Google Personal Intelligence | గూగుల్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్.. ఏఐలో మరో మెట్టు పైకి..
Google Personal Intelligence | శ్రావ్య తన స్నేహితులతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడి వాతావరణం, ఆహారాన్ని ఆమె బాగా ఆస్వాదించింది. ఆ సమయంలో కొన్ని ఫొటోలను కూడా తీసుకుంది. అవన్నీ ఆమె గూగుల్ ఫొటోస్‌లో సేవ్ అయ్యాయి. ఆ తరువాత కొన్ని రోజులకు తాను ఆ రెస్టారెంట్‌ను సందర్శించిన సంఘటన గుర్తుకు వచ్చింది.
Technology | Published On Jan 17, 2026, 10.02 am IST
Google Personal Intelligence | శ్రావ్య తన స్నేహితులతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడి వాతావరణం, ఆహారాన్ని ఆమె బాగా ఆస్వాదించింది. ఆ సమయంలో కొన్ని ఫొటోలను కూడా తీసుకుంది. అవన్నీ ఆమె గూగుల్ ఫొటోస్‌లో సేవ్ అయ్యాయి. ఆ తరువాత కొన్ని రోజులకు తాను ఆ రెస్టారెంట్‌ను సందర్శించిన సంఘటన గుర్తుకు వచ్చింది. కానీ ఆ రెస్టారెంట్ పేరు మాత్రం ఆమెకు గుర్తు లేదు. ఎంత గుర్తు చేసుకున్నా అది ఆమెకు జ్ఞాపకం రాలేదు. దీంతో తన ఫోన్‌లోని Google Gemini AI టూల్‌లో ఉన్న Personal Intelligence ఫీచర్ గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ రెస్టారెంట్ పేరు ఏంటో తనకు చెప్పమని అడిగింది. అప్పుడు ఆ ఫీచర్ ఆమె పాత ఫొటోలను పరిశీలించి ఆ రెస్టారెంట్ పేరును క్షణాల్లో ఆమెకు చెప్పింది.
రమేష్ తన కారును అప్పుడప్పుడు ఫొటోలు తీస్తుంటాడు. ఆ ఫొటోల్లో కారు నంబర్ కూడా ఉంటుంది. కానీ అతనికి తన కార్ నంబర్ గుర్తే ఉండదు. అయితే ఒకసారి ఆ నంబర్ అవసరం ఏర్పడి Personal Intelligence ను ఆ సమాచారం కావాలని అడిగాడు. కానీ ఆ ఫీచర్ మాత్రం అతనికి నంబర్ చెప్పలేదు. అందుకు బదులుగా కార్ నంబర్ ఉన్న ఫొటోను అతనికి తీసి ఇచ్చింది. దీంతో అతను ఆ ఫొటోను చూసి తనకు కావల్సిన సమాచారం తెలుసుకున్నాడు.
అందరికీ ఫ్రీగానే..
ఈ రెండు సందర్భాల్లోనూ గూగుల్‌కు చెందిన పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అద్భుతంగా పనిచేసింది. అయితే ఈ ఫీచర్ గురించి ఇప్పుడే వింటున్నాం, కొత్తగా వచ్చిందా.. అని అందరికీ సందేహం కలగక మానదు. అవును, నిజంగా ఈ ఫీచర్ కొత్తగా వచ్చిందే. కానీ గూగుల్ ఇంకా దీన్ని లాంచ్ చేయలేదు. కేవలం కొద్ది మంది ఎంపిక చేసిన యూజర్లతో టెస్ట్ చేస్తోంది. అది కూడా అమెరికాలోనే. ఈక్రమంలోనే ముందుగా ఈ ఫీచర్ అక్కడి గూగుల్ జెమిని ఏఐ ప్రొ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. సాధారణ యూజర్లకు కూడా ఫ్రీగానే ఈ సేవను అందించాలని గూగుల్ ప్లాన్ చేస్తోంది.

గూగుల్ యాప్స్‌కు కనెక్షన్..
అయితే పైన తెలిపిన ఆ రెండు ఉదాహరణల్లాగే గూగుల్‌కు చెందిన పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అచ్చం అదేవిధంగా పనిచేస్తుంది. దీన్ని గూగుల్ తన జెమిని ఏఐ టూల్‌లో ఒక ఫీచర్‌గా అందించనుంది. ఇక దీని సహాయంతో అనేక పనులను చాలా సులభంగా చక్కబెట్టుకోవచ్చు. పైన తెలిపిన ఆ రెండు ఉదాహరణలు గూగుల్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలియజేస్తాయి. అయితే ఈ ఫీచర్‌ను వాడుకోవాలంటే యూజర్లు ముందుగా దీన్ని తమ ఫోన్‌లో ఉండే పలు గూగుల్ యాప్స్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పైన తెలిపిన ఆ రెండు సంఘటనలను తీసుకుంటే వాటిల్లో ఆయా వ్యక్తులు గూగుల్ ఫొటోస్‌ను ఉపయోగించినట్లు అంతర్లీనంగా అర్థమవుతుంది. అందుకనే వారి గూగుల్ ఫొటోస్‌లో ఉండే ఇమేజ్‌లను పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ స్కాన్ చేసి వారికి కావల్సిన సమాచారాన్ని రెండు రకాలుగా అందించింది. ఇలా ఈ ఫీచర్‌ను గూగుల్ కు చెందిన పలు యాప్స్‌కు ముందుగా కనెక్ట్ చేస్తే ఆ తరువాత దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఇలా పనిచేస్తుంది..
పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను గూగుల్‌లోని ఫొటోస్ మాత్రమే కాకుండా, జీమెయిల్, డ్రైవ్, మ్యాప్స్, డాక్స్, యూట్యూబ్, సెర్చ్ వంటి ఇతర యాప్స్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో ఆయా యాప్‌లలో యూజర్లు ఎదుర్కొనే పలు సమస్యలతోపాటు వాటిలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాటిని ఎలా వాడుకుంటున్నారు, వాటిలో నుంచి యూజర్లు ఏం కావాలని కోరుకుంటున్నారు.. అనే అంశాలను పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ముందుగానే అంచనా వేస్తుంది. ఆ తరువాత యూజర్ ఎప్పుడైనా ఫలానా యాప్‌లో ఉన్న ఫలానా సమాచారం కావాలని అడిగితే వెంటనే తీసిస్తుంది. ఇలా గూగుల్ జెమిని ఏఐ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ పనిచేస్తుంది. అయితే ఇక్కడే చాలా మందికి ఒక సందేహం వస్తుంది.

గూగుల్ లో సదరు పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను వాడుకోవాలంటే ముందుగా ఆయా యాప్‌లను కనెక్ట్ చేయాలని చెబుతున్నారు కదా. మరి ఆ యాప్‌లలో ఉండే యూజర్ల డేటాను ఆ ఫీచర్ స్కాన్ చేస్తుంది కదా, దీంతో యూజర్లకు ప్రైవసీ సమస్య ఏర్పడుతుంది కదా.. అంటే.. అవును.. కానీ పైన తెలిపిన రెండు ఉదాహరణలను మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటి ఉదాహరణలో ఆ యువతి రెస్టారెంట్ పేరు అడిగితే అది సున్నితమైన సమాచారం కాదు కనుక వెంటనే ఆ సమాచారాన్ని ఆమెకు చెప్పేసింది. కానీ రెండో ఉదాహరణలో కారు నంబర్‌ను చెప్పలేదు. ఆ నంబర్ ఉన్న ఫొటోను తీసిచ్చింది. అంటే యూజర్ కార్ నంబర్‌ను ఆ ఫీచర్ బయటకు వెల్లడించలేదు. ఎందుకంటే అది సున్నితమైన సమాచారం కాబట్టి ఆ ఫీచర్ అక్కడ ప్రైవసీకి అనుగుణంగా నడుచుకుంది. కనుకనే ఆ సంఘటనలో సమాచారాన్ని అలా చెప్పింది. ఈ విధంగా పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ యూజర్‌కు చెందిన ప్రైవసీకి కూడా భద్రతను కల్పిస్తుంది. కనుక యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడంలో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు.
ప్రస్తుతానికి ఇన్వైట్ విధానంలోనే..
ఇక ఈ ఫీచర్‌ను ప్రస్తుత కొందరికి ఇన్వైట్ విధానంలో పంపి టెస్ట్ చేస్తున్నారు. కనుక యూజర్లు గూగుల్ జెమినిని వాడుతున్న సమయంలో ఒక పాపప్ విండో మాదిరిగా వారికి ఈ ఫీచర్‌కు చెందిన నోటిఫికేషన్ దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. ఒక వేళ మీకు కూడా ఇలా కనిపిస్తే, మీకు ఈ ఫీచర్ పట్ల ఆసక్తి ఉంటే అందులో రిజిస్టర్ చేసుకుని ఉపయోగించవచ్చు. అలాగే గూగుల్ జెమిని యాప్ మాత్రమే కాకుండా వెబ్ వెర్షన్‌లోనూ ఈ ఫీచర్‌ను ఇలా టెస్టింగ్ కోసం ఆహ్వానాలను పంపిస్తున్నారు. కనుక ఆ ప్లాట్‌ఫామ్‌లోనూ యూజర్లకు అలా నోటిఫికేషన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తే దాన్ని ఒక నిర్దిష్టమైన స్థానం నుంచి నేరుగా యాక్టివేట్ చేసుకునేలా వీలు కల్పించనున్నారు. ఇందుకు గాను యూజర్లు ఆ సమయంలో గూగుల్ జెమిని యాప్‌ను ఓపెన్ చేసి అందులో ఉండే సెట్టింగ్స్ ను యాక్సెస్ చేశాక, అక్కడి పర్సనల్ ఇంటెలిజెన్స్ అనే సెక్షన్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో యూజర్ కావాలనుకునే గూగుల్ యాప్స్‌ను ఆ ఫీచర్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే అమెరికాలోని యూజర్లకు అతి త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుండగా, ప్రపంచ వ్యాప్తంగా మరో ఐదారు నెలల్లో ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






