Android 17 | ఆండ్రాయిడ్ 17లో గూగుల్ భారీ సెక్యూరిటీ అప్‌డేట్.. పిన్ తప్పుగా ఎంటర్ చేస్తే ఇక అంతే సంగతులు..
Android 17 | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సెక్యూరిటీ పరంగా భారీ అప్‌డేట్లను ఇవ్వనుంది. లాక్ స్క్రీన్ భద్రతను మరింత బలోపేతం చేసే కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తోంది. పిన్ లేదా పాస్‌వర్డ్‌ను ఊహించి ఫోన్‌ను అన్‌లాక్ చేసే దాడులను అడ్డుకునేందుకు ఈ అప్‌డేట్‌లో కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది.
Technology | Published On Jul 7, 2026, 3.38 pm IST
Android 17 | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సెక్యూరిటీ పరంగా భారీ అప్‌డేట్లను ఇవ్వనుంది. లాక్ స్క్రీన్ భద్రతను మరింత బలోపేతం చేసే కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తోంది. పిన్ లేదా పాస్‌వర్డ్‌ను ఊహించి ఫోన్‌ను అన్‌లాక్ చేసే దాడులను అడ్డుకునేందుకు ఈ అప్‌డేట్‌లో కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అలాగే నిజమైన వినియోగదారులు అనుకోకుండా లాక్‌ఔట్‌కు గురైనప్పుడు తిరిగి యాక్సెస్ పొందడం కూడా సులభంగా ఉండేలా మార్పులు చేసింది. సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ డివైస్‌లలో రోజువారీ వినియోగంపై ఎలాంటి ప్రభావం లేకుండా భద్రతను పెంచేలా ఈ ఫీచర్లను రూపొందించారు. అలాగే లాక్‌ఔట్ సమాచారం ఎలా చూపించాలనే విధానాన్ని మార్చడంతోపాటు అకౌంట్ రికవరీకి వేగంగా చేరుకునే కొత్త షార్ట్‌కట్‌ను కూడా గూగుల్ అందించనుంది.
పాస్‌వర్డ్ నమోదు యత్నాల సంఖ్య భారీగా తగ్గింపు..
గూగుల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ ఫర్ ఆండ్రాయిడ్ మిషాల్ రెహ్మాన్ తెలిపిన ప్రకారం, ఆండ్రాయిడ్ 17లో తప్పుగా పిన్ లేదా పాస్‌వర్డ్ నమోదు చేసే ప్రయత్నాల సంఖ్యను గణనీయంగా తగ్గించినట్లు వెల్లడించారు. కొత్త విధానం ప్రకారం మొదటి ఒక నిమిషంలో గరిష్టంగా ఆరు తప్పు ప్రయత్నాలు మాత్రమే అనుమతిస్తారు. ఆరు నిమిషాల్లో మొత్తం ఏడు ప్రయత్నాలు, 25 నిమిషాల్లో ఎనిమిది ప్రయత్నాలు, 24 గంటల్లో 12 ప్రయత్నాలు, ఐదేళ్ల వ్యవధిలో మొత్తం 19 ప్రయత్నాలను మాత్రమే అనుమతిస్తారు. దీంతో పోలిస్తే పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో ఇదే కాలవ్యవధుల్లో వరుసగా 10, 20, 50, 110, 1,800 ప్రయత్నాలకు అనుమతి ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం మొత్తం 20 సార్లు తప్పుగా పిన్ లేదా పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాత ఇకపై ఎలాంటి అన్‌లాక్ ప్రయత్నాలను కూడా అనుమతించదు. సాధారణంగా ఎక్కువ మంది ఉపయోగించే పిన్‌లు లేదా పాస్‌వర్డ్‌లను వరుసగా ఊహించి ప్రయత్నించే దాడులను ఈ పరిమితి గణనీయంగా అడ్డుకుంటుంది.
డూప్లికేట్ గెస్ డిటెక్షన్..
ఇంకో ముఖ్యమైన ఫీచర్‌గా డూప్లికేట్ గెస్ డిటెక్షన్‌ను కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే తప్పు పిన్ లేదా పాస్‌వర్డ్‌ను వినియోగదారు పొరపాటున పదే పదే నమోదు చేస్తే, వాటిని వేర్వేరు విఫల ప్రయత్నాలుగా పరిగణించదు. అదే తప్పు వివరాలు మళ్లీ నమోదు చేసినట్లు గుర్తించి, ఆ ప్రయత్నాన్ని కౌంట్ చేయలేదని స్క్రీన్‌పై ప్రత్యేక సందేశాన్ని చూపిస్తుంది. లాక్‌ఔట్ టైమర్‌ను చూపించే విధానాన్ని కూడా గూగుల్ మార్చింది. ఇప్పటివరకు మిగిలిన సమయాన్ని సెకన్లలో చూపించగా, ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా నిమిషాలు లేదా ఇతర సమయ యూనిట్‌లలో చూపిస్తుంది. ఉదాహరణకు 1,800 సెకన్ల తర్వాత మళ్లీ ప్రయత్నించండి అనే బదులు 30 నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి అనే సందేశం కనిపిస్తుంది. అలాగే లాక్ స్క్రీన్‌పైనే కొత్త రికవరీ షార్ట్‌కట్‌ను కూడా జోడించింది. ఫోన్‌ను అన్‌లాక్ చేయలేని పరిస్థితుల్లో మరో డివైస్ ద్వారా అకౌంట్ రికవరీ ప్రక్రియను ప్రారంభించేందుకు ఈ లింక్ ఉపయోగపడుతుంది.
ఆండ్రాయిడ్ 17 లో రికవరీ ఈజీ..
ఈ మెరుగైన లాక్ స్క్రీన్ సెక్యూరిటీ ఫీచర్లను గూగుల్ మే నెలలో జరిగిన ది ఆండ్రాయిడ్ షో సందర్భంగా మొదట ప్రకటించింది. ఆండ్రాయిడ్ 16 క్యూపీఆర్2లో ప్రారంభమైన భద్రతా మార్పులకు కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 17లో కూడా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. పిన్, పాస్‌వర్డ్‌లను ఊహించి చేసే దాడులను మరింత కష్టతరం చేయడంతోపాటు, నిజమైన వినియోగదారులు పొరపాటున లాక్‌ఔట్‌కు గురైనప్పుడు సులభంగా రికవరీ చేసుకునేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించింది.
సంబంధిత వార్తలు

Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..
ఆగస్టు 22, 2026

Google Quick Share | ఫోన్లను దగ్గరగా ఉంచితే చాలు, డేటా షేర్.. ఆండ్రాయిడ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌కు అప్‌డేట్..
ఆగస్టు 14, 2026

Adani Group | గూగుల్‌కు పోటీగా అదానీ భారీ ప్లాన్.. ఒడిశాలో రూ.1 లక్ష కోట్ల ఏఐ డేటా సెంటర్..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం
- ●Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- ●పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!
- ●Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం

Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!

Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!



