Android Smart Phones | మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఏ సమస్య ఉన్నా సరే.. ఇలా చేస్తే చాలు..
Android Smart Phones | ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కాలక్రమేణా నెమ్మదిగా పనిచేస్తుంటాయి. నెలలు గడిచేకొద్దీ వాటి పనితీరు మందగిస్తుంది. ఫోన్ నెమ్మదిగా ఓపెన్ అవడం, యాప్‌లు వెంటనే తెరుచుకోకపోవడం, తరచూ స్టక్ అవడం వంటి సమస్యలు వస్తుంటాయి.
Technology | Published On Apr 26, 2026, 4.43 pm IST
Android Smart Phones | ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కాలక్రమేణా నెమ్మదిగా పనిచేస్తుంటాయి. నెలలు గడిచేకొద్దీ వాటి పనితీరు మందగిస్తుంది. ఫోన్ నెమ్మదిగా ఓపెన్ అవడం, యాప్‌లు వెంటనే తెరుచుకోకపోవడం, తరచూ స్టక్ అవడం వంటి సమస్యలు వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ నిరంతరం పనిచేయడంతోపాటు స్టోరేజ్ పెరిగిపోవడం, యాప్‌లు అధికంగా ఉండడం, బ్యాటరీ పనితీరు తగ్గడం వంటి కారణాల వల్ల ఫోన్లు నెమ్మదిగా పనిచేస్తాయి. అయితే ఫోన్ కొన్న ఆరంభంలో వేగంగానే పనిచేస్తుంది. కానీ రాను రాను పనితీరు తగ్గుతుంది. దీంతో చాలా మంది వినియోగదారులు వెంటనే ఫోన్ మార్చి ఇంకో ఫోన్ కొంటారు. అయితే అలా చేయాల్సిన పనిలేదు. ఫోన్ అసలు ఎందుకు నెమ్మదిగా పనిచేస్తుందో గుర్తిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. సాధారణంగా చాలా వరకు ఫోన్లకు పైన తెలిపిన కారణాల వల్లే సమస్యలు వస్తాయి. అందువల్ల వినియోగదారులు వెంటనే ఫోన్‌ను మార్చకుండా ముందుగా సమస్యలను చెక్ చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా కొన్ని సూచనలు పాటిస్తే ఫోన్ ను మళ్లీ వేగంగా పనిచేసేలా చేయవచ్చు.
ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే 80 శాతం సమస్యలు మాయం..
స్మార్ట్ ఫోన్లు నెమ్మదిగా పనిచేయడం కాలక్రమంలో సాధారణమే. కేవలం బడ్జెట్ ఫోన్లే కాదు, మిడ్ రేంజ్, ఫ్లాగ్ షిప్ ఫోన్లకు కూడా కొన్ని నెలల తరువాత ఈ సమస్య తప్పదు. స్టోరేజ్‌ను క్లియర్ చేయడం, యాప్స్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఫోన్ కొంత మేర మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అయితే అన్ని ఫోన్లలోనూ అన్ని చర్యలు సఫలం కావు. కేవలం కొన్ని రకాల సూచనలు మాత్రమే పనిచేస్తాయి. ఫోన్‌లో ఉన్న సమస్యకు అనుగుణంగా ఏయే సూచనలు పాటించాలి అని వినియోగదారులు నిర్ణయం తీసుకోవాలి. ఇక ఫోన్‌ను రెగ్యులర్‌గా రీస్టార్ట్ చేస్తుంటే చాలా వరకు సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని సమస్యలకు చాలా సులభమైన పరిష్కారం అని వారు సూచిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్‌లలో ఉండే 80 శాతం వరకు సమస్యలు ఫోన్ ను రీస్టార్ట్ చేయడం వల్ల తొలగిపోతాయని వారు అంటున్నారు.

మెమొరీ లోడ్ తగ్గుతుంది..
