త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Doorvi Doorbell | పైసా ఖర్చు లేకుండా మీ ఇంటికి డోర్ బెల్‌ను ఇలా అమ‌ర్చుకోండి..!

Doorvi Doorbell | స్మార్ట్ హోమ్ టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంత‌లు తొక్కుతోంది. కేవలం ఒక చిన్న క్యూఆర్ కోడ్‌తోనే మీ ఇంటి తలుపు వద్ద ఎవరు ఉన్నారో మీ మొబైల్‌లోనే తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఖరీదైన డోర్‌బెల్‌లు, కెమెరాలు లేదా టెక్నిషియన్ సహాయం లేకుండానే ఈ విధానాన్ని సులభంగా అమర్చుకోవచ్చు.

S

Technology | Published On Jan 21, 2026, 11.26 am IST

Doorvi Doorbell | పైసా ఖర్చు లేకుండా మీ ఇంటికి డోర్ బెల్‌ను ఇలా అమ‌ర్చుకోండి..!
Advertisement

Doorvi Doorbell | స్మార్ట్ హోమ్ టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంత‌లు తొక్కుతోంది. కేవలం ఒక చిన్న క్యూఆర్ కోడ్‌తోనే మీ ఇంటి తలుపు వద్ద ఎవరు ఉన్నారో మీ మొబైల్‌లోనే తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఖరీదైన డోర్‌బెల్‌లు, కెమెరాలు లేదా టెక్నిషియన్ సహాయం లేకుండానే ఈ విధానాన్ని సులభంగా అమర్చుకోవచ్చు. ఈ కొత్త పద్ధతిని క్యూఆర్ డోర్‌బెల్ గా పిలుస్తున్నారు. ఇది ఆధునికంగా ఉండటమే కాకుండా, ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది.

ఈ క్యూఆర్ డోర్‌బెల్‌ను ఉపయోగించాలంటే డోర్వి (Doorvi) అనే మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా మీకు ప్రత్యేకమైన ఒక క్యూఆర్ కోడ్ జ‌న‌రేట్ చేసి ఇవ్వ‌బ‌డుతుంది. ఆ కోడ్‌ను తలుపు మీద అతికిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, వారి వివరాలు వెంటనే మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. దాంతో మీరు తలుపు తెరవకుండానే బయట ఎవరు ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ విధానాన్ని సెటప్ చేయడం కూడా చాలా సులభం. ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో డోర్వి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అవసరమైన అనుమతులను ఇవ్వాలి. ఆ తర్వాత యాప్‌లో కనిపించే క్యూఆర్ కిట్ ను డౌన్‌లోడ్ చేసుకుని, దానిని ప్రింట్ తీసి ఇంటి ప్రధాన ద్వారంపై అతికించాలి. అంతే, ఇక మీ ఇంటికి వచ్చే వారు ఆ కోడ్‌ను స్కాన్ చేసిన ప్రతిసారి వారి సమాచారం మీ మొబైల్‌కు వెంటనే చేరుతుంది.

తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో ఇంటి భద్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఈ క్యూఆర్ డోర్‌బెల్ విధానం ఉపయోగకరంగా మారనుంది. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే, సాధారణమైన పనులే ఎంత స్మార్ట్‌గా మారుతాయో దీనిద్వారా తెలుస్తోంది.

Advertisement
Advertisement