక్నాలజీని నేర్చుకొని తమ ఆపరేషన్స్‌ని వేగంగా, ఖచ్చితత్వంతో చేసేలా సిద్ధమయ్యేలా చేయడమే గూగుల్ ఉద్దేశం. అందుకే భవిష్యత్తులో అన్ని రంగాల్లో పాతుకుపోతున్న ఏఐ టెక్నాలజీని తమ కంపెనీ ఆపరేషన్స్‌లో భాగం చేసేందుకు గూగుల్ భారీగానే ప్లాన్ చేస్తోంది. ఏఐ ప్లాన్స్‌ని అందిపుచ్చుకోలేని ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించి వాళ్లకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ను వెల్లడించింది. ఇందులో భాగంగా సెవరన్స్ ప్యాకేజీని వాలంటరీగా వెళ్లిపోయే ఉద్యోగులకు గూగుల్ ఇవ్వనుంది.
గూగుల్‌కి కొత్తేమీ కాదు
ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ గూగుల్‌కి కొత్తేమీ కాదు. గత సంవత్సరం నవంబర్‌లో గూగుల్ యూకేలోని గూగుల్ ఉద్యోగులకు ఇలాంటి ప్యాకేజీనే ప్రకటించింది. గూగుల్ మాత్రమే కాదు.. టాప్ కంపెనీలు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ బిజినెస్ మోడల్స్‌ను తమ ఆపరేషన్స్‌లో భాగంగా తీసుకురావడం, ఏఐకి అడ్జెస్ట్ కాని ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించడం పరిపాటి అయింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