ఫోన్‌లను తరచూ రీస్టార్ట్ చేస్తుంటే అసలు దాదాపుగా సమస్యలు రావని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే శాంసంగ్ వంటి కంపెనీలు తమ ఫోన్లలో ఫోన్లు తరచూ రీస్టార్ట్ అయ్యేలా ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నాయని తెలియజేస్తున్నారు. దీని వల్ల యూజర్ గుర్తు పెట్టుకుని మరీ వారానికి ఒకసారి లేదా కొన్ని రోజులకు ఒకసారి ఫోన్‌ను రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. దీంతో ఫోన్ ఎల్లప్పుడూ సాఫీగా పనిచేస్తుంది. ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ మెమొరీలో తాత్కాలికంగా ఉండే ఫైల్స్ తొలగిపోతాయి. దీంతో మెమొరీ రిఫ్రెష్ అవుతుంది. ఫలితంగా ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అలాగే ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం జరిగే ప్రాసెస్‌లకు బ్రేక్ పడుతుంది. అవి ర్యామ్‌ను అధికంగా ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే మెమొరీ లోడ్ తగ్గుతుంది. దీని వల్ల ఫోన్ పనితీరు మెరుగు పడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల బ్యాటరీ పనితీరు కూడా మెరుగు పడుతుంది. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
శాంసంగ్ ఫోన్లలో ఆటోమేటిక్‌గా..
శాంసంగ్ సంస్థ ఫోన్‌ను ఆటోమేటిక్ గా రీస్టార్ట్ చేసే ఆటో ఆప్టిమైజేషన్ ఫీచర్‌ను తన ఫోన్‌లలో డిఫాల్ట్‌గా అందిస్తోంది. ఇందు కోసం వినియోగదారులు ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సిన పనిలేదు. ఇది ఫోన్‌ను యూజర్ సూచనలకు అనుగుణంగా నిర్దిష్ట సమయాల్లో ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ చేస్తుంది. దీంతో ఫోన్ ఎల్లప్పుడూ మెరుగైన పనితీరును ఇస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ ఎప్పటికప్పుడు తనంతట తానుగా పనితీరును మెరుగు పరుచుకుంటుంది. ఎక్కువగా ఫోన్‌లను ఉపయోగించే సందర్భాల్లో ఫోన్ హ్యాంగ్ అవకుండా ఉండేందుకు ఈ ఫీచర్ సహాయం చేస్తుంది. ఇక ఈ ఫీచర్ శాంసంగ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా ఆన్ అయి ఉన్నప్పటికీ యూజర్లు దీన్ని వాడుకోవాలంటే తమకు కావల్సిన విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ఫోన్‌లో ఉండే సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేసి బ్యాటరీ అండ్ డివైస్ కేర్ ఆప్షన్‌ను తెరవాలి. అందులో అడిషనల్ కేర్ అనే సెక్షన్‌లో ఆటో ఆప్టిమైజేషన్‌ను ఎంచుకోవాలి. తరువాత ఆటో రీస్టార్ట్ ఫీచర్‌ను ఆన్ చేయాలి. అనుకూలమైన రోజు, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత సేవ్ చేయాలి. దీంతో యూజర్ సూచనలకు అనుగుణంగా ఫోన్ ఆటో ఆన్, ఆఫ్ అవుతుంది.
ఈ సూచనలు తప్పనిసరి..
ఈ ఫీచర్‌ను సెట్ చేసిన తరువాత ఫోన్, యూజర్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం స్వయంగా రీస్టార్ట్ అవుతుంది. సాధారణంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఫోన్ వినియోగం లేని సమయంలో దీన్ని సెట్ చేసుకుంటే మంచిది. శాంసంగ్ తెలిపిన వివరాల ప్రకారం ఫోన్‌ను ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ చేయాలంటే కొన్ని రూల్స్‌ను పాటించాలని తెలిపింది. స్క్రీన్ ఆఫ్ లో ఉండాలని, ఫోన్ ఉపయోగంలో ఉండకూడదని, బ్యాటరీ కనీసం 30 శాతం మేర చార్జింగ్ మిగిలి ఉండాలని సూచించింది. దీని వల్ల ఫోన్‌ను తరువాత యూజర్ వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఫోన్‌లను ఇలా ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ చేయడం వల్ల పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. స్టోరేజ్ మెరుగు పడుతుంది. ర్యామ్ వేగంగా పనిచేస్తుంది. ఫోన్‌లో పేరుకుపోయే టెంపరరీ ఫైల్స్ క్లియర్ అవుతాయి. సాఫ్ట్ వేర్ అప్ డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం సులభతరం అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించవచ్చు. ఫోన్ దీర్ఘకాలంలో స్మూత్‌గా పనిచేయాలన్నా, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ లభించాలన్నా అప్పుడప్పుడు ఇలా రీస్టార్ట్ చేయడం ఉత్తమ మార్గమని, దీంతో ఫోన్లలో వచ్చే అనేక సమస్యలకు దాదాపుగా పరిష్కారం లభిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
మే 14, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



