త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌.. బీఆర్ఎస్ నేత‌ల అరెస్ట్‌

BRS | సికింద్రాబాద్ (Secunderabad) మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కోసం బీఆర్ఎస్ (BRS) పార్టీ చేప‌ట్టిన ర్యాలీ ఉద్రిక్త‌త‌కు దారితీసింది. మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ నుంచి ఎంజీ రోడ్డులోని మ‌హాత్మాగాంధీ విగ్ర‌హం వ‌ర‌కు భారీ శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

G

Hyderabad | Published On Jan 17, 2026, 11.27 am IST

BRS | సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌.. బీఆర్ఎస్ నేత‌ల అరెస్ట్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్ (Secunderabad) మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కోసం బీఆర్ఎస్ (BRS) పార్టీ చేప‌ట్టిన ర్యాలీ ఉద్రిక్త‌త‌కు దారితీసింది. మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ నుంచి ఎంజీ రోడ్డులోని మ‌హాత్మాగాంధీ విగ్ర‌హం వ‌ర‌కు భారీ శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌ల్ల బ్యాడ్జీలు, కండువాల‌తో పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. మ‌ల్కాజిగిరి హ‌టావో, సికింద్రాబాద్ బ‌చావో, జై సికింద్రాబాద్‌ అంటూ సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి ఎంజీ రోడ్డువైపు ర్యాలీ సాగుతుండ‌గా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమ‌తి లేద‌ని వ‌చ్చిన‌వారిని వ‌చ్చిన‌ట్లు అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

సికింద్రాబాద్ జిల్లా సాధ‌న స‌మితి పేరుతో ర్యాలీకి అనుమ‌తి అడిగార‌ని, అయితే న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ర్యాలీకి అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు.

[video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-17-at-10.09.11-AM.mp4"][/video]

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement