త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Professional Certificate | ఏఐ ప్రొఫెష‌న‌ల్ స‌ర్టిఫికెట్ కోర్సును ప్ర‌వేశ‌పెట్టిన గూగుల్‌.. ఏఐ స్కిల్స్‌ను మెరుగుప‌రుచుకోవ‌చ్చు..

AI Professional Certificate | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ కొత్త‌గా ఏఐ ప్రొఫెష‌న‌ల్ స‌ర్టిఫికెట్ కోర్సును కోర్స్ఎరా వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. ఇప్ప‌టికే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న‌వారితోపాటు ఫ్రెష‌ర్లు కూడా ఏఐ కోసం సిద్ధం అయ్యేందుకు, త‌మ ఏఐ నైపుణ్యాల‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకునేందుకు ఈ కోర్సు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గూగుల్ తెలిపింది.

S

Technology | Published On Feb 25, 2026, 7.46 am IST

AI Professional Certificate | ఏఐ ప్రొఫెష‌న‌ల్ స‌ర్టిఫికెట్ కోర్సును ప్ర‌వేశ‌పెట్టిన గూగుల్‌.. ఏఐ స్కిల్స్‌ను మెరుగుప‌రుచుకోవ‌చ్చు..
Advertisement

AI Professional Certificate | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ కొత్త‌గా ఏఐ ప్రొఫెష‌న‌ల్ స‌ర్టిఫికెట్ కోర్సును కోర్స్ఎరా వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. ఇప్ప‌టికే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న‌వారితోపాటు ఫ్రెష‌ర్లు కూడా ఏఐ కోసం సిద్ధం అయ్యేందుకు, త‌మ ఏఐ నైపుణ్యాల‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకునేందుకు ఈ కోర్సు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గూగుల్ తెలిపింది. ఈ కోర్సును పూర్తి చేసిన అభ్య‌ర్థుల‌కు కాంప్లిమెంట‌రీ కింద గూగుల్ ఏఐ ప్రొ స‌బ్ స్క్రిప్ష‌న్‌ను 3 నెల‌ల పాటు ఉచితంగా అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ స‌బ్ స్క్రిప్ష‌న్‌లో గూగుల్‌కు చెందిన అధునాత‌న ఏఐ మోడ‌ల్స్‌ను అభ్య‌ర్థులు ఉప‌యోగించుకోవ‌చ్చు. ముఖ్యంగా జెమిని, నోట్‌బుక్ ఎల్ఎం, ఏఐ స్టూడియో వంటి ఏఐ టూల్స్‌ను వాడుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఏఐ స్కిల్స్ మ‌రింత మెరుగు ప‌డ‌తాయ‌ని గూగుల్ వెల్ల‌డించింది. ఏఐ సర్టిఫికెట్ కోర్సు ద్వారా త‌మ ఏఐ నైపుణ్యాల‌ను మ‌రింత అభివృద్ధి చేసుకునేందుకు ఉద్యోగులు, విద్యార్థుల‌కు ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని గూగుల్ పేర్కొంది.

ఏఐ ఉద్యోగాల్లో భారీగా ఖాళీలు..

ఏఐ కార‌ణంగా ఉద్యోగాల‌కు ముప్పు ఏర్ప‌డ‌నుందన్న చ‌ర్చ‌ల నేప‌థ్యంలో ఉద్యోగులు త‌మ స్కిల్స్‌ను మెరుగు ప‌రుచుకుని త‌మ జాబ్‌ల‌ను కాపాడుకునేందుకు ఈ కోర్సు ప‌నిచేస్తుంద‌ని ప‌లు సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు తెలిపారు. ఏఐ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అందులో స్కిల్స్ ఉండాల్సిన అవ‌ప‌రం ఉంద‌ని అన్నారు. దీని వ‌ల్ల ఉద్యోగుల‌కు ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉండ‌దని, ఏఐ వ‌ల్ల త‌మ ఉద్యోగం పోతుంద‌న్న భ‌యం ఉండ‌ద‌ని తెలిపారు. కాగా బ్రెయిన్ అండ్ కంపెనీ ఇండియా విభాగం తెలిపిన ప్ర‌కారం 2027 వ‌ర‌కు భార‌త్‌లో 2.3 మిలియ‌న్ల ఏఐ ఉద్యోగాలు కొత్త‌గా ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. కానీ ప్ర‌స్తుతానికి 1.2 మిలియ‌న్ల ఉద్యోగులు మాత్ర‌మే అందుబాటులో ఉన్నార‌ని, మ‌రో 1 మిలియ‌న్‌కు పైగా నైపుణ్యం క‌లిగిన ఉద్యోగుల అవ‌స‌రం భారీగా ఏర్ప‌డుతుంద‌ని తేలింది. క‌నుక గూగుల్ అందుబాటులోకి తెచ్చిన ఈ కోర్సుతో ఎంతో మంది ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

కోర్సు వివ‌రాలు..

ఈ కోర్సును ప్ర‌వేశ‌పెట్టేందుకు గాను గూగుల్ అనేక సంస్థ‌ల‌తో ఇప్ప‌టికే స‌మ‌న్వ‌యంగా ప‌నిచేసింది. ఏ సంస్థ‌కు చెందిన ఉద్యోగికి అయినా లేదా విద్యార్థికి అయినా ఉప‌యోగ‌ప‌డే విధంగా యూనివర్స‌ల్ స్థాయి కోర్సును తేవాల‌ని ఆలోచించింది. అందులో భాగంగానే ఈ ఏఐ ప్రొఫెష‌న‌ల్ స‌ర్టిఫికెట్ కోర్సును ప్ర‌వేశ‌పెట్టింది. దీంట్లో ఏఐపై అభ్య‌ర్థులు ప్రాక్టిక‌ల్‌గా అనేక అంశాల‌ను నేర్చుకునే అవ‌కాశం ఉంటుంది. ప‌రిశోధ‌న‌, ప్ర‌ణాళిక‌, క‌మ్యూనికేష‌న్‌, కంటెంట్ క్రియేష‌న్‌, డేటా విశ్లేష‌ణ‌, వ‌ర్క్ ఫ్లో ఆటోమేష‌న్ వంటి అంశాల్లో ఏఐని ఎలా ఉప‌యోగించాలి.. అనే విష‌యాల‌పై కోర్సులో నేర్చుకోవ‌చ్చు. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం కాల వ్య‌వ‌ధి 10 గంట‌లు కాగా అందులో 7 షార్ట్ కోర్సులు ఉంటాయి. అలాగే ఓ ప్రాజెక్టును కూడా ఇస్తారు. కోర్సు పూర్త‌య్యాక అభ్య‌ర్థులు ఆయా అంశాల్లో ఏఐ టూల్స్‌ను ఎలా వాడాలో పూర్తిగా తెలియ‌జేసే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటారు. ఈ కోర్సును కోర్స్ఎరా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆస‌క్తి కలిగిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకుని పూర్తి చేయ‌వ‌చ్చు.

Advertisement
Advertisement