Galgotias University | చైనా రోబోడాగ్‌ను తెచ్చి తమదేనని కలరింగ్.. ఏఐ సమ్మిట్‌లో అడ్డంగా దొరికిపోయారు..
Galgotias University | ఢిల్లీలో కొనసాగుతున్న India AI Impact Summit 2026లో భాగంగా ప్రదర్శించిన రోబోటిక్ డాగ్ విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో, గ్రేటర్ నోయిడాకు చెందిన Galgotias University తాజాగా స్పష్టతను ఇచ్చింది.
Technology | Published On Feb 18, 2026, 11.59 am IST
Galgotias University | ఢిల్లీలో కొనసాగుతున్న India AI Impact Summit 2026లో భాగంగా ప్రదర్శించిన రోబోటిక్ డాగ్ విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో, గ్రేటర్ నోయిడాకు చెందిన Galgotias University తాజాగా స్పష్టతను ఇచ్చింది. తాము ఆ రోబోటిక్ డాగ్‌ను స్వయంగా అభివృద్ధి చేశామని ఎప్పుడూ చెప్పలేదని, దాన్ని చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ Unitree నుంచి కొనుగోలు చేశామని యూనివర్సిటీ స్పష్టం చేసింది. సమ్మిట్‌లో ఓరియన్ అనే పేరుతో ఆ రోబో డాగ్‌ను ప్రదర్శించారని, దాన్ని దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా చూపించారన్న ఆరోపణలతో ఓ వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. వాస్తవానికి అది Unitree రూపొందించిన Go2 మోడల్ రోబోటిక్ డాగ్ అని, ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ధరకు లభిస్తుందని పలువురు నెటిజన్లు ఆరోపించారు.
పోస్టుపెట్టిన గాల్గోటియాస్ యూనివర్సిటీ ..
ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించింది. తమ విద్యార్థులకు ప్రాయోగిక అనుభవం కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని ఉత్తమ సాంకేతికతలను వినియోగిస్తున్నామని, Unitree నుంచి కొనుగోలు చేసిన ఈ రోబో డాగ్ కూడా అదే ప్రయాణంలో భాగమని తెలిపింది. ఇది కేవలం ప్రదర్శన వస్తువు కాదని, కదిలే తరగతి గది లాంటిదని, దీంతో తమ విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారని, ఈ రోబో డాగ్‌ను తాము తయారు చేయలేదని, తయారు చేశామని కూడా ఎప్పుడూ చెప్పలేదని పోస్టు పెట్టింది. అమెరికా, చైనా, సింగపూర్ వంటి దేశాల నుంచి ఆధునిక సాంకేతికతను క్యాంపస్‌కు తీసుకొచ్చి విద్యార్థులకు వాస్తవ అనుభవం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపింది. ప్రపంచ స్థాయి పరిష్కారాలను భారత్ నుంచి రూపొందించేలా యువతను ప్రోత్సహించడమే తమ ప్రధాన ఉద్దేశ్యం అని గాల్గోటియాస్ యూనివర్సిటీ స్పష్టం చేసింది.
This has been developed by the Centre of excellence at Galgotiyas University.
“Also we are the first private university that has invested around 350 crores in Artificial Intelligence”. 🧘 https://t.co/NJfDzL7lG2 pic.twitter.com/TMqfSB6K0v
— Harsh Kumar (@itsmeharsh_09) February 17, 2026
వైరల్ అయిన వీడియో..

అయితే వైరల్ వీడియోలో మాత్రం గాల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా ప్రతినిధి ఆ రోబోటిక్ డాగ్‌ను తమ వర్సిటీ రూ.350 కోట్లతో స్వయంగా అభివృద్ధి చేసిందని, తమ వర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం వారు దాన్ని రూపొందించారని, దాని పేరు ఓరియన్ అని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ యూనివర్సిటీ మాత్రం తాము ఆ రోబోడాగ్‌ను అభివృద్ధి చేయలేదని పోస్టులో చెప్పింది. దీంతో ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యూనివర్సిటీ ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్లే చేసి భారత్ పరువు తీసిందని, ఏఐ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధుల ఎదుట భారత్ ప్రతిష్ట దిగజారిందని అంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






