త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google AI Pro Plan | గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. క్లౌడ్ స్టోరేజ్ భారీగా పెంపు..

Google AI Pro Plan | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తన గూగుల్ ఏఐ ప్రొ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ యూజ‌ర్ల‌కు మ‌రిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో సభ్యత్వం పొందిన వినియోగదారులకు ఇకపై అదనపు ఖర్చు లేకుండానే ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్ లభించనుంద‌ని కంపెనీ తెలిపింది.

S

Technology | Published On Apr 4, 2026, 5.00 pm IST

Google AI Pro Plan | గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. క్లౌడ్ స్టోరేజ్ భారీగా పెంపు..
Advertisement

Google AI Pro Plan | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తన గూగుల్ ఏఐ ప్రొ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ యూజ‌ర్ల‌కు మ‌రిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో సభ్యత్వం పొందిన వినియోగదారులకు ఇకపై అదనపు ఖర్చు లేకుండానే ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్ లభించనుంద‌ని కంపెనీ తెలిపింది. ఈ అప్‌డేట్ ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింద‌ని, గూగుల్ లేటెస్ట్ ఏఐ టూల్స్‌తో పాటు క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ ప్లాన్ అధిక విలువ‌ను అందిస్తుంద‌ని తెలియ‌జేసింది. తాజా అప్‌డేట్‌తో గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్ వినియోగదారులు ఇకపై 2టీబీ స్థానంలో 5టీబీ క్లౌడ్ స్టోరేజ్ ను పొందనున్నారు. ఈ విషయాన్ని గూగుల్ వెల్ల‌డించింది. పెంచిన‌ స్టోరేజ్‌ను గూగుల్ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్ ఫొటోస్ వంటి గూగుల్ సేవల్లోనూ ఉపయోగించుకోవ‌చ్చు.

గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్ ఉన్న యూజ‌ర్లంద‌రికీ ఆఫ‌ర్‌..

ఫోన్లలో అధికంగా వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్లు స్టోర్ చేసే వినియోగదారులకు ఈ పెరిగిన క్లౌడ్ స్పేస్ ఎంతో ఉపయోగపడనుంది. అయితే ఈ పెంపు కోసం ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. భారత్‌లో ఈ ప్లాన్ ధర నెలకు రూ. 1,950 లేదా సంవత్సరానికి రూ. 19,500గానే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలు, చిత్రాలు, డాక్యుమెంట్లు వంటి పెద్ద సైజు క‌లిగిన కంటెంట్‌ను స్టోర్ చేయడానికి ఈ అదనపు స్టోరేజ్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ క‌లిగిన యూజ‌ర్లు చాలా మంది ఇప్ప‌టికే త‌మ‌కు క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ పెరిగింద‌ని తెలిపారు. గూగుల్ డ్రైవ్‌, ఫొటోస్‌, ఇత‌ర గూగుల్ సేవ‌ల్లో పెరిగిన స్టోరేజ్ క‌నిపిస్తుంద‌ని చెప్పారు. కాగా గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్‌ను తీసుకున్న విద్యార్థులు, జియో ద్వారా ఉచితంగా ఈ ప్లాన్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు కూడా ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని గూగుల్ తెలిపింది.

అనేక టూల్స్ లో పెరిగిన ప‌రిమితులు..

గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్ ద్వారా వినియోగదారులు జెమిని, డీప్ రీసెర్చి ఆన్ జెమిని వంటి ఆధునిక ఏఐ మోడళ్లను ఉపయోగించవచ్చు. అలాగే వియో టూల్‌ సహాయంతో వీడియోలను జ‌న‌రేట్ చేయ‌వ‌చ్చు. విస్క్‌ ప్లాట్‌ఫామ్‌లో వియో 2 ద్వారా ఇమేజ్ టు వీడియో క్రియేషన్‌కు అధిక పరిమితులు కూడా లభిస్తాయి. వ‌ర్టెక్స్ ఏఐ లో వియో 3 ఫాస్ట్‌కు పరిమిత యాక్సెస్ కూడా లభిస్తుంది. విద్యార్థులకు ప్రతి నెల 1వేయి ఏఐ క్రెడిట్లు అందిస్తారు. వీటిని ఫ్లో, విస్క్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో టెక్స్ట్, ఇమేజ్, వీడియో జనరేషన్ అవసరాలకు ఉపయోగించవచ్చు. అదనంగా నోట్‌బుక్ ఎల్ఎంలో ఆడియో ఓవర్ వ్యూలు, నోట్‌బుక్స్ వంటి ఫీచర్లకు ఐదు రెట్లు ఎక్కువ పరిమితులు లభిస్తాయి. అలాగే డాక్స్‌, షీట్స్‌, స్లైడ్స్ వంటి గూగుల్ యాప్స్‌లో కూడా జెమిని ఏఐ యాక్సెస్ లభిస్తుంది. ఏఐ ఫీచర్లతో పాటు గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్ ప్ర‌స్తుతం గూగుల్ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్ ఫొటోస్ లో మొత్తం 5టీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది గతంలో ఉన్న 2టీబీ పరిమితితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కావ‌డం విశేషం.

Advertisement
Advertisement